ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు వేయడానికి ముందు వినేష్ ఫోగట్ 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అనుమతించదగిన పరిమితి కంటే 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉండటంతో ఒలింపిక్స్ ఫైనల్‌లో అనర్హతకు గురైందనేది వాదన.

నిర్ధారణ /Conclusion:తప్పు దారి పట్టించే వాదన. వినేష్ ఫోగట్ తన బరువు కేటగిరీలో 50 కిలోల పరిమితి కంటే కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఎక్కువగా ఉండటం వలన అనర్హురాలయ్యారు.

రేటింగ్/Rating: :తప్పు దారి పట్టించే వాదన —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

భారతీయ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ 2024 పారిస్ ఒలింపిక్స్ లో విజయవంతమైన బౌట్‌లు సాధించడంతో ఆగస్టు 6,2024న ముఖ్యాంశాలుగా మారి అందరి దృష్టి అమెపై పడింది. అయితే మరుసటి రోజు ఉదయం ఆమె అధిక బరువు కారణంగా ఫైనల్‌లో పాల్గొనేందుకు అనర్హురాలంటూ  దిగ్భ్రాంతికరమైన న్యూస్ వెలువడింది.

ఎక్కువ వివరాలను చెప్పకుండా వినేష్ ఫోగట్ తన 50 కిలోల బరువు కేటగిరీలో “కేటగిరీ” కంటే కొంచెం ఎక్కువని IOA అధికారికంగా పేర్కొంది.

“ఆమె 2.1 కిలోల అధిక బరువుతో ఉంది. 2 కిలోలు అనుమతించదగిన పరిమితి. వినేష్ 2 కిలోలు + 100 గ్రాముల బరువుతో ఉన్నారు” అని సోషల్ మీడియాలో వాదన/దావా పోస్ట్ చేయబడింది.

వినేష్ ఫోగట్ 50 కిలోల పరిమితి కంటే 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉన్నారని, అందువల్ల అనర్హురాలంటూ పేర్కొంటూ సోషల్ మీడియా మొదట పోస్ట్‌లు వైరల్ అయ్యాయి.

FACT-CHECK

ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (IOA) అధికారిక ప్రకటన ప్రకారం, రెజ్లర్ “50 కిలోల కంటే కొన్ని గ్రాముల బరువు కలిగి ఉన్నారు”, ఇది ఆమె అనర్హతకు దారితీసింది.
Xలో IOA ఇలా పేర్కొంది: “ఉమెన్స్ రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుండి వినేష్ ఫోగాట్ యొక్క అనర్హత వార్తను భారత బృందం తెలియపరచడం విచారకరం. రాత్రంతా బృందం ఎంత శ్రమించినప్పటికీ, ఆమె ఈ ఉదయం 50 కిలోల కంటే కొన్ని గ్రాముల అధిక బరువుతో ఉంది”.

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ బరువు సమస్య ఆమె అనర్హతకు దారితీసిందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దివాలా ఒక ప్రకటనలో వివరించారు.
ఈ ప్రకటనలో, పార్దివాలా మాట్లాడుతూ, “”అయితే, వినేష్ తన 50 కిలోల బరువు కంటే 100 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు కనుగొనబడటంతో ఆమెపై అనర్హత వేటు పడింది.ఆమె జుట్టు కత్తిరించడం సహా అన్ని కఠినమైన చర్యలు ప్రయత్నించినప్పటి ఆమె అనుమతించబడిన 50 కిలోల బరువుకు రాలేక పోయింది.

మరియు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కూడా పార్లమెంటులో తన ప్రకటనలో ఈ క్రింది విధంగా చెప్పారు:


అందువల్ల, వినేష్ ఫోగట్ 50-కిలోల పరిమితి కంటే 2.1 కిలోల బరువు ఎక్కువగా ఉన్నారనే వాదన నిరాధారమైనది మరియు తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

మీ లిప్ స్టిక్ కోచినియల్ బగ్స్ నుండి తీసిన రంగుతో తయారు చేయబడిందా? వాస్తవ పరిశీలన

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*