వాదన/Claim: ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. చిత్రాలు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం లోనివి కాదు, థాయ్‌లాండ్‌లోనివి.
రేటింగ్: పూర్తిగా తప్పు- –
వాస్తవ పరిశీలన వివరాలు
సోషల్ మీడియా వినియోగదారులు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం ముఖ ద్వారం లోపలి నుండి ఉదయిస్తున్నసూర్యుడి చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.ఆలయం లోపల నుండి సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉండటం షేర్ చేసిన చిత్రంలో చూడవచ్చు.
ఇది “200 సంవత్సరాలకు ఒకసారి ఎలా జరుగుతుందని” అని వినియోగదారులు షేర్ చేసుకుంటున్నారు.
Digiteye India బృందంకు వాస్తవ పరిశీలన చేయమని Whatsapp నంబర్‌లో అభ్యర్ధన అందుకుంది.
షేర్డ్ మెసేజ్ ఈ విధంగా ఉంది: “ఇది కోణార్క్ ఆలయం లోపలి సూర్యోదయం. ఈ సంఘటన 200 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని వారు చెప్పారు.”
Fact Check:
ఈ చిత్రం ఎంత పాతదో తెలుసుకోవడానికి మేము సోషల్ మీడియాను పరిశీలించినప్పుడు, ఇది 2015 నుండి ప్రచారంలో ఉందని మేము గమనించాము. YouTubeలో కూడా మేము ఇలాంటి వీడియోలు ఉన్నాయని తెలుకున్నాము.
క్షుణ్ణంగా పరిశీలిస్తే, వైరల్ చిత్రంలో ఉన్న ఆలయ నిర్మాణ శైలికి ఒడిశాలోని కోణార్క్ ఆలయ నిర్మాణ శైలికి పోలిక ఉన్నట్లు కనపడదు. ప్రధాన ఆలయం/ముఖ ద్వారం ఏకశిలా సారూప్యంగా(ఒకేలా) కనిపిస్తున్నప్పటికీ, పక్కన గోడలు మరియు ఇరువైపులా ఆలయ గోపురాలు కోణార్క్ ఆలయా ప్రధాన నిర్మాణానికి జోడించబడలేదు.
గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అది థాయ్‌లాండ్‌లోని ప్రసాత్ హిన్ ఫానోమ్ రంగ్ టెంపుల్ అని తేలింది. ఫానోమ్ రంగ్ అని కూడా పిలుస్తారు, ఈ హిందూ ఖైమర్ సామ్రాజ్య దేవాలయం థాయ్‌లాండ్‌లోని ఇసాన్‌లోని బురిరామ్ ప్రావిన్స్‌లో అంతరించిపోయిన అగ్నిపర్వతం అంచులపై నిర్మించబడి ఉంది. 10వ-13వ శతాబ్దాల మధ్య నిర్మించబడి, ఇది ప్రధానంగా హిందూ దేవుడు శివుని ఆలయం.
ఈ ఆలయం అన్ని తోరణాల/ద్వారాల గుండా సూర్యుడు ప్రకాశిస్తూ, అపురూపమైన సూర్య కిరణాలు కూడా ప్రసిద్ధి చెందింది.
“ప్రసిద్ధమైన, చారిత్రాత్మక దేవాలయం యొక్క మొత్తం పదిహేను రాతి ద్వారాల గుండా సూర్యుడు సంవత్సరంలో నాలుగు సార్లు ప్రకాశిస్తాడని బురిరామ్ టైమ్స్ పేర్కొంది.
ఇది 3 నుండి 5 ఏప్రిల్ వరకు మరియు 8 నుండి 10 సెప్టెంబర్ వరకు సూర్యోదయం సమయంలో మరియు 5 నుండి 7 మార్చి వరకు మరియు 5 నుండి 7 అక్టోబర్ వరకు సూర్యాస్తమయం సమయంలో జరుగుతుంది (కొన్ని సంవత్సరాలలో ఒక రోజు ముందు జరుగుతుంది). సూర్యుడు శివలింగాన్ని తాకుతూ వెళుతుండగా, అది చూసేవాళ్లకు అదృష్టాన్ని కలిగిస్తుందని గాఢ నమ్మకం.
బ్యాంకాక్ పోస్ట్ “సూర్యునికి సంబంధించిన ఈ సంఘటనలు(solar events)మార్చి మరియు సెప్టెంబర్‌లలో విషువత్తులకి(equinoxes)ఇరువైపులా ఏటా సుమారు 14 రోజులు ఎలా జరుగుతాయనేది” నివేదిస్తుంది.
మరి కొన్ని fact Checks:
నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన