క్యాన్సర్ నివారణకు విటమిన్ ‘డి’ ఏకైక అత్యంత ప్రభావవంతమైన ఔషధమా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: క్యాన్సర్ నివారణకు విటమిన్ ‘డి’ ఏకైక అత్యంత ప్రభావవంతమైన ఔషధమనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. సెల్యులార్ ఆరోగ్యంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుండగా, క్యాన్సర్ నివారణకు ఏకైక అత్యంత ప్రభావవంతమైన ఔషధమనే వాదనలో నిజం లేదు.
రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం-
పూర్తి వాస్తవ పరిశీలన వివరాలను వీడియోలో చూడండి
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************
వివరాలు:
క్యాన్సర్ నివారణకు విటమిన్ ‘డి’ ఏకైక అత్యంత ప్రభావవంతమైన ఏకైక ఔషధమని పేర్కొంటూ ఒక వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి తెలిసిన క్యాన్సర్ ఔషధం ప్రయోజనాల కంటే కూడా విటమిన్ ‘డి’ప్రయోజనాలు చాలా ఎక్కువని పేర్కొంది. దావా చూడండి:
Vitamin D is the single most effective medicine against cancer, far outpacing the benefits of any cancer drug known to modern science.
— healthbot (@thehealthb0t) March 31, 2025
ఇది ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. వాస్తవానికి, 2022 మరియు 2023లో కూడా ఇదే దావా షేర్ చేయబడింది.
వాస్తవ పరిశీలన
కోవిడ్ -19 రోజుల నుండి మానవులకు విటమిన్ డి యొక్క ప్రయోజనాలపై చర్చ జరుగుతూనే ఉన్నందున,అందుబాటులో ఉన్న పరిశోధన ఫలితాల దృష్ట్యా DigitEYE India బృందం దీని పరిశీలనకు పూనుకుంది. NIH నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం, విటమిన్ డి సప్లిమెంట్స్ క్యాన్సర్ వ్యాధిని, క్యాన్సర్ సంబంధిత లక్షణాలను తగ్గించవు. ఇక్కడ అందుబాటులో ఉన్న అధ్యయనం క్లినికల్ ట్రయల్‌లో 25,000 మంది పాల్గొన్నవారిని పరీక్షించింది, మరియు నవంబర్ 10, 2018న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (NEJM)లో ప్రచురించబడింది.
క్యాన్సర్ నివారణ కోసం విటమిన్ ‘డి’ప్రయోజనకరమా కాదా అని అధ్యయనం ముఖ్య ఉద్దేశం, అయితే పాల్గొన్నరికి ఇచ్చిన సప్లిమెంట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించలేదని ఫలితాలు చూపించాయి. పూర్తి ఫలితాలను ఇక్కడ చూడవచ్చు.
అయినప్పటికీ, అన్ని అధ్యయనాలు(ఇక్కడ చూసినట్లుగా) మరణాల రేటును తగ్గించడంలో విటమిన్ డి యొక్క ప్రయోజనాలను నొక్కిచెప్పాయి.
అందువల్ల, విటమిన్ డి కణాల ఆరోగ్యంతో పాటు ఇతర ప్రయోజనాలలో కీలక పాత్ర పోషిస్తుంది, కానీ ఇది అన్ని క్యాన్సర్ మందులను అధిగమించి,క్యాన్సర్ ని నివారిస్తుందని సూచించడం తప్పు.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదా? వాస్తవ పరిశీలన
1 thought on “క్యాన్సర్ నివారణకు విటమిన్ ‘డి’ ఏకైక అత్యంత ప్రభావవంతమైన ఔషధమా? వాస్తవ పరిశీలన”