పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ జెండాని విక్రయిస్తున్న వ్యక్తిని  BSF జవాన్ కొట్టినట్లు వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ జెండాని విక్రయిస్తున్న వ్యక్తిని BSF జవాన్ కొట్టారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. యూనిఫాం ధరించిన గార్డు బంగ్లాదేశ్ ఆర్మీకి చెందినవాడు మరియు ఈ సంఘటన ఢాకాలో జూన్ 10, 2025న ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం వెలుపల పెద్ద సంఖ్యలో జనాన్ని చెదరగొట్టడానికి బంగ్లాదేశ్ సైన్యం లాఠీ ఛార్జ్ చేసిన సందర్భంలోని సంఘటన.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి

*********************************************************************

వివరాలు:

పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ జెండాని విక్రయిస్తున్న వ్యక్తి ని భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)కి చెందిన జవాన్ పట్టుకుని కొట్టాడన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోని క్రింద  చూడండి:

అదే వీడియో సోషల్ మీడియాలో భిన్న వాదనలతో షేర్ అవుతోంది. “అబ్దుల్ పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ జెండాను అమ్ముతున్నాడు.. BSF కానిస్టేబుల్ అతనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు….”, అని ఒక వినియోగదారు వ్రాయగా, మరొక వినియోగదారుడు: “BSF సైనికుడికి సెల్యూట్ 🫡, అదే పశ్చిమ బెంగాల్ పోలీసులు అయితే, ఎటువంటి చర్య తీసుకోకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయేవారు.” అని వ్రాశారు.

వీడియో ఇక్కడ మరియు ఇక్కడ కూడా షేర్ చేయబడింది.

 వాస్తవ పరిశీలన

వీడియో యొక్క కీలక ఫ్రేమ్‌లను తీసుకొని, Digiteye India బృందం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా, అది ఢాకాలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ న్యూస్ పోర్టల్ ‘ఢాకా పోస్ట్’ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో అని ఫలితాలు వెల్లడించాయి.ఆ వీడియోలో బంగ్లాదేశ్ ఆర్మీ సిబ్బంది ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా బంగాబంధు నేషనల్ స్టేడియం వెలుపల గుమిగూడిన భారీ ప్రేక్షకులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేస్తున్న దృశ్యాలను చూడవచ్చు.

మరియు, ఈ సంఘటన సమయంలో దెబ్బతిన్న వారిలో జెండా విక్రయిస్తున్న వ్యక్తి  కూడా ఉన్నాడు. గూగుల్ న్యూస్‌లో తదుపరి పరిశీలనలో ఈ సంఘటన జూన్ 10, 2025న బంగ్లాదేశ్ సైన్యం పెద్ద గుంపును చెదరగొట్టడానికి లాఠీ ఛార్జీకి పాల్పడినప్పుడు జరిగిందని తేలింది.

జెండా విక్రయిస్తున్న వ్యక్తిని కొట్టిన సంఘటనపై బంగ్లాదేశ్ సైన్యం విచారం వ్యక్తం చేస్తూ, అతనికి ‘లక్ష టాకా’ (బంగ్లాదేశ్ కరెన్సీ) పరిహారం ప్రకటించిందని వార్తా నివేదికలు తెలిపాయి.
అందువల్ల, పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ జెండా విక్రయిస్తున్న వ్యక్తిని BSF జవాన్ కొట్టాడన్న వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు అమెరికా భారత గగనతలాన్ని ఉపయోగించుకుందా? వాస్తవ పరిశీలన

సౌదీ అరేబియా భారతదేశానికి వర్క్ వీసాలను సస్పెండ్ చేయడం మన ‘విదేశాంగ విధానం’ పతనాన్ని సూచిస్తుందా? వాస్తవ పరిశీలన

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.