యూరప్‌లోని ఒక చర్చిని నిజంగా నరసింహ దేవాలయంగా మార్చారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: యూరప్‌లో ఒక చర్చిని నరసింహ దేవాలయంగా మార్చారని వైరల్ వీడియో ద్వారా ఒక వాదన/దావా చేయబడింది.
నిర్ధారణ /Conclusion: తప్పుగా చూపించడం .ఆ స్థలం న్యూయార్క్‌లోని ఎల్మిరాలోని పరనిత్య నరసింహ ఆలయం, ఇది గతంలో ‘అవర్ లేడీ ఆఫ్ లౌర్డ్స్ కాథలిక్ చర్చి’గా ఉండేది. దీనిని హిందూ భక్తి మార్గ సమాజం చట్టబద్ధంగా కొనుగోలు చేసి పునఃప్రయోజనం కోసం ఉపయోగించబడింది.
రేటింగ్ /Rating: తప్పుగా చూపించడం — ![]()
**********************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************
యూరప్‌లో నరసింహ ఆలయం నిర్మించబడిందని ఆరోపిస్తూ పలువురు వినియోగదారులు ఒక వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎక్స్ యూజర్ ‘దిఎర్త్సోల్1’ ఈ క్రింది శీర్షికతో ఈ వాదన చేశారు: యునో రివర్స్. యూరప్‌లోని చర్చి నరసింహ దేవాలయంగా మార్చబడింది. దీనితో పాటు, ‘యూరప్‌లోని చర్చి నరసింహ దేవాలయంగా మార్చబడింది’ అనే శీర్షికతో కూడిన సుమారు 82 సెకన్ల వీడియో కూడా ఉంది. ఈ పోస్ట్‌కు సుమారు 205,000 వీక్షణలు లభించాయి మరియు దీనిని మీరు క్రింద చూడవచ్చు.
UNO REVERSE 😂
CHURCH in Europe converted to Narsimha Temple🙏 pic.twitter.com/TjJtkIPOXF
— The Earth Soul (@TheEarthSoul1) December 8, 2025

ఇతర వినియోగదారులు కూడా అదే చిత్రాన్ని/వీడియోను హిందీలో ఇలా షేర్ చేసుకున్నారు. దానిని ఆంగ్లంలోకి అనువదిస్తే, ఈ విధంగా ఉంది : “యూరప్‌లోని ఒక గ్రామంలోని క్రైస్తవులందరూ సనాతన ధర్మాన్ని స్వీకరించారు, అందుకే అక్కడి ఒక చర్చిని నరసింహ దేవాలయంగా మార్చారు. ఎవరినీ ప్రలోభపెట్టలేదు లేదా బెదిరించలేదు, సనాతన ధర్మమే సత్యమని గ్రహించి, అందరూ సనాతన ధర్మాన్ని స్వీకరించారు.”🙏
यूरोप के एक गांव के सभी ईसाई लोगों ने सनातन अपना लिया तो वहां की एक चर्च को नरसिंह मंदिर में परिवर्तित किया गया
किसी को कोई लालच नहीं दिया ना किसी को डर दिखाया
सिर्फ जब उन्होंने जाना कि सनातन ही सत्य है तो सब लोग सनातनी बन गए🙏 pic.twitter.com/lTMwq4kgaH
— Ocean Jain (@ocjain4) December 8, 2025
మరొక వినియోగదారుడు కూడా ఇలాంటి వాదననే ఒకటి షేర్ చేసుకున్నారు , దానిని ఇక్కడ చూడవచ్చు.
వాస్తవ పరిశీలన
DigitEYE India బృందం ఈ వాదనను పరిశీలించగా, ఇది తప్పుగా చూపించే ప్రయత్నంగా కనుగొంది.ఆ దేవాలయం Europe/ఐరోపాలో లేదు; నిజానికి అది న్యూయార్క్‌లోని ఎల్మిరాలో ఉన్న పరా నిత్య నరసింహ దేవాలయం. హిందూ భక్తి మార్గ సంఘం గతంలో ‘అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్ కాథలిక్ చర్చి’గా ఉన్న భవనాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేసి, దానిని పునరుద్ధరించి, దేవాలయంగా మార్చింది.
వివరాలు :
ఆ వాదన గురించి తెలుసుకోవడానికి మేము మొదట వీడియోలోని వివిధ కీలక ఫ్రేమ్‌ల నుండి రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా,‘భక్తిమార్గ_అమెరికా’ సహకారంతో ‘పరమహంస_విశ్వానంద’ సెప్టెంబర్ 3, 2023న చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను కనుగొన్నము. పోస్ట్ యొక్క శీర్షిక “ప్రేమ, ఆనందం మరియు ఉత్సాహం: ఎల్మిరాలో శుభప్రదమైన ఆలయ ప్రారంభోత్సవం – మొదటి రోజు”. వీడియో మరియు దాని స్క్రీన్‌షాట్‌ను క్రింద చూడండి –
View this post on Instagram

తర్వాత, మేము భక్తిమార్గ అమెరికా వారు జూన్ 11,2024న చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను గమనించాము. ఆలయ దర్శనానికి సంబంధించిన ఒక వీడియో జతచేయబడింది మరియు దాని శీర్షికలో ఇలా ఉంది: “ఇది అద్భుతమైన క్షణం,న్యూయార్క్‌లోని ఎల్మిరాలో జరిగిన పరా నిత్య నరసింహ దేవాలయ ప్రారంభోత్సవంలో పరా నిత్య నరసింహుని మొట్టమొదటి దర్శనం.”
ఈ ఆధారాలు లభించిన తర్వాత, మరింత సమాచారం తెలుసుకోవడానికి మేము “భక్తిమార్గ టెంపుల్ చర్చ్ గ్రౌండ్స్” అనే పదబంధంతో కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా, మైట్విన్టియర్స్ ప్రచురించిన ఒక నివేదికను కనుగొన్నము, దాని ప్రకారం,”హిందూ మతంలో మూలాలు కలిగి ఉన్న జర్మనీకి చెందిన భక్తి మార్గ అనే ఆధ్యాత్మిక ఉద్యమం, జనవరిలో వెస్ట్ ఎల్మిరాలోని పూర్వపు ‘అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్ పారిష్’ను కొనుగోలు చేసింది. ఈ పారిష్/చర్చి 2021 శరదృతువు కాలంలో మూసివేయబబడిందని” పేర్కింది.
నివేదిక లో ‘భక్తిమార్గ’బృందం , చర్చిపై గౌరవంతో చర్చి యొక్క వివిధ అంతర్భాగాలని యధాతదిగా కాపాడుతూ/ఉంచి, మిగతా భాగాన్ని ఎలా పునరుద్ధరిస్తోందో ప్రస్తావించింది. నివేదికలోని కొంత విభాగాన్ని క్రింద చూడండి –

స్టార్ గెజెట్ నుండి వచ్చిన మరో నివేదిక ఈ విషయాన్ని ధృవీకరించింది. నివేదిక ప్రకారం: “జర్మనీలో ఉన్న భక్తి మార్గ అనే నవ్య-హిందూ సంస్థ, జనవరి 2022లో 1100 డబ్ల్యూ.వాటర్ స్ట్రీట్‌లో ఉన్న పూర్వపు అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్ కాథలిక్ చర్చిని కొనుగోలు చేసి,సెప్టెంబర్ 2023లో ‘పరా నిత్య నరసింహ దేవాలయం’ అనే కొత్త పేరుతో ఆ భవనాన్ని అధికారికంగా తిరిగి ప్రారంభించింది.” మరింత నిర్ధారణ కోసం మేము మ్యాప్లోపరా నిత్య నరసింహ దేవాలయం యొక్క ఖచ్చితమైన చిరునామా కోసం వెతికినప్పుడు, దేవాలయ చిరునామా నిజంగానే “1100 W Church St, Elmira, NY 14905, United States” అని ఉంది. కింద స్క్రీన్‌షాట్‌ను చూడండి –

అందువల్ల, ఈ వాదనలో, తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది.
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు

