భారత జాతీయ గీతం వినపడగానే నడుస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవ సూచకంగా ఆగిపోయారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత జాతీయ గీతం వినపడగానే నడుస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవ సూచకంగా ఆగిపోయారనేది వాదన/దావా
నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే దావా. ఫుటేజీ సవరించబడింది/మార్చబడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా జాతీయ గీతం వినపడగానే గౌరవ సూచకంగా నడకను ఆపేసి, ఆగిపోయారు.
రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే దావా–
****************************************************************************
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత జాతీయ గీతాన్ని వినపడగానే గౌరవ సూచకంగా ఆగిపోయారని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పలువురు వినియోగదారులు పేర్కొన్నారు.
ఒక X వినియోగదారుడు ‘sttalkindia’ 4 సెప్టెంబర్ 2025న అటువంటి పోస్ట్‌ను షేర్ చేసారు, పుతిన్ భారత జాతీయ గీతాన్ని “అర్థం చేసుకున్నారు” మరియు “గౌరవ సూచకంగా అలాగే ఆగిపోయారు” అని పేర్కొన్నారు.
దిగువ పోస్ట్‌ను చూడవచ్చు:
When #Putin understood #India #NationalAnthem & stayed still in respect. pic.twitter.com/8SEAT94f5U
— Straight Talk India (@sttalkindia) September 4, 2025
మరొక X వినియోగదారుడు అదే వీడియోను ఈ విధంగా షేర్ చేసారు:“पुतिन जो भारत के राष्ट्रीय गान पर ठहर गए भारत के और मोदी जी के सच्चे दोस्त ” ఇంగ్లీషులో అనువాదం ఇలా ఉంది: పుతిన్ భారత జాతీయ గీతం కోసం ఆగారు. భారతదేశానికి మరియు మోదీకి నిజమైన స్నేహితుడు. పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు:
पुतिन जो भारत के राष्ट्रीय गान पर ठहर गए 🫡🫡
भारत के और मोदी जी के सच्चे दोस्त ♥️♥️ pic.twitter.com/Z58lv1lP12— Meenakshi Singh (@Meenaks06356943) September 2, 2025
వాస్తవ పరిశీలన
DigitEYE India బృందం ఈ దావా యొక్క ప్రామాణికతను పరిశీలించగా, అది తప్పుదారి పట్టించే విధంగా ఉందని కనుగొన్నారు. వీడియో ఫుటేజ్ మూలం గుర్తించడానికి మేము కీఫ్రేమ్‌లు తీసికొని శోధించగా, 11 సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియో, మరియు అందులో రష్యన్ గీతం ప్లే చేయబడిందని తెలుకున్నాము.
అసలు/మూల వీడియో ఫుటేజ్, 23-24 సెప్టెంబర్ 2011లో మాస్కోలోని లుజ్నికి స్పోర్ట్స్ ప్యాలెస్ లో జరిగిన ఆల్-రష్యన్ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ సందర్భంలోని ఫుటేజ్ అని గుర్తించాము.ఈ కార్యక్రమంలో రష్యన్ జాతీయ గీతం ప్లే చేయడంతో నడుతుస్తున్న పుతిన్ గౌరవసూచకంగా ఆగిపోయారు.అది భారత జాతీయ గీతం కాదని స్పష్టంగా తెలుస్తుంది.
వీడియో ఫుటేజీని ఇక్కడ చూడండి:
10 సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన అదే వీడియోను ఇక్కడ చూడవచ్చు.
13 సంవత్సరాల క్రితం పోస్ట్ చేసిన మరొక వీడియోలో కూడా రష్యన్ జాతీయ గీతం మొదలుకాగానే పుతిన్ నడక ఆపి గౌరవసూచకంగా నిలబడటం చూడవచ్చు.
టైమ్‌స్టాంప్ 1:30 నుండి ఇక్కడ ఫుటేజీని చూడవచ్చు:
బోర్డు సారాంశం యొక్క తెలుగు అనువాదం ఇలా ఉంది: కాంగ్రెస్ ఆఫ్ ది ఆల్ రష్యన్ పొలిటికల్ పార్టీ “యునైటెడ్ రష్యా”, సెప్టెంబర్ 23-24, 2011. పైన ఇంగ్లీష్ అనువాదం కూడా చూడవచ్చు.
సంఘటన యొక్క సందర్భం ఏమిటంటే, అప్పటి రష్యా అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ 2012 రాష్ట్రపతి అభ్యర్థిగా వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రతిపాదించారు. 24 సెప్టెంబర్ 2011న అల్ జజీరా ప్రచురించిన నివేదిక ఈ సంఘటనను స్పష్టీకరిస్తుంది.
దిగువ నివేదిక నుండి ఆ వార్తా స్నిప్పెట్‌ని చూడవచ్చు.
వీక్షకులను తప్పుదారి పట్టించడానికి 2011 రష్యన్ రాజకీయ సంఘటన యొక్క అసలు ఫుటేజ్‌లో భారత జాతీయ గీతాన్ని చొప్పించే ప్రయత్నం జరిగింది.
కావున, ఈ దావా తప్పుదారి పట్టించేదిగా ఉంది.