ప్రధాని మోదీ ర్యాలీకి హాజరయ్యే విద్యార్థులకు ‘దేవ్ భూమి’ ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం 50 బోనస్ మార్కులు ఇస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ప్రధాని మోదీ ర్యాలీకి హాజరయ్యే విద్యార్థులకు దేవ్ భూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం 50 బోనస్ మార్కులు ఇస్తున్నట్లు వైరల్ నోటీసు పేర్కొన్నదనేది వాదన.

నిర్ధారణ /Conclusion: ఈ వాదన తప్పు. విశ్వవిద్యాలయం అధికారులు తమ X ఖాతాలో “వైరల్ అవుతున్న నోటీసు కల్పితమని” స్పష్టం చేసి, మరియు ఉత్తరాఖండ్ ఉన్నత విద్యా శాఖకు ఒక వివరణ లేఖను కూడా జారీ చేశారు.

రేటింగ్ /Rating : పూర్తిగా తప్పు — Five rating


దేవ్ భూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం (DBUU) నవంబర్ 9, 2025న తమ క్యాంపస్‌లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ర్యాలీకి హాజరయ్యే విద్యార్థులకు 50 మార్కులు కేటాయిస్తున్నారంటూ అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
X యూజర్ ‘pbhushan1’ అలాంటి వాదన/దావానే చేస్తూ, డెహ్రాడూన్‌లోని దేవ్ భూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం (DBUU) నుండి వచ్చినట్లు చెప్పబడుతున్న అధికారిక నోటీసు యొక్క చిత్రాన్ని షేర్ చేసారు.

ఈ నోటీసులో బి.టెక్ సిఎస్‌ఇ (2వ సంవత్సరం)స్పెషలైజేషన్, మరియు బిసిఎ (2వ సంవత్సరం) విద్యార్థులు నవంబర్ 9, 2025న డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌ఆర్‌ఐ)లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో “సంభాషణ” నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి విద్యార్థికి 50 ఇంటర్నల్ మార్కులు ఇవ్వబడతాయని తెలియజేసినట్లు తెలుస్తోంది.

ఈ పోస్ట్ను 617,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు మరియు దానిని ఇక్కడ చూడవచ్చు.

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే షేర్ చేశారు , వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు

వాస్తవ పరిశీలన

ఈ వాదనను దర్యాప్తు చేయాలని DigitEYE India బృందం నిర్ణయించి,పరిశీలించగా,అది తప్పు అని తేలింది. ఈ వాదనలో షేర్ చేయబడిన నోటీసు కల్పితం మరియు నకిలీది. నవంబర్ 9, 2025న ప్రధానమంత్రి మోడీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించినప్పుడు DBUU దీనిని జారీ చేసిందనే వాదనను/దావాను DBUU విశ్వవిద్యాలయం స్పష్టంగా ఖండించింది, మరియు నరేంద్ర మోడీ,విద్యార్థుల మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదు.

విశ్వవిద్యాలయం ఇలాంటి సర్క్యులర్ ఏమైనా జారీ చేసిందా అని తెలుసుకోవడానికి ముందుగా మేము దేవ్ భూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ మరియు నోటీసుల విభాగాన్ని సమీక్షించగా, PMతో సంభాషణ,తప్పనిసరి హాజరు లేదా ఇతర కార్యక్రమాలకు మార్కులు కేటాయిస్తున్నట్లు తెలిపే ఎటువంటి ప్రకటనలు లభించలేదు.
వెబ్‌సైట్‌లోని  ‘నోటీసుల విభాగం’ యొక్క స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు.

ఏదైనా అధికారిక ప్రతిస్పందన కోసం అన్వేషించగా , DBUU యాజమాన్యం నోటీసు ప్రామాణికమైనది కాదని నిర్ధారిస్తూ ఒక ప్రకటన జారీ చేసిందని మేము కనుగొన్నాము.వారు ఉత్తరాఖండ్ ఉన్నత విద్యా శాఖకు ఒక వివరణ లేఖను జారీ చేశారు మరియు క్రింద చూపిన విధంగా వారి X ఖాతాలో కూడా లేఖను పోస్ట్ చేశారు.

ఆ లేఖలో వారు ఇలా పేర్కొన్నారు: “09 నవంబర్ 2025న జరగనున్న FRI సందర్శనకు,మార్కులకు సంబంధించి DBUU పేరుతో ,గుర్తించబడని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నకిలీ నోటీసు పంపిణీ చేయబడిందని మా దృష్టికి వచ్చింది”.ఇది నకిలీ నోటీసు మరియు విశ్వవిద్యాలయం జారీ చేయలేదు.దీనిని క్రింద చూడవచ్చు.

 

మరింత సమాచారం కోసం చూడగా,మోడీ నవంబర్ 9, 2025న ఉత్తరాఖండ్ 25వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు డెహ్రాడూన్‌ను సందర్శించారు, మరియు ₹8,260 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించినట్లు నివేదికలు తెలిపాయి. PMO అధికారిక నివేదిక విడుదల ప్రకారం, నవంబర్ 9న జరిగిన షెడ్యూల్‌లో FRIలో రజతోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించడం, నీరు, శక్తి మరియు క్రీడా రంగాలలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆవిష్కరించడం మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి.

చివరగా, ప్రధాని మోదీతో విద్యార్థుల “తప్పనిసరి”సంభాషణ కోసం అన్వేషించగా, దానికి సంబంధించి ఎటువంటి నివేదికలు లేవు.

కాబట్టి ఈ వాదనలో వాస్తవం లేదు, ఇది పూర్తిగా తప్పు.

********************************************************************

మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు :

భారత జట్టు మైదానంలోకి వచ్చే ముందు పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు ఎయిర్ ఫ్రెషనర్ స్ప్రే చేసిందా? వాస్తవ పరిశీలన

ప్రభుత్వ సేవలలో అవినీతిని నివేదించడానికి PMO ఇండియా 9851145045 హాట్‌లైన్‌ను పౌరుల కోసం ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.