వాదన/Claim: ‘భారతదేశంతో సహా 14 దేశాలకు సౌదీ అరేబియా వీసాలను నిలిపివేయడం, మోడీ హయాంలో ఇది భారత విదేశాంగ విధానం యొక్క పతనానికి తాజా దెబ్బ’ అనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. సౌదీ అరేబియా ఏప్రిల్ 13, 2025 న, హజ్ యాత్రికుల భారీ రద్దీని సజావుగా నిర్వహించడానికి భారతదేశంతో సహా 14 దేశాలకు తాత్కాలికంగా వర్క్ వీసాలను నిలిపివేసింది మరియు మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు.

Rating: తప్పు దారి పట్టించే వాదన —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పవన్ ఖేరా X.comలో చేసిన పోస్ట్, సౌదీ అరేబియా భారతదేశంతో సహా 14 దేశాలకు వీసాలను సస్పెండ్ (నిలిపివేయడం) చేసిందని, ఇది ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత విదేశాంగ విధానం పతనమైందని సూచిస్తోందనే వాదనతో షేర్ చేయబడుతోంది.

పోస్ట్‌లోని సారాంశం ఈ విధంగా ఉంది: “భారతదేశంతో సహా 14 దేశాలకు సౌదీ అరేబియా వీసాలను సస్పెండ్ చేయడం, మోడీ హయాంలో ఇది భారత విదేశాంగ విధానం యొక్క పతనానికి తాజా దెబ్బ.” దీనికి, అతను ఇతర విదేశాంగ విధాన సమస్యలను కూడా జోడించారు.టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన కథనాన్ని కూడా పోస్ట్ లో చూడవచ్చు.

వాస్తవ పరిశీలన

గూగుల్ న్యూస్‌లో ప్రాథమిక పరిశీలనలో వీసాలను నిలిపివేయడమనే వార్త నిజమని తేలింది కానీ ఈ వాస్తవాన్నీ ఉపయోగించుకొని ఇది భారత విదేశాంగ విధానం పతనమైందనేది అవాస్తవం. సౌదీ అరేబియా ఏప్రిల్ 13, 2025 న, హజ్ యాత్రికుల భారీ రద్దీని మరియు ఇమ్మిగ్రేషన్/వలస ప్రక్రియాను సజావుగా నిర్వహించడానికి (బంగ్లాదేశ్, ఈజిప్ట్,ఇండోనేషియా,భారతదేశంతో సహా) 14 దేశాలకు తాత్కాలికంగా వర్క్ వీసాలను నిలిపివేసింది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA) కూడా దిగువ చూసినట్లుగా దావాను తిరస్కరించింది:

ఈ నిర్ణయం ఇండో-పాక్ ఉద్రిక్తతలకు ముందు తీసుకున్న హజ్-అనుబంధ పరిపాలనా నిర్ణయం, కావున మోడీ ప్రభుత్వ వైఫల్యంతో ఎటువంటి సంబంధం లేదు.అనేక వార్తా నివేదికలు ఇక్కడ మరియు ఇక్కడ ప్రచురించాయి. కాబట్టి, ఇది తప్పుదారి పట్టించే వాదన.

Also Read:

అమెరికాలో టెస్లా కార్ల ఉత్పత్తిని ట్రంప్ నిషేధించారా? వీడియో వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన

క్యాన్సర్ నివారణకు విటమిన్ ‘డి’ ఏకైక అత్యంత ప్రభావవంతమైన ఔషధమా? వాస్తవ పరిశీలన

 

 

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.