వాదన/Claim: బ్రిటీష్ కాలం నుండి 2017 వరకు యుపిలో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని,ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ హయాంలో 24 ఉన్నాయనేది వాదన.
నిర్ధారణ/Conclusion: విమానయాన మంత్రి ప్రకటన ప్రకారం, 2017కి ముందు, ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు రికార్డులో ఉన్నాయి మరియు ప్రస్తుతం 10 విమానాశ్రయాలు వినియోగంలో ఉండగా మరొక 14 నిర్మాణంలో ఉన్నాయి.
రేటింగ్:తప్పు దారి పట్టించే వార్త —
వాస్తవ పరిశీలన వివరాలు
2017లో యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ వీడియో ఒకటి షేర్ చేయబడింది.ప్రస్తుత యుపి ప్రభుత్వ హయాంలో 24 విమానాశ్రయాలను ప్రకటించారని, వాటిలో 10 పని చేస్తున్నాయని, మరొక 14 నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది.
Ground Reality of Common People
Savage reply on development in Uttar Pradesh #AyalaanReview #ThisIsMauritius #FridaysWithArmaan #GunturKaraamReview #KH237 #RamMandirPranPratishta #TejRan pic.twitter.com/EZPPbgxIcI— DesiVerse (@desi_verse) January 12, 2024
ట్విట్టర్‌లో వీడియో ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
బ్రిటీష్ పాలన నుండి 2017 మార్చిలో అఖిలేష్ యాదవ్ పాలన ముగిసేనాటికి ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే పనిచేస్తున్నాయని వీడియో క్లిప్ లోని వార్త పేర్కొంది.నేడు యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, 24 విమానాశ్రయాలు ఉన్నాయి, వాటిలో 10 పనిచేస్తున్నాయి,మరొక 14 నిర్మాణంలో ఉన్నాయి.బ్రిటీష్‌వారు మరియు 2017కి ముందు వరకు ఉన్న అన్ని ప్రభుత్వాలు కేవలం రెండు విమానాశ్రయాలను మాత్రమే నిర్మించగలిగారు.
వాస్తవ పరిశీలన
Digiteye India teamవారు వాస్తవాన్ని పరిశీలించడం కోసం ఉత్తరప్రదేశ్‌లోని విమానాశ్రయాలను గురించి Googleలో సెర్చ్ నిర్వహించగా,జనవరి 11, 2024న విమానయాన మంత్రి జ్యోతిరాదియా సింధియా UP విమానాశ్రయాలపై పోస్ట్ చేసిన తాజా PIB పత్రికా ప్రకటనకు దారితీసింది.ఇక్కడ 2014లో ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని,ప్రస్తుతం అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయంతో సహా 10 విమానాశ్రయాలు ఉన్నాయని మంత్రి చెప్పారని పేర్కొన్నారు.
ఈ వార్త ANI యొక్క వీడియో వార్తలలో కూడా ప్రసారం చేయబడింది.“2014లో ఉత్తరప్రదేశ్‌లో కేవలం 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు రాష్ట్రంలో అయోధ్య విమానాశ్రయంతో సహా 10 విమానాశ్రయాలు ఉన్నాయని” మంత్రి ప్రకటించడం వీడియోలో మనం చూడవచ్చు.వచ్చే ఏడాది నాటికి యూపీలో మరో ఐదు విమానాశ్రయాలు రానున్నాయి. అజంగఢ్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకూట్‌లలో ఒకొక్క విమానాశ్రయాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నారు.ఈ ఏడాది చివరి నాటికి జెవార్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఉండే విమానాశ్రయం కూడా సిద్ధం అవుతుంది.
కావున,యోగి ఆదిత్యనాథ్ కంటే ముందు యూపీలో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయన్న వాదన తప్పు. లక్నో మరియు వారణాసి విమానాశ్రయాలు నిరంతరం వినియోగంలో ఉండగా, 2014 నాటికి మాత్రం UPలో ఆరు విమానాశ్రయాలు రికార్డులో ఉన్నాయి మరియు బ్రిటిష్ పాలన నుండి రాష్ట్రంలో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయనే వాదన కూడా తప్పు.
మరి కొన్ని Fact Checks: