భారతదేశం టోల్ ప్లాజాలలో ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతి నుండి GPS ఆధారిత టోల్ చెల్లింపుకు మారబోతోందా?వాస్తవ పరిశీలన

వాదన/Claim: 1st May 2025 నుండి FASTag పద్ధతి నుండి GPS ఆధారిత టోల్ చెల్లింపు పద్ధతికి మారబోతుందనేది వాదన.
నిర్ధారణ/ Conclusion: తప్పు దారి పట్టించే వాదన. GPS ఆధారిత పద్ధతి ఆలోచన పరిశీలనలో ఉన్నప్పటికీ, మే 1, 2025 నుండి FASTag పద్ధతికి మార్చడానికి NHAI ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన. —
పూర్తి వాస్తవ పరిశీలన వివరాలను వీడియోలో చూడండి
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************
జాతీయ రహదారిపై టోల్ చెల్లించడానికి ఉపగ్రహ-ట్రాకింగ్ (GPS )పద్ధతి అమలులోకి వస్తుందని,ఇది ఎక్కువ సమయం తీసుకునే నిధానమైన FASTag పద్ధతిని భర్తీ చేస్తుందని సోషల్ మీడియాలో అనేక వాదనలు అకస్మాత్తుగా హామీ ఇస్తూ కనిపించాయి.ఈ పద్ధతి మే 1, 2025 నుండి ఒక నెలలోపు అమలు చేయబడుతుందని చెప్పబడినందున, కొత్త పద్ధతికి వస్తున్న మద్దతు చాలా మంది వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది.
ఆ వాదనలను ఇక్కడ చూడండి. ఒక వినియోగదారుడు ఇలా రాశారు: “మే 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ లేదా? భారతదేశం GPS ఆధారిత టోల్ పద్ధతి/వ్యవస్థను ప్రారంభించనుంది.” మరొకరు ఇలా రాశారు: “భారతదేశం మే 1, 2025 నుండి FASTag నుండి GPS ఆధారిత టోల్‌లకు మారుతోంది, మీరు నడిపే కిలోమీటర్లకు మాత్రమే చెల్లించండి. ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు, స్కానింగ్ లేదు. NavIC GPS ద్వారా రియల్ టైమ్ ట్రాకింగ్.”
No more FASTag from May 1? India to launch GPS-based toll system pic.twitter.com/R7zIgZ33Em
— Smartprix (@Smartprix) April 17, 2025
వాస్తవ పరిశీలన
ఒక నెలలోపు దీనిని ప్రవేశపెడతామని అత్యవసర గమనిక పొందుపరుస్తూ ఈ క్లెయిమ్ వైరల్ కావడంతో, దీనిని చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం ప్రారంభించారు.Digiteye India బృందం ప్రామాణికత తనిఖీ కోసం అభ్యర్థనను అందుకున్నప్పుడు, మేము కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నుండి అధికారిక ప్రకటన కోసం ప్రయత్నించగా, ఏప్రిల్ 14, 2025న ఒక బహిరంగ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దీని గురించి వివరించటం గమనించాము.
Watch: Union Minister Nitin Gadkari says, “In next 15 days we are coming with toll policy and you will satisfy from our toll policy (National Highways). We are starting satellite toll system so that you don’t have to stop for toll plazas…” pic.twitter.com/cn2wFWBXzl
— IANS (@ians_india) April 14, 2025
“మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. కెమెరా మీ నంబర్ ప్లేట్ ఫోటోలను తీస్తుంది మరియు ఖచ్చితమైన టోల్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాల నుండి తీసుకోబడుతుంది” అని ఆయన అన్నారు.
కానీ గూగుల్‌లో మరింత పరిశీలించగా ఈ ఆలోచన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని మరియు సోషల్ మీడియాలో షేర్ చేయబడిన అనేక పోస్ట్‌లలో పేర్కొన్నట్లుగా మే 1, 2025 నుండి ఖచ్చితంగా ఇది అమలు చేయబడదని తేలింది.
ఈ తప్పుదారి పట్టించే వాదనలను తిప్పికొడుతూ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వైరల్ అయిన ఆ వాదన తప్పని ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రకటన ఇక్కడ చూడవచ్చు:
“మే 1, 2025 నుండి ఉపగ్రహ ఆధారిత టోలింగ్ పద్ధతి అమలుపై స్పష్టత” అనే శీర్షికతో ఏప్రిల్ 18, 2025న విడుదలైన ఒక ప్రకటన, మే 1, 2025 నుండి దేశవ్యాప్తంగా ఉపగ్రహ ఆధారిత టోలింగ్ అమలుకు సంబంధించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ లేదా భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంగా పేర్కొంది.
అయితే, “టోల్ ప్లాజాల ద్వారా వాహనాల అవరోధం లేకుండా కదలికలను సులభతరం చేయడానికి మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి, ఎంపిక చేసిన టోల్ ప్లాజాలలో ‘ANPR-FASTag-ఆధారిత బారియర్-లెస్ టోలింగ్ సిస్టమ్’ అమలు చేయబడుతుంది” అని విడుదల పేర్కొంది. “ఈ పద్ధతి/వ్యవస్థ పనితీరు, సామర్థ్యం మరియు వినియోగదారుల ప్రతిస్పందన ఆధారంగా, దేశవ్యాప్తంగా దీని అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకోబడుతుంది” అని స్పష్టం చేసింది.
కాబట్టి, మే 1, 2025 నుండి దేశవ్యాప్తంగా కొత్త పద్ధతి/వ్యవస్థను ప్రవేశపెట్టే తేదీ గురించిన చేయబడిన వాదన తప్పు.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన
1 thought on “భారతదేశం టోల్ ప్లాజాలలో ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతి నుండి GPS ఆధారిత టోల్ చెల్లింపుకు మారబోతోందా?వాస్తవ పరిశీలన”