కొత్తగా ఎన్నికైన జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి, భారీ డిపోర్టేషన్ మంత్రిత్వ శాఖను సృష్టించారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim : కొత్తగా ఎన్నికైన జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి సామూహిక బహిష్కరణ మంత్రిత్వ శాఖను సృష్టించారనేది వాదన.
నిర్ధారణ/Conclusion :ఆ వాదన తప్పు. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సనే తకైచి హామీ ఇచ్చినప్పటికీ, “భారీ డిపోర్టేషన్ ” కోసం కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారిక ప్రకటనలు కానీ లేదా ఆధారాలు కానీ లేవు.
రేటింగ్ /Rating : పూర్తిగా తప్పు ![]()
కొత్తగా ఎన్నికైన జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి భారీ డిపోర్టేషన్ మంత్రిత్వ శాఖను సృష్టించారని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
X వినియోగదారుడు ‘Basil_TGMD’ ఈ విధంగా దావా /వాదన చేశారు: “సనే తకైచి ప్రమాణ స్వీకారం చేశారు మరియు వెంటనే భారీ డిపోర్టేషన్ కోసం ఒక మంత్రిత్వ శాఖను సృష్టించారు”. అతని పోస్ట్ కు దాదాపు 274,000 లైక్‌లు మరియు 9.1 మిలియన్లకు పైగా వీక్షణలను వచ్చాయి. ఈ పోస్ట్‌ను క్రింద చూడండి –
🚨🇯🇵NEW PRIME MINISTER OF JAPAN MAKES MASS DEPORTATIONS FIRST POLICY
Sanae Takaichi was sworn in and IMMEDIATELY created a ministry for mass deportations
How can you not be jealous?
Imagine a country defending its own people pic.twitter.com/Yrescqv0SO
— Basil the Great (@Basil_TGMD) October 21, 2025

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే చేశారు, వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వాస్తవ పరిశీలన
DigitEYE Indiaబృందం ఈ వాదనను దర్యాప్తు చేయాలని నిర్ణయించి పరిశీలించగా, ఇది అబద్ధమని తేలింది. ఈ వాదనతో పాటు షేర్ చేయబడుతున్న క్లిప్ ప్రధాన మంత్రి సనే తకైచిది కాదు, క్యాబినెట్ మంత్రి కిమి ఒనోడాది.అంతేకాకుండా, జపాన్ ప్రభుత్వం లేదా మీడియా సంస్థల నుండి ‘ ప్రధాన మంత్రి తకైచి భారీ డిపోర్టేషన్ మంత్రిత్వ శాఖ’ను సృష్టిస్తున్నారని విషయాన్నీ సమర్థించే విశ్వసనీయ నివేదికలు లేదా ఆధారాలు లేవు.
ఈ వాదన గురించి మరింత తెలుసుకోవడానికి, మేము మొదట ‘భారీ డిపోర్టేషన్ కు కొత్త మంత్రిత్వ శాఖను ప్రారంభించిన ప్రధానమంత్రి సనే తకైచి’ అనే పదంతో వెబ్ శోధనను నిర్వహించగా,ఈ వాదనకు మద్దతు ఇచ్చే లేదా సమర్థించే విశ్వసనీయమైన ఆధారం మాకు దొరకలేదు.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేయబడిన అన్ని పోస్టులు కూడా ఎటువంటి గణనీయమైన/సరిపడా ఆధారాలను అందించలేదు.
వాదనలో షేర్ చేయబడిన వీడియో క్లిప్ యొక్క వివిధ కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసిన తర్వాత, వీడియోలో ఉన్న వ్యక్తి క్యాబినెట్ మంత్రి కిమి ఒనోడా అని మేము తెలుసుకున్నాము.
జపాన్ టుడే ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ప్రధానమంత్రి తకైచి “విదేశీయులతో క్రమబద్ధమైన సహజీవన సమాజాన్ని” ప్రోత్సహించడానికి కొత్త క్యాబినెట్ పోర్ట్‌ఫోలియోను సృష్టించి, ఆ పదవికి కిమి ఒనోడాను నియమించారు.పోర్ట్‌ఫోలియో(శాఖ/విధుల) ప్రకారం కిమి ఒనోడా విదేశీ పౌరులపై విధానాలను పర్యవేక్షిస్తారు.
నివేదిక నుండి ఒక కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు:

జపాన్‌లో నేరాలు మరియు విదేశీయుల ఇతర దుష్ప్రవర్తనలను తగ్గించడానికి ఒనోడా తాను ఎలాంటి కఠినమైన విధానాన్ని అమలు చేస్తారో సూచించారని, అక్టోబర్ 22,2025న అసహి శింబున్ పత్రిక ప్రచురించిన మరో నివేదిక తెలిపింది. “కొత్తగా ఏర్పడిన మంత్రివర్గం కొత్త ప్రధాన మంత్రి సనే తకైచి యొక్క సంప్రదాయవాద రాజకీయ వైఖరిని బలంగా ప్రదర్శిస్తుంది” అని నివేదిక పేర్కొంది.అయితే, ఏ నివేదికలోనూ భారీ డిపోర్టేషన్ (Mass Deportations) మంత్రిత్వ శాఖ ఏర్పాటు గురించి ప్రస్తావన లేదు.
నివేదిక నుండి ఒక కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు :

ప్రధాన మంత్రి సనే తకైచి కార్యాలయం యొక్క క్యాబినెట్ నియామకాల సమాచారం కోసం శోధించినప్పుడు, అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లో మాకు మంత్రుల జాబితా లభించింది.కిమి ఒనోదా క్యాబినెట్ కార్యాలయంలో బహుళ శాఖలతో రాష్ట్ర మంత్రిగా నియమించబడ్డారు.వాటిలో ఒకటి ‘విదేశీయులతో క్రమబద్ధమైన సహజీవన సమాజాన్ని నిర్మించే /ప్రోత్సహించే బాధ్యత’. ఆమె పోర్ట్‌ఫోలియో కింద భారీ డిపోర్టేషన్ (Mass Deportations) మంత్రిత్వ శాఖ గురించి ప్రస్తావించబడలేదు.
అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు :

కాబట్టి, ఈ వాదన తప్పు.
****************************************************
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
MTV ఇండియా డిసెంబర్ 2025 నాటికి అన్ని కార్యకలాపాలను మూసివేస్తుందా? వాస్తవ పరిశీలన

