ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check

ఓ ట్రక్కు రాకెట్‌ను మోసుకెళుతూ వంతెన దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫుటేజీ చంద్రయాన్-3 విజయవంతం వెనుక చేసిన కృషిని చూపుతుందని వీడియో పేర్కొంది.సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో వైరల్‌గా మారింది.

వాదన/దావాకు జోడించబడిన సందేశం ఇలా ఉంది,

“अंतरिक्ष के प्रोजेक्ट सफल बनाने मे वैज्ञानिकों के अलावा बहुत लोगो का योगदान होता है। छोटी सी भूल से ही हजारों करोड़ों रुपए स्वाहा हो सकते हैं। आप इस ट्रक ड्राइवर की मनोदशा का अंदाजा लगाएं। जब वह यह कर रहा होगा, सांसें रोक देने वाला वीडियो।”

[అనువాదం: శాస్త్రవేత్తలే కాకుండా, అంతరిక్ష ప్రాజెక్టులు విజయవంతం కావడానికి చాలా మంది సహకరిస్తారు. ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది.ఈ ట్రక్ డ్రైవర్ మానసిక స్థితిని మీరు ఊహించవచ్చు.ఈ వీడియో చుస్తే మీ ఊపిరి బిగుసుకుపోతుంది.]

వీడియో ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా ఇలాంటి వాదనలతో ట్విట్టర్లో షేర్ చేయబడింది.

వైరల్ అయిన ఈ వీడియో యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయమని Digiteye Indiaకు అభ్యర్థన వచ్చింది..

FACT CHECK

వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించడానికి Digiteye India బృందం వారు inVid -(ఒక వీడియో ధృవీకరణ సాధనం) ఉపయోగించారు.మేము ఈ కీఫ్రేమ్‌లను ఉపయోగించి, Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ను అమలు చేయగా,YouTubeలో కూడా ఇదే దావాతో పలువురు వ్యక్తులు ఈ వీడియోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.

వీడియో ప్రామాణికమైనదా కాదా అని తెలుసుకోవడానికి క్షుణ్ణంగా పరిశీలించగా ఏప్రిల్ 2, 2023న ఒక వినియోగదారుడు షేర్ చేసిన ఈ వీడియో Facebookలో మాకు కనిపించింది. “ఎమర్జెన్సీ బ్రిడ్జ్ టెక్నాలజీ ఇలాంటి పరిస్థితిలో చాలా సహాయపడుతుంది” అని క్యాప్షన్తో ఉన్న విజువల్స్ వీడియోలో కనిపించాయి.”

కాని మరింత క్షుణ్ణంగా పరిశీలించగా వీడియోలో “జిమ్ నాటెలో” అనే వాటర్‌మార్క్ ఉంది. మేము Gim Natelo కోసం Googleలో వెతకగా అతను తన పేజీలో అనుకరణ వీడియోలను (simulation videos)పోస్ట్ చేసే గేమర్ అని కనుగొన్నాము.మేము వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లను తీసుకుని,కీవర్డ్‌లు మరియు అతని పేరును ఉపయోగించి వెతకగా, ఈ వీడియో Spintires: MudRunner అనే గేమ్‌లోనిది అని తేలింది.

మేము జిమ్ నాటెలో(Jim Natelo) ప్రొఫైల్‌లో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెతకగా, అదే గేమ్ నుండి అదే గ్రాఫిక్స్ ఉన్న ఇతర వీడియోలు దృష్టికి వచ్చాయి.అయితే, ఈ వీడియో అతని ప్రొఫైల్‌లో అందుబాటులో లేదు.మేము YouTubeలో పరిశీలించగా,వైరల్ సందేశంలో షేర్ చేసిన అవే విజువల్స్ ఉన్న వీడియోను కనుగొన్నాము.యూట్యూబ్ వీడియోలో ఇవి గేమ్‌ విజువల్స్ అని స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు, వీడియోలో చూపిన రాకెట్‌పై ఇస్రో లోగో లేదా ఇండియా అని రాసి లేదు.

కావున, వైరల్ వీడియో చేసిన వాదన తప్పు.

వాదన/CLAIM: ఒక ట్రక్కు రాకెట్‌ను మోసుకెళుతూ వంతెన మీదుగా రవాణా చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అది ఇస్రో రాకెట్ అని వీడియో పేర్కొంది.

నిర్ధారణ/CONCLUSION: వీడియో ‘Spintires: Mudrunner’ అనే గేమ్ నుండి తీసింది మరియు ఇది గేమ్‌లో ఉపయోగించగల కొత్త హ్యాక్‌ను(ట్రిక్) చూపుతుంది.

RATING: Misrepresentation —

[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check]