తమిళనాడులోని బీహెచ్ఈఎల్ (తిరుచ్చి యూనిట్) రామమందిరం కోసం ఈ భారీ గంటలను తయారు చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:తమిళనాడులోని బీహెచ్ఈఎల్ (తిరుచ్చి యూనిట్) రామమందిరం కోసం ఈ భారీ గంటలను చేసిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion:నిజానికి ఈ గంటలు అయోధ్య రామమందిరం కోసం తయారు చేయబడినవే,కానీ క్లెయిమ్ చేసినట్లుగా BHEL(త్రిచ్చి) కాకుండా, తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని మోహనూర్ రోడ్‌లోని “ఆండాల్ మోల్డింగ్ వర్క్స్ ” వారు వీటిని తయారు చేసారు.

రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు:

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థ – భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బిహెచ్‌ఇఎల్) -భారీ గుడి గంటలను తయారు చేసి ట్రక్కులో అయోధ్య రామ మందిరానికి తరలిస్తుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది.

వాదన ఇలా ఉంది:भारत हैवी इलेक्ट्रिकल्स, त्रिचुरापल्ली में निर्माण कर अयोध्या मंदिर को भेजे जा रहे हैं ये सभी घंटे जय श्री राम लिख कर शेयर करें (తెలుగు అనువాదం: “BHEL తిరుచ్చి సంస్థ అయోధ్య ఆలయం కోసం ఈ గంటలను తయారు చేసి అయోధ్యాధామానికి (రామ మందిరం)కి తరలిస్తోంది.కామెంట్ బాక్స్‌లో జై శ్రీ రామ్ అని వ్రాసి, దానిని భక్తుడిగా షేర్ చేయండి”).

FACT CHECK

BHEL ఒక ప్రభుత్వ రంగ సంస్థ (PSU) మరియు అటువంటి నివేదిక ఏ వార్తా సంస్థలలో కనిపించలేదు కావున Digiteye India బృందం వాస్తవ పరిశీలన ప్రక్రియ చేపట్టింది.గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వీడియో దృశ్యాల కీలక ఫ్రేములు పరిశీలించినప్పుడు, ఒరిజినల్ వీడియో గత నెలలో ‘మోజో స్టోరీ’ అనే వీడియో పబ్లిషర్ ద్వారా అప్‌లోడ్ చేయబడిందని, మరియు తమిళనాడు నుండి ‘నలభై రెండు(42) గుడి గంటలు’ రవాణా చేయబడినట్లు తెలుసుకున్నాము.

గూగుల్ న్యూస్‌లో మరింత సమాచారం కోసం చూడగా, బెంగళూరుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే భక్తుడు అయోధ్య రామ మందిరం కోసం నమక్కల్ జిల్లాలోని మోహనూర్ రోడ్‌లోని “ఆండాల్ మోల్డింగ్ వర్క్స్”‌కి “48 గుడి గంటల తయారీ” ఆర్డర్ ఇచ్చాడని తెలిసింది.మొదటి బ్యాచ్ 42 గంటలు పూర్తయ్యాయని, బెంగళూరుకు రవాణా చేయడానికి ముందు పూజించడం కోసం నామక్కల్‌లోని ఆంజనేయర్ ఆలయంలో ఉంచామని నివేదిక పేర్కొంది.వార్తా నివేదికలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఒక ప్రభుత్వ రంగ సంస్థ (PSU)అయిన BHEL,ఈ గుడి గంటలు తయారు చేసిందని ఏ వార్తా సంస్థలు నివేదించలేదు.ఒకవేళ BHELకి అటువంటి ఆర్డర్ ఏదైనా వచ్చి ఉంటె, వార్తా నివేదికలలో విస్తృతంగా కవర్ చేయబడి ఉండేది. కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact checks:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

జాతీయ వైద్య కమిషన్ తన లోగోను రంగులతో ఉన్న ధన్వంతరి చిత్రంతో మార్చేసిందా? వాస్తవ పరిశీలన

ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.