వాదన/Claim: ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది విమాన ప్రయాణికుడి పర్స్‌లో ఉన్న నగదును దొంగిలిస్తున్నట్లు వీడియోలో కనపడుతుంది.
నిర్ధారణ/Conclusion:ప్రచురణకర్త(పబ్లిషర్) అప్‌లోడ్ చేసిన అనేక వీడియోలలో ఒకే నటీనటులు చేస్తున్న ప్రక్రియను చూపించే స్క్రిప్ట్ చేసిన వీడియో.
రేటింగ్: Misrepresentation —
Fact Check వివరాలు
ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రయాణికుడి పర్సులోంచి డబ్బు దొంగిలిస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది.
ఇది విమానాశ్రయ భద్రతా సిబ్బందికి వ్యతిరేకంగా హెచ్చరికతో దిగువ చూపిన విధంగా Twitterలో అనేక వినియోగదారుల దృష్టిని
ఆకర్షించింది.
Airport se Safar karne Wale pessenger is video ko khas karke zaroor dekho..airport k andar ka staff passenger ka rupya Paisa kis tarah se chori karte hain zara dekh Lo.. is video ko apne sabhi group mein share karo… pic.twitter.com/GgSt1wMOru
— Kapoor SK (@SkSolinkapoor) December 19, 2023
హిందీలో ఉన్న పోస్ట్ :Airport se safar karne wale pessenger is video ko khas karke zaroor dekho… airport k andar ka staff passenger ka rupya Paisa kis tarah se chori karte hain zara dekh Lo… is video ko apne sabhi group mein share karo… (తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది:విమానంలో ప్రయాణించే ప్రయాణికులు ఈ వీడియో తప్పక చూడండి. విమానాశ్రయ సిబ్బంది ప్రయాణీకుల డబ్బును ఎలా దోచుకున్నారో చూడండి. ఈ వీడియోని మీ అన్ని గ్రూప్‌లలో షేర్ చేయండి…)
పోస్ట్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.
FACT CHECK
Digiteye India బృందం వాట్సాప్ అభ్యర్థన ఆధారంగా వాస్తవ పరిశీలన చేస్తుండగా ఇది అప్పటికే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడిందని కనుగొన్నారు.బృందం ఇన్‌విడ్ సాధనాన్ని ఉపయోగించి వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసుకుని, వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా, ఆ వీడియో నవంబర్ 1, 2023న PaulVu TV ద్వారా YouTubeలో అప్‌లోడ్ చేయబడిందని గమనించారు. అసలు వీడియో యొక్క శీర్షిక ఇలా ఉంది, ‘దురాశపరుడైన ఉద్యోగి ప్రయాణీకుడి డబ్బులు తీస్తున్నాడు!’
మేము ప్రచురణకర్త హోమ్ పేజీని పరిశీలించగా, బాధితులుగా లేదా నేరస్థులుగా ఒకే నటీనటులను కలిగి ఉన్న అనేక స్క్రిప్ట్ వీడియోలు ఉన్నాయని మేము గమనించాము.PaulVu TV హోమ్ పేజీని ఇక్కడ చూడండి: ఒక నెల క్రితం అప్‌లోడ్ చేసిన మూడు వీడియోలలో ఒకే వ్యక్తి కనపడతాడు(సర్కిల్ చేయబడిన వ్యక్తి).
కాబట్టి, ఇది స్క్రిప్ట్ చేయబడిన వీడియో,నిజమైనది కాదు.
మరి కొన్ని Fact Checks:
అంబేద్కర్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని అమెరికా ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన