సెప్టెంబర్ 09-10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జి20 సదస్సు జరిగింది. శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెదర్లాండ్స్ ప్రధాని తన డ్రింక్ పొరపాటున నేల మీద పడిపోతే తానే స్వయంగా నేలను శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెదర్లాండ్స్ ప్రధాని- G20 మీటింగ్ సమయంలో పొరపాటు చేసిన తర్వాత అతను ఏమి చేస్తున్నారో చూసి తెలుసుకోండి👍.
— Sudarshan Dhital (@drspdhital) September 14, 2023
వాట్సాప్‌లో కూడా వీడియో వైరల్ అవుతోంది. వీడియో దావా/ వాదన క్రింద విధంగా ఉంది::
“ఇది G-20 శిఖరాగ్ర సమావేశం 2023లో న్యూఢిల్లీ లో జరిగినప్పుడు,నెదర్లాండ్ ప్రధాని తన చేతిలోని టీ పొరపాటున నేల మీద పడిపోతే, ఆయన స్వచ్ఛంద సేవకులను శుభ్రం చేయడానికి పిలవలేదు. తర్వాత ఏమి జరిగిందో దయచేసి చూడండి. ఇది మన దేశ రాజకీయ ప్రజలకు గుణపాఠం.”
అదే విధమైన వాదన/ దావా తో వీడియో ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ షేర్ చేయబడ్డది.
ఈ వైరల్ వీడియోను పరిశీలన చేయమని Digiteye India కి WhatsApp అభ్యర్థన వచ్చింది.
FACT CHECK
Digiteye India బృందంవారు వీడియోని అనేక కీఫ్రేమ్‌లుగా విభజించడానికి inVidని(video verification tool) ఉపయోగించారు. మేము కీఫ్రేమ్‌లలో ఒకదాన్ని ఉపయోగించి, Googleలో రివర్స్ ఇమేజ్ ఉపయోగించి పరిశీలించి చూస్తే, అది 2018 నాటి వీడియోకి దారితీసింది.
మేము కీలకపదాలను(Keywords) మరియు Google search ఉపయోగించి , 2018 వరకు వెనక్కి వెళ్లి పరిశిలిస్తే, అనేక ఫలితాలు వేలువడ్డాయి. ఆ ఫలితాలలో ఒకటి ABC న్యూస్ వారి కథనానికి దారితీసింది. నివేదిక జూన్ 5, 2018 నాటిది మరియు నెదర్లాండ్స్ PM ఆయన వల్ల చిందిన టీని ఆయననే స్వయంగా శుభ్రం చేస్తున్నట్లు చూపించింది. డచ్ పార్లమెంట్ భవనం వద్ద మార్క్ రుట్టే(Mark Rutte)అనుకోకుండా తన కప్పును జారవిడిచినట్లు అందులో పేర్కొంది. ఆ పనిని హౌస్ కీపింగ్ సిబ్బంది సిబ్బందికి వదిలివేయకుండా ఆయనే స్వయంగా నేలను శుభ్రం చేసారు.ఆయన శుభ్రం చేస్తుండగా, క్లీనింగ్ సిబ్బంది ఆయన్ని ఉత్సాహపరిచారు.
మేము YouTubeలో ఇదే విధంగా శోధన/పరిశీలించినప్పుడు, యూరోన్యూస్ వారు తీసినా వీడియో కనిపించింది.
వీడియో శీర్షిక, చూడండి: డచ్ పీఎం రుట్టే ఆయన వల్ల చిందిన కాఫీని ఆయనే స్వయంగా శుభ్రం చేస్తున్నట్లు చూపించింది.వైరల్ దావా/వాదనలోఉపయోగించింది అదే వీడియో.వీడియో జూన్ 5, 2018 నాటిది.
అందుకే, G-20 సమావేశం సందర్భంలో తప్పుడు వాదన/దావాతో పాత వీడియో మళ్లీ ప్రచారం చేయబడుతోంది.
వాదన/Claim: ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో నెదర్లాండ్స్ PM మార్క్ రుట్టే(Mark Rutte)తన పానీయం/డ్రింక్ పొరపాటున నేల మీద పడితే తానే స్వయంగా శుభ్రం చేసారు.
నిర్ధారణ: ఈ వీడియో 2018 నాటిది మరియు డచ్ పార్లమెంట్ వద్ద చిందిన పానీయాన్ని మార్క్ రుట్టే(Mark Rutte) శుభ్రం చేస్తున్నట్లు చూపిస్తుంది. ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో జరిగిన సంఘటన కాదు.
RATING: Misinterpretation –
[మరి కొన్ని Fact Checks:Is Tata Motors giving out gifts for the success of G20 summit in Delhi? Fact Check]