వాదన/Claim: ఏనుగులు 1 గంట ముందే వాయనాడ్ కొండచరియలను పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. దావా చేయబడిన వీడియో జనవరి 2024 నాటి పాత వీడియో, మరియు జూలై 30, 2024న వాయనాడ్ కొండచరియలు విరిగిపడడానికి ఒక గంట ముందు జరిగిన సంఘటన కాదు.
రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.
లేదా దిగువ కథనాన్ని చదవండి.
************************************************************************
కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటానికి ముందు ఏనుగుల గుంపు సురక్షిత ప్రాంతానికి పరుగెడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
Elephants running to safety 1 hour before the landslide in Wayanad, Kerala. Animals have subtle vision. pic.twitter.com/BSywnKRjtP
— 🚩Mohan Gowda🇮🇳 (@MohanGowda_HJS) August 4, 2024
వీడియో క్లిప్ఈ విధంగా షేర్ చేయబడింది: “కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటానికి 1 గంట ముందు ఏనుగులు సురక్షిత ప్రాంతానికి పరుగెత్తుతున్నాయి. జంతువులకు సూక్ష్మ దృష్టి ఉంటుంది.”
(సూక్ష్మ దృష్టి(subtle vision)అనేది భౌతిక కంటికి కనిపించని వస్తువులను/పరిస్థితులను చూడగల/పసిగట్టగల అంతర్గత భావం లేదా దృష్టి.)
జూలై 30, 2024న సంభవించిన విషాదకరమైన కొండచరియలను జంతువులు ఒక గంట ముందే పసిగట్టాయని మరియు జంతువులకు ప్రకృతి వైపరీత్యాల గురించి సూక్ష్మ దృష్టి ఉంటుందని దావా/ వాదన చేయబడింది. వాదనలు ఇక్కడ మరియు ఇక్కడ Xలో అందుబాటులో ఉన్నాయి.
వాస్తవ పరిశీలన వివరాలు:
మేము(DigitEye India బృందం) వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా ఈ వీడియో క్లిప్ నాలుగు నెలల క్రితం 2024లో అప్‌లోడ్ చేయబడిన @TravelwithAJ96 యొక్క Youtube ఛానెల్లోనిదని తెలుసుకున్నాము.
ఇదే వీడియోని Instagramలో @wayanadan మరియు jashir.ibrahim ద్వారా జనవరి 12, 2024న “కేవలం 900 కండి విషయాలు…” అనే శీర్షికతో చూడవచ్చు.
క్లెయిమ్ చేసినట్లుగా ఏనుగులు వాయనాడ్ కొండచరియలు విరిగిపడటానికి(జూలై 30, 2024) ఒక గంట ముందు కాక, జనవరి 2024లో సురక్షిత ప్రాంతానికి పరుగెత్తుతున్నాయని ఒరిజినల్ వీడియో క్లిప్ స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి, ఈ వాదన తప్పు.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
మీ లిప్ స్టిక్ కోచినియల్ బగ్స్ నుండి తీసిన రంగుతో తయారు చేయబడిందా? వాస్తవ పరిశీలన