Tag Archives: telugu fact check

ఇజ్రాయెల్-హమాస్ దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్ నిరసనకారులపై కారు దూసుకెళ్లిందనే వాదన; వాస్తవ పరిశీలన

వాదన/Claim:ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య ఒక ఇజ్రాయెల్ సెటిలర్(Israeli settler) కారు ఇజ్రాయెల్ నిరసనకారులపైకి దూసుకెళ్ళింది.

నిర్ధారణ/Conclusion:ఇది ఇజ్రాయెల్‌లో న్యాయపరమైన సమగ్ర సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న నిరసనకారులపైకి కారు నడుపుతున్నప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించిన పాత వీడియో మరియు డ్రైవర్ ఇజ్రాయెల్ సెటిలర్(Israeli settler)కాదు. ఈ వీడియోకి ఇజ్రాయెల్-హమాస్ దాడులకి సంబంధం లేదు.

రేటింగ్: తప్పుగా సూచించడం:  —

FACT CHECK వివరాలు:

కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య, ఇజ్రాయెల్ జెండాలు పట్టుకున్న కొంతమంది నిరసనకారులపై కారు దూసుకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.

ఇజ్రాయెల్ సెటిలర్ల(ఇజ్రాయెల్ స్థిరనివాసుల) కారు ఇజ్రాయెల్ నిరసనకారులపైకి దూసుకెళ్లిందనే వాదన సోషల్ మీడియాలో ఇక్కడ షేర్ చేయబడుతోంది.

FACT CHECK

Digiteye India Teamవారు వాస్తవ పరిశీలన కోసం ముందుగా వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని అమలు చేయగా, ఆ వీడియో సెప్టెంబర్ 10, 2023న హీబ్రూ టీవీ ఛానెల్ అయిన Kann News ద్వారా అప్‌లోడ్ చేయబడిన పాత వీడియో అని గుర్తించారు.
వీడియోను ట్వీట్ చేస్తూ, టెల్ అవీవ్‌లోని అయాలోన్ హైవేకి సంబంధించిన సంఘటన అని టీవీ ఛానెల్ తెలిపింది. నిరసనకారులు రోడ్డును అడ్డుకోవడంతో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుని నడుపుతున్నతన కొడుకు ఆందోళన చెందాడని పోలీసులకు వివరించాడు. ముందు ప్రయాణీకుల సీటులో ఉన్న తండ్రి, తన కొడుకుతో కలిసి సీట్లు మారాలని నిర్ణయించుకున్నాడు, అయితే అతను డ్రైవర్ సీటులోకి వెళుతున్నప్పుడు ప్రమాదవశాత్తు యాక్సిలరేటర్‌ను నొక్కడంతో కారు నిరసనకారులపైకి దూసుకుపోయింది.

 

ఈ సంఘటన వీడియో యొక్క అదే కవర్ చిత్రంతో టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో నివేదించబడింది. ఈ ఘటనలో 25 ఏళ్ల మహిళకు గాయాలు కాగా, పలువురు వ్యక్తులు పక్కకు పడిపోయారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, ప్రమాదమేనని అతడు వాంగ్మూలం ఇచ్చిన తరువాత విడుదల చేశారు.

మరి కొన్ని Fact checks:

హమాస్ ఇజ్రాయెల్ ట్యాంకులను స్వాధీనం చేసుకుని వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేయడం వీడియోలో కనిపిస్తుంది; Fact Check

Fact Check: సుడాన్‌లో డ్రోన్ దాడికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం గాజాపై జరుగుతున్న దాడులలో ఒకటని క్లెయిమ్

వాదన/క్లెయిమ్ చేసినట్లుగా ఈ ‘పిత్ర్’ నది సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: దక్షిణ భారతదేశంలోని ‘పిత్రి నది’ ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి ఒకసారి కనిపిస్తుందని, ఆపై దీపావళి నాడు అదృశ్యమవుతుందనే ఒక వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు సంబంధించిన వీడియో క్లిప్‌.

రేటింగ్: పూర్తిగా తప్పు —

Fact Check వివరాలు:వివరాలు

దక్షిణ భారతదేశంలోని‘పిత్రి నది’నుంచి బంజరు భూమిలోకి నది నీరు ప్రవహిస్తున్నట్లు చూపించే వీడియో వాట్సాప్‌లో షేర్ చేయబడింది.

ఇది ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి కనిపిస్తుందని, ఆపై దీపావళి అమావాస్య రోజున అదృశ్యమవుతుందని ఒక వాదన.దిగువ చూపిన విధంగా ఇది ట్విట్టర్‌లో కూడా షేర్ చేయబడింది:

హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది:“दक्षिण भारत की यह नदी पितृपक्ष की अमावस्या को प्रकट होती है और दीपावली के दिन, अमावस्या को विलीन हो जाती है ! सिर्फ एक महीना बहाव !! है न प्रकृति का अदभुत चमत्कार.” [తెలుగు అనువాదం:దక్షిణ భారతదేశంలోని ఈ నది పితృ పక్ష అమావాస్య రోజు కనిపిస్తుంది మరియు దీపావళి అమావాస్య రోజున అదృశ్యమవుతుంది… కేవలం ఒక నెల మాత్రమే ప్రవహిస్తుంది!! ఇది ప్రకృతి యొక్క అద్భుతం కాదా?]

మేము ట్విట్టర్‌లో వీడియో కోసం వెతకగా, అదే వీడియో 2020,2021,2022లో ఉపయోగించబడిందని, మరియు తాజాగా అక్టోబర్ 15, 2023న షేర్ చేయబడిందని మేము తెలుకున్నాము. అందుకే, ఇది పునరావృతమవుతున్న పాత వాదన/దావా.

FACT CHECK

మేము కీలక ఫ్రేమ్‌ల సహాయంతో Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వీడియో కోసం వెతికినప్పుడ్డు, సెప్టెంబర్ 19,2017న అప్‌లోడ్ చేయబడిన అసలైన YouTube వీడియోని గమనించాము.
ఇది తమిళనాడు మరియు కర్ణాటక మధ్య నీటి విడుదలకు/పంపకానికి సంబంధించిన వీడియో.‘తమిళనాడులోని మైవరం జిల్లాకు కావేరీ జలాలు చేరాయి’అని క్యాప్షన్ రాసి ఉంది. దిగువ యూట్యూబ్‌లో ఒరిజినల్(అసలైన) వీడియో చూడండి.

కావున, వీడియో క్లిప్‌లో కనిపించే నీరు కావేరీ నది నుండి తమిళనాడులోకి ప్రవహిస్తున్న నీరు, దక్షిణ భారతదేశంలోని ‘పిత్రి నది’ కాదు. ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి ఇది కనిపిస్తుందనే వాదనలో ఏ మాత్రం నిజం లేదు.

సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 24, 2017 వరకు కర్ణాటక ప్రభుత్వం కావేరీ మహా పుష్కరాలు జరుపుకున్నట్లు మరియు వీడియో ప్రకారం ఈ సమయంలో కావేరీ నది నీటిని కూడా విడుదల చేసిందని వార్తా కథనాలు. కాబట్టి, ఇది పూర్తిగా తప్పుడు వాదన/దావా.

మరి కొన్ని fact checks:

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check

వాస్తవ పరిశీలన: స్టంట్ టీమ్ చేసిన స్ట్రీట్ ఫైట్ ప్రదర్శనను సోషల్ మీడియాలో మతపరమైన కోణంతో షేర్ చేయబడింది.

వాదన/ Claim:ప్యారిస్‌లో తమను వేధిస్తున్న పురుషులను మహిళల గుంపు అదుపు చేస్తున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది మరియు మతపరమైన కోణంతో ఈ వీడియో షేర్ చేయబడింది.

నిర్ధారణ/Conclusion: ప్రొఫెషనల్ స్టంట్‌పర్సన్‌లుగా మారడానికి వ్యక్తులకు శిక్షణనిచ్చే ఫ్రెంచ్ స్టంట్ గ్రూప్ ఈ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను గ్రూప్ వారు ఈ నెల ప్రారంభంలో వారి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

RATING: Misinterpretation —

మహిళల గుంపు తమను వేధిస్తున్నపలువురు పురుషులను అదుపు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పారిస్‌లో చోటుచేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో మతపరమైన కోణంతో మరియు ఇస్లామోఫోబిక్ వాదనలతో షేర్ చేయబడింది. ఫోటోతో వైరల్ అవుతున్న వాదన ఇలా ఉంది:

ఈ వీడియో చాలా శాంత పరిచేదిగా ఉంది. నిన్న ప్యారిస్‌లో ఎక్కడో మెట్రో అండర్‌పాస్‌లో, కొంతమంది వలసదారులు వారు ఏది బాగా చేయగలరో అది చేస్తున్నారు.తహర్రష్(Taharrush–సుమారుగా అనువదిస్తే: స్త్రీలపై సామూహిక వేధింపులు.) దురదృష్టవశాత్తు, ఈ ముగ్గురు మహిళలు ఫ్రెంచ్ పారా-మిలటరీకి పని చేసేవాళ్ళు.

దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో మరియు X (గతంలో, ట్విట్టర్)లో వైరల్‌ అవుతోంది.

https://twitter.com/DalviNameet/status/1724592897226686869

వీడియో ఇక్కడ,ఇక్కడ,మరియు ఇక్కడ అవే వాదనలతో షేర్ చేయబడింది.

FACT CHECK

వాట్సాప్‌లో ఈ వైరల్ వీడియోలో వాస్తవం ఎంత ఉందొ పరిశీలన చేయమని Digiteye India Teamకి అభ్యర్థన వచ్చింది.

వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించడానికి Team/బృందం ‘inVID’ – వీడియో ధృవీకరణ సాధనం (inVID-a video verification tool) ఉపయోగించగా, కీఫ్రేమ్‌లలో ఒకదానిలో, పురుషులు నల్లటి హూడీలు ధరించడం గమనించారు.
స్వెట్‌షర్ట్ వెనుక తెల్లటి అక్షరాలతో “CUC” అని రాసి ఉంది. మేము ఈ క్లూని ఉపయోగించి,Googleలో కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము.

కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా, అది క్యాంపస్ యూనివర్స్ క్యాస్కేడ్స్(Campus Univers Cascades) యొక్క Instagram పేజీకి దారితీసింది. వారి లోగో మరియు వీడియోలో పురుషుల హూడీలపై కనిపించిన లోగో ఒకే లాగా ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వారి వెబ్‌సైట్‌ను పరిశీలించాగా, CUC తమని తాము “సినిమా మరియు ప్రదర్శనలలో స్టంట్ టెక్నిక్‌లు అందించే వృత్తిపరమైన శిక్షణా కేంద్రం అని పేర్కొంది. ఇది “క్యాంపస్ ప్రేరేపిత క్రీడాకారులు, పురుషులు మరియు మహిళలు కోసం ఉద్దేశించబడింది, దీని లక్ష్యం ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్‌గా మారడం.” ఇవి 2008లో స్థాపించబడ్డాయి మరియు ఫ్రాన్స్‌లో ఉన్నాయి.”ఈ కేంద్రం ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్‌ అవ్వాలనుకునే లక్ష్యం ఉన్న క్రీడాకారులు, పురుషులు మరియు మహిళలు కోసం ఉద్దేశించబడింది”.ఇది 2008లో ఫ్రాన్స్‌లో స్థాపించబడింది.

మేము వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీని పరిశీలించగా నవంబర్ 2, 2023న పోస్ట్ చేసిన వైరల్ వీడియోని కనుగొన్నాము.(వీడియో క్రింద చూడ వచ్చును).

వీడియో కాప్షన్ “వీధి పోరాటం(Streetfight) ⚠️👊”, మరియు కక్టీమ్, క్యాంపస్ లైఫ్, స్ట్రీట్, ఫైట్, మార్షల్ ఆర్ట్స్, వీడియో, స్టంట్‌టీమ్, ఫైటర్, క్యాంపస్, బాక్సింగ్, కో, కంబాట్, ఫాలో, మార్షల్, బగారే, యాక్షన్, సినిమా, కొరియోగ్రఫీ, క్యాస్కేడేస్, స్టంట్‌లైఫ్” వంటి హ్యాష్‌ట్యాగ్‌లు వీడియో వివరాల్లో జత పరిచారు.

వారి పేజీలోని మరి కొన్ని వివరాలు/వీడియోలు చూస్తే, సినిమా మరియు వీడియోల కోసం స్టంట్ వ్యక్తులకు శిక్షణనిచ్చే కేంద్రమని వెల్లడవుతుంది. వైరల్ అవుతున్న వాదనలో ఏ మాత్రం నిజం లేదు.

మరి కొన్ని Fact Checks:

క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check

ఈ వీడియో ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ విధానం చూపిస్తుందా?:వాస్తవ పరిశీలన

క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check

అమెరికాలోని రైలు పైన బి.ఆర్ అంబేద్కర్ పోస్టర్‌ను చూపుతూ బాబాసాహెబ్ పోస్టర్‌ను అమెరికా వేసిందని,భారతదేశంలోని “మనువాది మీడియా”(“manuwadi media”)ఈ వార్తను కవర్ చేయడం లేదని పేర్కొంటూ ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: “जो काम भारत नहीं कर सका वह काम अमरीका ने करके दिखाया अमरीका की सबसे लम्बी दूरी की ट्रेन पे बाबासाहब का पोस्टर लगाया गया ? मगर भारत की मनुवादी मीडिया यह खबर नहीं दिखाएगी जय भीम” (తెలుగు అనువాదం–భారతదేశం చేయలేని పనిని అమెరికా చేసి చూపించింది, బాబాసాహెబ్ పోస్టర్‌ను అమెరికా సుదూర రైలులో ఉంచారు. కానీ భారతదేశ మనువాడి మీడియా(manuwadi media) ఈ వార్తలను చూపించదు– Jai Bhim)

ఇది ఇక్కడ ,ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

ఈ రైలు భారతదేశంలో సుపరిచితం మరియు నిశితంగా పరిశీలిస్తే ఇది మెట్రో కోచ్ లాగా కనిపిస్తుంది, అమెరికా  రైలు మాత్రం కాదు.భారతదేశంలోని మెట్రో రైళ్ల కోసం గూగుల్‌లో వెతికితే, ఆ చిత్రం ఢిల్లీ మెట్రోపై బాబాసాహెబ్ పోస్టర్‌ సూపెర్-ఇంపోజ్డ్ చేయబడిందని తెలుస్తుంది.దిగువన అసలైన ఢిల్లీ మెట్రో మరియు పోస్టర్‌తో సూపెర్-ఇంపోజ్డ్ చేయబడిన రైలు చూడండి.

అసలు చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు మరియు లోగో స్పష్టంగా ఢిల్లీ మెట్రోది, క్లెయిమ్/వాదన ప్రకారం అమెరికా రైలుది కాదు.అంతేకాకుండా, అటువంటి చర్య ఏదైనా ఉంటె భారతీయ మీడియా ద్వారా విస్తృతంగా కవర్ చేయబడి ఉండేది మరియు క్లెయిమ్/వాదనను ధృవీకరించడానికి ఏ విశ్వసనీయమైన వార్త సంస్థలు నుండి ఎటువంటి వార్త అందుబాటులో లేదు.

ఉదాహరణకు కొన్ని US హై-స్పీడ్ రైళ్లు క్లెయిమ్‌లో చూపిన రైలుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి. దిగువన ఉన్న చిత్రాలు/ఇమేజ్ చూడండి.

కావున ఈ క్లెయిమ్/వాదన పూర్తిగా తప్పు.

Claim/వాదన:US ప్రభుత్వం తమ సుదూర రైలులో(లాంగ్-జర్నీ రైలు) BR అంబేద్కర్ పోస్టర్‌ను ప్రదర్శిస్తోంది.

Conclusion/నిర్ధారణ:ఈ Claim/వాదన పూర్తిగా తప్పు మరియు ఆ చిత్రం/పోస్టర్‌ ఢిల్లీ మెట్రోపై సూపెర్-ఇంపోజ్డ్ చేయబడింది.

Rating: Misrepresentation —

మరి కొన్ని Fact Checks:

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

 

 

 

Fact Check: డిసెంబర్ 28న మైక్రోసాఫ్ట్ ‘ జాపనీస్ కంపెనీ సోనీ మరియు సోనీ ప్లేస్టేషన్’ను కొనుగోలు చేసినట్టు ఒక వాదన

హిస్పానిక్స్‌కు(Hispanics) చెందిన స్పానిష్ వెబ్‌సైట్ డిసెంబర్ 28, 2020న గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జపనీస్ కంపెనీ సోనీని, దాని అనుబంధ వ్యాపారాలు మరియు ప్లేస్టేషన్‌తో సహా $130 బిలియన్లకు కొనుగోలు చేసిందని పేర్కొంటూ బ్రేకింగ్ న్యూస్‌ను విడుదల చేసింది.

వెబ్‌సైట్లో ముఖ్యంశం ఇలా ఉంది: “ప్లేస్టేషన్‌తో సహా సోనీ యొక్క అన్ని విభాగాలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.ఒప్పందం యొక్క వివరాలను వెల్లడించింది.టెక్ దిగ్గజం మరియు Xbox యజమానైనా మైక్రోసాఫ్ట్ కు ప్రత్యర్థియైన సోనీ యొక్క ప్లేస్టేషన్‌ను సొంతం చేసుకోవడం ఎలా సహాయపడుతుందో వివరించింది.

 

కథనాన్నిమైక్రోసాఫ్టర్స్‘ అనే వెబ్‌సైట్ షేర్ చేసి,చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది మరియు చాలా మంది వ్యక్తులు ఈ వార్తలను విశ్వసించి, రీట్వీట్ చేయడం లేదా కొనుగోలుపై అంచనా వేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సోనీ లేదా మైక్రోసాఫ్ట్ నుండి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన/జవాబు లేదా అధికారిక ప్రకటన లేదు. ఇది డిసెంబర్ 28, 2020న రోజంతా ట్విట్టర్‌లో వైరల్ అయింది.

FACT CHECK

అయినప్పటికీ, Google సహాయంతో ఆంగ్లంలోకి అనువదించబడినప్పుడు స్పానిష్‌లో చక్కటి అక్షరాల ముద్రణతో,దిగువ చిత్రంలో చూపిన విధంగా “ఏప్రిల్ ఫూల్స్ డే’ అని వ్రాసి ఉంది.

ఏప్రిల్ ఫూల్స్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న వచ్చినప్పటికీ, సోనీ మీద కధనం డిసెంబర్ 28న కనిపించింది.గూగుల్‌లో మరింత పరిశీలించగా, అనేక హిస్పానిక్ సంస్కృతులలో ఈ రోజును “పవిత్ర అమాయకుల దినోత్సవం”(Day of the Holy Innocents)గా విస్తృతంగా పాటిస్తారు, ఇది ప్రపంచ ఏప్రిల్ ఫూల్స్ డేకి సమానం.

ఇది నిజమైన వార్త అయితే, రెండు ప్రపంచ దిగ్గజాలు కలిసిపోతున్నట్లు గ్లోబల్ మీడియా విస్తృతంగా నివేదించి ఉండేది.హిస్పానిక్ సంస్కృతిలో చిలిపి పనుల (pranks) కోసం ఒక రోజు కేటాయిస్తారని,అందులో భాగంగానే ఈ కధనాన్ని ప్రచురించారని గ్రహించిన చాలా మంది కధనాన్ని మరియు ట్వీట్‌ను శీఘ్రంగా తొలగించారు.

వాదన/Claim:మైక్రోసాఫ్ట్ సోనీని $130 బిలియన్లకు కొనుగోలు చేసింది.

నిర్ధారణ/Conclusion:స్పానిష్ ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోనీని మైక్రోసాఫ్ట్ 130 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందన్న నకిలీ వార్త(prank) సోషల్ మీడియాలో ప్రచారంలో జరిగింది.

Our rating   —Totally False.

[మరి కొన్ని fact checks: ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check]

 

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

నవంబర్ 19, 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని దోనీ పోలో విమానాశ్రయమని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

క్లెయిమ్/వాదన ఈ విధంగా ఉంది: “అరుణాచల్ ప్రదేశ్ ఈ విమానాశ్రయాన్ని ఎక్కువగా BAMBU(Bamboo)తో తయారు చేసి రాష్ట్రానికి అందించారు, వావ్… నమ్మలేకపోతున్నాను… వారు ఇక్కడ భారతదేశంలో చేస్తున్నారు. అద్భుతమైన భారత్.”వీడియోలో పైకప్పు నుండి వేలాడుతున్న అలంకరణలతో కూడిన పెద్ద, ఆధునిక విమానాశ్రయ టెర్మినల్ కనపడుతుంది.

FACT CHECK

వీడియోలో ఉన్న విమానాశ్రయం ఇటీవలి బెంగుళూరు టెర్మినల్ 2 అలంకరణలను పోలి ఉన్నందున, Digiteye India బృందం దానిని పరిశీలించగా, ఆ వీడియో అరుణాచల్ ప్రదేశ్‌లోని విమానాశ్రయానికి చెందినది కాదని, బెంగుళూరులోనిదని కనుగొన్నారు.

నవంబర్ 11, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు టెర్మినల్ 2ను ప్రారంభించినప్పుడు, దిగువ చూపిన విధంగా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది:

వాస్తవానికి, అరుణాచల్ ప్రదేశ్ యొక్క డోనీ పోలో విమానాశ్రయం చిత్రాలు(దిగువ చిత్రాలు) అక్టోబర్ 19, 2022న DGCA ద్వారా అధికారికంగా విడుదల చేయబడ్డాయి:

కావున, ఈ వార్త సరైనదే కావచ్చు, అయితే ఈ చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి చెందినదనే వాదన తప్పు.చిత్రం బెంగళూరులోని టెర్మినల్ 2 విమానాశ్రయం చెందినది.

వాదన/Claim: చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని దోనీ పోలో విమానాశ్రయంలోని bamboo అలంకరణలతో ఉన్న లోపలి భాగము.

నిర్ధారణ/Conclusion:బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 2 చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని దోనీ పోలో విమానాశ్రయం అని తప్పుగా తీసుకోబడింది.

Rating: Misrepresentation —

[మరి కొన్ని Fact Checks: ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check ; 

ఆంధ్రా తీరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసింది కాదు, బంగారు రంగులో మాత్రమే ఉంది; Fact Check]

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

ప్లాస్టిక్‌ నుంచి గోధుమలు తయారవుతున్నట్లు ఒక వైరల్‌ వీడియో చూపుతోంది.
1: 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో కార్మికులు ‘ఉపయోగించిన ప్లాస్టిక్‌ను’ఫ్యాక్టరీలో డంప్ చేయడం,అక్కడ నుండి ప్లాస్టిక్‌ను చిన్న ముక్కలుగా విభజించి, అనేకసార్లు కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై గోధుమ గింజల వలె కనిపించేలా తయారు చేయడం కనిపిస్తుంది.ఈ వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ వైరల్ వీడియో యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India టీమ్‌ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం వారు వీడియో అంతటా మధ్య దిగువన ‘స్మార్టెస్ట్ వర్కర్స్’ అనే వాటర్‌మార్క్‌ను గుర్తించారు. మేము ఈ క్లూని తీసుకొని,Googleలో కీవర్డ్ searchలో ఉపయోగించగా,’స్మార్టెస్ట్ వర్కర్స్’ యొక్క YouTube పేజీకి దారితీశాయి, అక్కడ మేము ఈ వైరల్ వీడియోను కనుగొన్నాము.

వైరల్ వీడియో సెప్టెంబరు 24, 2023న ప్రచురించబడింది మరియు దాని శీర్షిక – ప్లాస్టిక్ యొక్క కొత్త ప్రయోజనం: రీసైక్లింగ్ జర్నీని ఆవిష్కరించడం.

స్మార్టెస్ట్ వర్కర్స్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ వెంచర్ యొక్క తుది ఉత్పత్తి వాస్తవానికి ఏమిటో గుర్తించడానికి మేము ఈ ఆధారాలు ఉపయోగించాము. ఇదే విధమైన ప్రక్రియను అనుసరించే వీడియోలలో ఒకదానిలో, వీడియో తుది ఉత్పత్తి ప్లాస్టిక్ LLDPE అని పేర్కొంది, అంటే, ‘లీనియర్ తక్కువ-సాంద్రత’ కలిగిన పాలిథిలిన్.ఈ ఉత్పత్తులు ప్రాథమికంగా ప్లాస్టిక్-గుళికలు(plastic-pellets), వీటిని ప్లాస్టిక్ సీసాలు, ఆటోమొబైల్స్, నిత్యావసర వినియోగ వస్తువులు మొదలైన వాటి తయారీ వంటి బహుళ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

ఆటోమొబైల్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్ గుళికలను(plastic pellets) తయారు చేయడానికి అదే ప్రక్రియను/పద్దతిని ఉపయోగించే మరొక వీడియోను మేము గుర్తించాము.

Digiteye India బృందం వారు ఉజ్జయినిలో ఉన్న వ్యాపారి నిరుపమ్ అగర్వాల్‌తో మాట్లాడినప్పుడు, ఆయన ఈ వైరల్ వీడియోలోని ఈ గుళికలు(pellets) బియ్యం లేదా గోధుమ గింజలు కాదని నిర్ధారించారు.ఈ గుళికలు (pellets)రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసినవని మరియు వాటిని పరిశ్రమల్లో వాడతాం, మనుషుల వినియోగానికి కాదని’ అగర్వాల్ అన్నారు.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

వాదన/CLAIM: ప్లాస్టిక్‌తో గోధుమ గింజలను తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీ వైరల్ వీడియో కనిపిస్తుంది.

నిర్ధారణ/CONCLUSION: వైరల్ వీడియో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసే ఫ్యాక్టరీని చూపిస్తుంది.ప్లాస్టిక్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి, కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై చిన్న గుళికలగా(pellets)ఏర్పరుస్తుంది.ఈ గుళికలను(pellets) పరిశ్రమలలో ఉపయోగిస్తారు మరియు అవి మనుషుల వినియోగానికి ఉద్దేశించినవి కావు. అవి ఏ రకమైన ఆహార ధాన్యాలు కావు.

RATING: – Totally False–?????

[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check]

 

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check

గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మధ్య, హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించిన తర్వాత, విభిన్న దావాలతో కూడిన పలు వీడియోలు మరియు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.వైరల్ చిత్రాలలో ఒకటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ఆర్మీలో చేరడానికి పంపినట్లు పేర్కొంది.

వైరల్ ట్వీట్ బెంజమిన్ నెతన్యాహు ఒక యువకుడితో ఉన్న చిత్రం కనబడుతుంది. “ఎంతటి నాయకుడు. నిజమైన దేశభక్తి: బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు తన కొడుకును జాతీయ విధుల్లోకి పంపుతున్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీ” అని ట్వీట్‌లో ఉంది.

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు కుమారుడు ఇజ్రాయెల్ సైన్యంలో చేరి హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడతారని ట్వీట్ పేర్కొంది.

ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ అదే claim/దావాతో చిత్రం షేర్ చేయబడింది.

ఈ వైరల్ ఇమేజ్‌ని ఫ్యాక్ట్ చెక్ చేయమని Digiteye India టీమ్‌ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది.

FACT CHECK

క్లెయిమ్/దావా యొక్క సత్యాన్ని పరిశీలన చేయడానికి Digiteye India టీమ్‌ Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ను ఉపయోగించగా,’ఫ్రెండ్స్ ఆఫ్ LIBI ‘అని ఇజ్రాయెల్ సైనికులకు మద్దతిచ్చే ఒక ఇజ్రాయెలీ వెబ్‌సైట్ వాళ్ళు పోస్ట్ చేసిన చిత్రం అని తేలింది.డిసెంబర్ 4, 2017 నాటి పోస్ట్‌లో, వెబ్‌సైట్ ఈ చిత్రాన్ని “ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కుమారుడు అవ్నర్ నెతన్యాహు (Avner Netanyahu)ఆర్మీ సర్వీస్‌ను పూర్తి చేశాడు” అని పేర్కొన్న పోస్ట్ కోసం షేర్ చేసింది.

ఇది బెంజమిన్ నెతన్యాహు కుమారుడు అవ్నర్ యొక్క మరిన్ని చిత్రాల కోసం వెతకడానికి దోహదపడింది. మేము కీవర్డ్ ని ఉపయోగించి వెతకగా ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‘ ప్రచురించిన ఈ పోస్ట్‌కు దారితీసింది.డిసెంబరు 1, 2014 నాటి కథనం ప్రకారం, నెతన్యాహు తన కొడుకు తప్పనిసరి ఆర్మీ సర్వీస్‌లో చేరుతున్నందున అతనికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొంది.వార్తా ప్రచురణ ఇదే చిత్రాన్ని “డిసెంబర్ 01, 2014న జెరూసలేం అమ్మూనిషన్ హిల్లో వారి కుమారుడు అవ్నర్‌తో కలిసి కనిపించిన ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరియు అతని భార్య సారా” అనే శీర్షికతో ప్రచురించింది.

“ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చిన్న కుమారుడు అవ్నర్ నెతన్యాహు (Avner Netanyahu)సోమవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో తన సైనిక సేవను ప్రారంభిస్తున్నాడు, అతను తల్లిదండ్రులచే హృదయపూర్వక వీడ్కోలు అందుకొన్న తరువాత, అతను బస్సులో ఎక్కడానికి వచ్చాడు” అని వార్తా పత్రిక శీర్షిక పేర్కొంది.

యూదు, డ్రూజ్ లేదా సర్కాసియన్(Jewish, Druze or Circassian) అయిన 18 ఏళ్లు పైబడిన ప్రతి ఇజ్రాయెల్ పౌరుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో పనిచేసే ‘తప్పనిసరి విధానం’ ఇజ్రాయెల్లో కలిగి ఉంది.కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పౌరులు నమోదు చేసుకున్న తర్వాత, వారు నిర్ధిష్ట రోజుల పాటు సైన్యంలో పనిచేయవలసి ఉంటుంది.పురుషులు కనీసం 32 నెలలు, మహిళలు కనిష్టంగా 24 నెలలు సేవ చేయాలని భావిస్తున్నారు.పౌరులు ‘ఎలైట్ కంబాట్ యూనిట్ల’ నుండి ‘కంబాట్ సపోర్ట్ యూనిట్ల’ వరకు ఉండే యూనిట్లలో సేవలు అందిస్తారు.

అందువల్ల ఈ దావా తప్పు.

CLAIM/దావా: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారు.

CONCLUSION/నిర్ధారణ: ఈ వైరల్ చిత్రం 2014లో బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ‘తప్పనిసరి ఆర్మీ సర్వీస్’‌లో చేరడానికి ముందు హృదయపూర్వక వీడ్కోలు అందించడానికి వెళ్లినప్పటి చిత్రం.

RATING: Misrepresentation-???

[మరి కొన్ని Fact checks: నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణించారా? నకిలీ ట్విట్టర్ ఖాతా యొక్క దావా వైరల్ అవుతుంది; Fact Check ; MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]

బ్రహ్మపుత్ర నది కింద రాబోయే 14-కిమీ సొరంగం గురించి తప్పు చిత్రంతో దావా చేయబడింది ; Fact Check

బ్రహ్మపుత్ర నది కింద అండర్ వరల్డ్ రోడ్డు-రైలు మార్గం రాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ చిత్రం వైరల్ అవుతోంది.
పరిశీలనలో ఉన్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగానికి సంబంధించిన అనేక ప్రణాళికల కారణంగా ఇది ప్రాముఖ్యాత సంతరించుకుంది.

పోస్ట్‌తో పాటు, అండర్ వాటర్ రైల్-కమ్-రోడ్ నెట్‌వర్క్ యొక్క చిత్రం హిందీభాషలో ఉన్న క్లెయిమ్‌/దావాతో జోడించబడింది.
“इसे कहते हैं नया भारत…..भारत की पहली पानी के नीचे सड़क व रेलवे लाइन, यह असम में ब्रह्मपुत्र नदी के नीचे बनी लगभग 14 किलोमीटर लंबी सुरंग है। – जय हो” (తెలుగు అనువాదం: దీనిని న్యూ ఇండియా అంటారు… భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి రహదారి మరియు రైల్వే లైన్. ఇది అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద నిర్మించిన సుమారు 14-కిమీ పొడవైన సొరంగం.జై హో).

పోస్ట్‌ వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ చేయబడింది.

FACT CHECK

వాస్తవం తనిఖీ చేయడం కోసం Digiteye India చిత్రాన్ని స్వీకరించి, Google రివర్స్ ఇమేజ్ లో పరిశీలన చేయగా, అది పాత చిత్రమని మరియు దావా తప్పుదారి పట్టించే విధంగా ఉందని కనుగొన్నాము.

జర్మనీని డెన్మార్క్‌తో కలిపే యూరప్‌లోని ఫెహ్‌మార్న్ బెల్ట్ ఫిక్స్‌డ్ లింక్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చిత్రం. ఈ చిత్రం నీటి అడుగున రైలు మరియు రహదారి లింక్ ఉండడంతో విస్తృతంగా ప్రసిద్ది చెందింది.

ప్రాజెక్ట్‌ పూర్తి అయినప్పుడు, నీటి అడుగున ఆటో మరియు రైలు సొరంగం జర్మనీ మరియు డెన్మార్క్‌లను కలుపుతుంది” అని ఈ చిత్ర సారాంశం. ఈ చిత్రం క్రెడిట్ ఫెమెర్న్‌కి క్రింద విధంగా ఇవ్వబడింది:

బ్రహ్మపుత్ర నది దిగువన ఉన్న నీటి అడుగున లింక్‌కు(underwater link ) సంబంధించిన వార్తల కోసం వెతుకుతున్నప్పుడు, రైల్వే మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మరియు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) దేశంలోనే నీటి అడుగున మొట్టమొదటి రోడ్-కమ్-రైల్ సొరంగాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు పలు వార్తా నివేదికలు వెలువడ్డాయి. బ్రహ్మపుత్ర నది అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతుంది, దీని నిర్మాణానికి వ్యయం ₹7,000 కోట్లు అని అంచనా.

అయితే, ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రణాళికను లేదా వివరణను విడుదల చేయలేదు. అందువల్ల, ఇది భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి రైలు-రోడ్డు ప్రాజెక్ట్ అనే వాదన తప్పు.

వాదన/Claim:అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద భారతదేశంలోని నీటి అడుగున మొట్టమొదటి రహదారి మరియు రైల్వే లైన్ సొరంగం నిర్మించబడుతుందనే వాదనతో ఉన్న చిత్రం.

నిర్ధారణ/Conclusion:వార్త సరైనది కానీ చిత్రం తప్పు ,ఆ చిత్రం ఐరోపాలో రాబోయే సొరంగం చిత్రం.

Rating: Misleading:

[మరి కొన్ని fact Checks: Is Nobel laureate Amartya Sen dead? Fake Twitter account’s claim goes viral; Fact Check  Image of beautiful marine animal Sea Pen passed off as Nagapushpa, a rare flower]