సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు ఆపాదించబడిన తప్పుడు దావా/వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది; Fact Check

భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ‘ప్రజలను వీధుల్లోకి రావాలని మరియు వారి హక్కులను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని’ కోరుతున్నట్టు ఆయన ఫోటోతో ఉన్న ఒక సందేశం వాట్సాప్‌లో షేర్ చేయబడుతోంది.

“భారత ప్రజాస్వామ్యం సుప్రీం కోర్ట్ జిందాబాద్” అని రాసి ఉన్న శీర్షికతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఫోటోను షేర్ చేయబడింది. ఫోటో మీద క్రింద విధంగా వ్రాసీ ఉంది.

“మేము భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అయితే మీ సహకారం కూడా చాలా ముఖ్యం. దీని కోసం ప్రజలందరూ సంఘటితమై వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని అడగాలి. ఈ నియంతృత్వ ప్రభుత్వం ప్రజలను భయపెడుతుంది మరియు బెదిరిస్తుంది, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి మరియు ప్రభుత్వాన్ని అడగండి, నేను మీతో ఉన్నాను.”

భారతదేశ సుప్రీం కోర్టు యొక్క అత్యున్నత పదవిని కలిగి ఉన్న అత్యున్నత న్యాయమూర్తి అయిన CJIకి సంబంధించిన పోస్ట్‌లోని విషయాల యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయడానికి Digiteye India బృందం వాట్సాప్ అభ్యర్థనను(WhatsApp request) స్వీకరించింది.

FACT CHECK

Digiteye India బృందం అనేక అంశాలలో కోట్/Claim నకిలీదని గుర్తించింది. ఏ సీజేఐ(CJI) కూడా ఇలాంటి అప్పీలు చేయరు.వ్యాకరణం మరియు వాక్యాలలో తప్పులు చూస్తే ఆ పోస్ట్ CJI నుండి వచ్చింది కాదని వెల్లడవుతుంది.“ఇది ఫేక్ ఫార్వార్డ్”. సీజేఐ చంద్రచూడ్ లాంటి వారు అలాంటి పని చేయరు. భారత ప్రధాన న్యాయమూర్తి పైన చేసిన ఇటువంటి తీవ్రమైన దుశ్చర్యలకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ” అని భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పునరుద్ఘాటించారు.

వెంటనే CJI మరియు సుప్రీం కోర్ట్ కార్యాలయాలు సోమవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసి, సుప్రీం కోర్ట్ యొక్క ఉన్నత న్యాయమూర్తి అటువంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదని మరియు ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న సందేశాలు(Messages) తప్పుడు సందేశాలని పేర్కొంది. వారిచ్చిన ప్రకటన కాపీని ఇక్కడ చూడండి:

పై ప్రకటన అనువాదం: ఈ సందేశం(Message) యొక్క వాస్తవికతను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, “సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ యొక్క ఫైల్ ఫోటోను ఉపయోగించి ఆయనను తప్పుగా ఉటంకిస్తూ( Quote చేస్తు) ప్రచారం చేస్తున్నారనే పోస్ట్ చేయడం భారత సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.ఇది నకిలీ మరియు దురుద్దేశం కలిగిన పోస్ట్. భారత ప్రధాన న్యాయమూర్తి అటువంటి పోస్ట్‌ను జారీ చేయలేదు మరియు అటువంటి పోస్ట్‌కు అధికారిక అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేసే అధికారులతో తగిన చర్యలు తీసుకుంటున్నాం.”

Claim/వాదన: భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రజలు ఏకమై తమ హక్కుల కోసం అధికారులపై పోరాడాలని కోరారు.

నిర్ధారణ: లేదు, జస్టిస్ చంద్రచూడ్ ఎప్పుడూ అలాంటి పోస్ట్‌ను జారీ చేయలేదు మరియు అలాంటి పోస్ట్‌కు అధికారిక అనుమతి ఇవ్వలేదు.

Rating: Totally False —

[మరి కొన్ని Fact Checks: Did laser beam weapons from space cause Hawaii wildfires? Fact Check]

No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Check]

 

మహామేరు పుష్పం ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుందా? Fact Check

క్యాబేజీని పోలిన ఆకులతో కూడిన పెద్ద పసుపు రంగు పువ్వు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చిత్రంతో ఉన్న శీర్షిక “టిబెట్ యొక్క ప్రత్యేకమైన ‘పగోడా ఫ్లవర్’ శుభప్రదమైనది.హిమాలయాల్లో ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసించే మహామేరు పుష్పం ఇది.మన తరంకు కనీసం ఫోటోల్లో చూసే అదృష్టం ఉంది.దయచేసి ఇతరులు కూడా చూడగలిగేలా షేర్ చేయండి.జీవితాంతం అదృష్టం కలిసి వస్తుంది! ”

పువ్వును చూస్తే అదృష్టం కలిసి వస్తుంది! అని పేర్కొనడంతో చిత్రాలు వైరల్‌గా మారాయి.

Fact Check:

సోషల్ మీడియాలో పరిశీలించినపుడు ఈ చిత్రం 2019 నుండి  చెలామణిలో ఉన్నట్టు చూపించింది.ఇది కాకుండా, ఇతర పువ్వుల చిత్రాలు కూడా అదే శీర్షికతో షేర్ చేయబడ్డాయి.Digit Eye India  వాస్తవం తెలుసుకోవడం కోసం ఈ చిత్రాన్ని/అభ్యర్థనను స్వీకరించింది.

మేము Plant Netలో రివర్స్ ఇమేజ్ ఉపయోగించి పరిశిలిస్తే, ఆ మొక్క పేరు Rheum nobile అని చూపించింది. (Plant Net websiteలో వినియోగదారులు మొక్కల చిత్రాలను అప్‌లోడ్ చేసి దాని శాస్త్రీయ నామాన్ని తెలుసుకోవచ్చును)

Sikkim Rhubarb(సిక్కిం రబర్బ్) అని కూడా పిలువబడే Rheum nobile(రుయం నోబిల్), రెండు మీటర్ల ఎత్తు వరకు పెరిగి,ఎక్కువ కాలం నిలిచి ఉండే మొక్క.ఇది జూలై మరియు ఆగస్టు మధ్య పుష్పాలను వికసిస్తుంది.ఇది హిమాలయాలకు చెందినది మరియు సిక్కిం, భూటాన్,టిబెట్ వంటి ఆల్పైన్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.

[మరి కొన్ని Fack Checks చూడండి: [No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Checkమరియు  [Sandals with Ganesha image surface after 2 decades on social media; Fact Check]

అయితే, పగోడా ఫ్లవర్ అని పిలువబడే ఒక పువ్వు ఉంది కానీ పైన చూపిన విధంగా ఎరుపు రంగులో ఉంటుంది.ఇది సాధారణంగా ఆసియాలో కనిపిస్తుంది. Florida Museum. వారి ప్రకారం, దీని శాస్త్రీయనామం Clerodendrum paniculatum, ఇది 6 అడుగుల లేదా అంతకంటే ఎక్కువ పొడవు పెరుగుతుంది. ‘Flowers of India, ‘వారి ప్రకారం పిరమిడ్ ఆకారపు కలిగి జపనీస్ పగోడా లాగా అంచెలంచెలుగా అమర్చబడి ఉంటాయి కాబట్టి ఈ పువ్వుకు ఆ పేరు పెట్టారు.ఒకొక్క పువ్వు కేవలం 0.5-అంగుళాల పొడవు  ఉండి, ఎక్కువ కాలం నిలిచి ఉండే మొక్క.

అదేవిధంగా, చెలామణిలో ఉన్న తెల్లని పువ్వు, చిగురించే దశలో ఉన్న కింగ్ ప్రొటీయా పువ్వు (King Protea flower)యొక్క చిత్రం.  Gardenia వారి ప్రకారం ప్రొటీయా సైనరాయిడ్స్(Protea cynaroides)అని కూడా పిలుస్తారు, ఇది దక్షిణాఫ్రికా జాతీయ పుష్పం.చాలా తక్కువ కొమ్మలు కలిగి పొదగా ఉంటుంది, ఇది ఒక సీజన్‌లో ఆరు నుండి పది పువ్వులను కాసుస్తుంది.

Claim/వాదన: మహామేరు పుష్పం ప్రతి 400 సంవత్సరాలకు వికసిస్తుందా? Fact Check

నిర్ధారణ: 1.క్యాబేజీని పోలిన ఆకులతో కూడిన పెద్ద పసుపు రంగు పువ్వు పేరు Rheum nobile. ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుందనే వాదన తప్పు.

2.పగోడా ఫ్లవర్ అని పిలువబడే ఒక పువ్వు ఉంది కానీ తెలుపులో కాకుండ ఎరుపు రంగులో ఉంటుంది.దీని శాస్త్రీయనామం Clerodendrum paniculatum.

3.చెలామణిలో ఉన్న తెల్లని పువ్వు కింగ్ ప్రొటీయా పువ్వు(King Protea flower).ఇది ఒక సీజన్‌లో ఆరు నుండి పది పువ్వులను కాస్తుంది.

4.కార్ప్స్ ప్లాంట్( Corpse Plant)అని కూడా పిలువబడే అమోర్ఫోఫాలస్ టైటానియం(Amorphophallus Titanium) పుష్పాలు వికసించటానికి దాదాపు 4–10 సంవత్సరాలు పడుతుంది.

Rating Misinterpretation:


					

2019 సం.లో రెస్క్యూ చేసిన కుక్కపిల్లల పాత వీడియో, టర్కీ భూకంపంలో రెస్క్యూ చేసిన వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అయింది; Fact Check

టర్కీ మరియు సిరియాలో భూకంపం సంభవించి,ముఖ్య వార్తగా వెలువడుతున్న సమయంలో, కుక్కపిల్లల తల్లి ఆత్రుతగా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతు,అతను కుక్కపిల్లలను ఎలా రక్షించాడో చూపిస్తూ ఒక వీడియో వైరల్ అయ్యింది. తాజా భూకంప ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో జరిగిన వాదనను మరియు వీడియోను చూడండి.

టర్కీలో భూకంపంలో శిథిలాలు క్రింద చిక్కుకున్నఈ కుక్కపిల్లల్ని 7 రోజుల తర్వాత రెస్క్యూ బృందాలు రక్షించగలిగాయి!  #Turkey_earthquake #earthquaketurkey #HelpTurkey #Turcja #Turquie #Turquia #Turchia #earthquakeinsyria #Syria #depremzede #AhbapDernegi #earthquake #earthquakes. pic.twitter.com/rcIamjvxkx

— Abdul Ahad (@OneAahad) February 14, 2023

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది. “టర్కీ భూకంపం” అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న క్యాప్షన్, ఇది టర్కీ నుండి తీసుకోబడింది అని సూచించింది. ఈ వైరల్ వీడియోకి ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో వేల సంఖ్యలో లైక్‌లు మరియు రీట్వీట్‌లు వచ్చాయి.

FACT CHECK

వీడియోలో శీతాకాలపు దుస్తులు ధరించకుండా ఉన్న వ్యక్తిని చూసి ‘DigitEye India బృందం’, Youtube మరియు Google రివర్స్ ఇమేజ్నలో వీడియో యొక్క మూలాన్ని పరిశీలించి, వాస్తవాని తెలుసుకున్నారు. నిజానికీ ఇది 2019లో భారతదేశం నుంచీ అప్‌లోడ్ చేయబడిన వీడియో అని, అది రాజస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలిపోవడంతో ఒక వ్యక్తి కుక్కపిల్లలను ఎలా రక్షించాడో చూపిస్తూన్న వీడియో.

ఆ వ్యక్తి వేసుకున్నా టీ-షర్ట్ వెనకల “AnimalAid Unlimited” అని కనిపిస్తుంది, ఇది ఉదయపూర్‌లోని వీధి జంతువులను రక్షించే మరియు సహాయం చేసే ఒక NGO.వాస్తవానికి ఈ వీడియోను NGO వారి యూట్యూబ్ ఛానెల్‌లో ఆగస్టు 8,2019న షేర్ చేసింది. భారీ వర్షాల కారణంగా కుప్పకూలిన ఇంటి శిథిలాల కింద తన కుక్కపిల్లలు చిక్కుకోవడంతో ఏడుస్తున్న తల్లి కుక్క గురించి NGOకి సమాచారం అందినట్లు వివరించారు.వెంటనే, NGO సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ అసలు వీడియో(original video)లో చూపిన విధంగా కుక్కపిల్లలను రక్షించారు.

అందువల్ల, టర్కీ భూకంపం సహాయక చర్యల భాగంగా తీసిన వీడియో అనే వాదన తప్పు.

వాదన/Claim:ఇటీవలి టర్కీ భూకంపం విపత్తు సమయంలో కుక్కపిల్లలను రక్షించినట్లు వీడియో చూపిస్తుంది.
నిర్ధారణ: భారతదేశం నుంచీ అప్‌లోడ్ చేయబడిన పాత వీడియో. టర్కీ భూకంపం సమయంలోనిది కాదు.
Rating: Misrepresentation —

[మరి కొన్ని FACT CHECKS చూడండి:

No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Check]

  Did Turkey release stamp on Modi after India’s help in earthquake relief operations? Fact Check]

 

 

 

 

 

 

 

 

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ GST రేటును 31.3% నుండి 18%కి తగ్గించిన తర్వాత మొబైల్ ఫోన్‌లు, టీవీలు మరియు రిఫ్రిజిరేటర్‌లు చౌకగా మారాయని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది.
ఇది ఇక్కడ మరియు ఇక్కడ సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ, చాలా మంది ‘GST రేట్లు పెంచినప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు బయటకు వచ్చి అభినందించాలి’ అంటూ సందేశాలు పోస్ట్ చేశారు. అనేక మీడియా సంస్థలు మరియు అధికారిక వెబ్‌సైట్‌లు ఇదే సందేశాన్ని వెళ్ళడించాయి.

గృహోపకరణాల ధరలపై పెద్ద ఉపశమనం: కొత్త GST రేట్ల క్రింద ఉన్న వస్తువుల జాబితాను చూడవచ్చును 👇#GST #India #House #TV #Mobile #Tax pic.twitter.com/GcjTgpv6Wt

— ET NOW (@ETNOWlive) July 2, 2023

PIB కూడా ఇదే సందేశాన్ని షేర్ చేసింది.
తగ్గిన పన్నులతో, #GST ప్రతి ఇంటికి ఆనందాన్ని తెస్తుంది:గృహోపకరణాలు మరియు మొబైల్ ఫోన్‌లపై #GST ద్వారా ఎంతో ఉపశమనం📱🖥️#6YearsofGST #TaxReforms

#GSTforGrowth pic.twitter.com/LgjGQMbw6e

— PIB India (@PIB_India) June 30, 2023

FACT CHECK

DigitEye బృందం వారు GST కౌన్సిల్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించినప్పుడు, కౌన్సిల్ నుండి అలాంటి నోటిఫికేషన్/సూచన ఏదీ చేయలేదు.అంతేకాకుండా, వైరల్ పోస్ట్‌లో పేర్కొన్న విధంగా 31.3% కాకుండ ప్రస్తుత GST స్లాబ్‌లు 5%, 12%, 18% మరియు గరిష్టంగా 28% వరకు ఉన్నాయి. GST అమలై 6 సంవత్సరాలైన సందర్బాన్ని (6వ వార్షికోత్సవం) 01 జూలై 2023న న్యూఢిల్లీలో ‘GST డే’గా జరుపుకుంది.ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2017లో GSTని ప్రవేశపెట్టడానికి ముందు మరియు తర్వాత యొక్క పన్నులను పోలుస్తూ,GST యొక్క ప్రయోజనాలను హైలైట్ చేసారు.

నేటి నుంచే జీఎస్టీ రేట్లు తగ్గింపు…

ఎవరైతే ‘GST’ రేట్లు పెంచినప్పుడు విమర్శించినారో వారు ఇప్పుడు బయటకు వచ్చి అభినందించాలి. pic.twitter.com/H2ljyr5cKS

— Novice2NSE (@Novice2NSE) July 1, 2023

వాదన ప్రకారం GST తగ్గిందని సోషల్ మీడియా విస్తృతంగా షేర్ చేయబడ్డది.అలానే Zee News, ABP Live, News18, Jagran, India TV, ET Now వంటి అనేక మీడియా సంస్థలు ఇదే సందేశాన్ని అందించాయి. వాస్తవం ఏమిటంటే GSTని ప్రవేశపెట్టడానికి ముందు మరియు తర్వాత యొక్క పన్నుల(SST) పోలిక మాత్రమే, కాని మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై ప్రస్తుత GST రేటు తగ్గిందని  కాదు. 2020లో కొన్ని గృహోపకరణాలపై రేటు తగ్గించబడింది లేదా పెంచబడింది, కాని ఇప్పుడు కాదు.

తగ్గిన పన్నులతో, #GST ప్రతి ఇంటికి ఆనందాన్ని తెస్తుంది:గృహోపకరణాలు మరియు మొబైల్ ఫోన్‌లపై #GST ద్వారా ఎంతో ఉపశమనం📱🖥️#6YearsofGST pic.twitter.com/JzMGqZjFSA

— CBIC (@cbic_india) July 4, 2023

[ఇది కూడా చూడండి:Did TTD reject KMF bid for supply of Nandini ghee after 50 years? Fact Check]

Central Board of Indirect Taxes & Customs తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వివిధ గృహోపకరణాలపై పన్ను రేట్లు 2017లో GST అమలుకు ముందు మరియు తర్వాత ఉన్నాయని స్పష్టత ఇచ్చింది.పైన పేర్కొన్న ఉపకరణాల రేట్లు 2020లో 28%కి పెంచబడ్డాయి.
అందువల్ల, వాదన/దావా తప్పుదారి పట్టించే విధంగా వుంది, మరియు అది నిజం కాదు.

ప్రస్తుత GST రేట్లు

CBIC వెబ్‌సైట్ మరియు గృహోపకరణాలపై GST యొక్క తాజా సవరణ ప్రకారం, 1 ఏప్రిల్ 2023న నిర్ణయించబడిన పన్ను రేట్లు మారవు. మొబైల్ ఫోన్‌లు, టెలివిజన్‌లు (32 inches కంటే తక్కువ) మరియు రిఫ్రిజిరేటర్‌లకు ప్రస్తుత GST రేట్లు 18%.
2020లో మొబైల్ ఫోన్‌లకు (12% నుండి 18% వరకు), మరియు 2018లో రిఫ్రిజిరేటర్‌లు,టెలివిజన్‌లకు (32 అంగుళాల వరకు) (28% నుండి 18% వరకు) ఈ రేట్ల చివరి సవరణ జరిగింది.

వాదన/Claim: GST రేటును 31.3% నుండి 18%కి తగ్గించిన తర్వాత మొబైల్ ఫోన్‌లు, టీవీలు మరియు రిఫ్రిజిరేటర్లు చౌకగా మారాయి.

నిర్ధారణ: పేర్కొన్న గృహోపకరణాలపై పన్ను రేట్ల సవరణకు సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 01 ఏప్రిల్ 2023న నిర్ణయించబడిన పన్ను రేట్లు నేటికీ మారలేదు.

మొబైల్ ఫోన్‌లు, టెలివిజన్‌లు (32 inches కంటే తక్కువ) మరియు రిఫ్రిజిరేటర్‌లకు ప్రస్తుత GST రేట్లు 18%.
2020లో మొబైల్ ఫోన్‌లకు (12% నుండి 18% వరకు), మరియు 2018లో రిఫ్రిజిరేటర్‌లు,టెలివిజన్‌లకు (32 అంగుళాల వరకు) (28% నుండి 18% వరకు) ఈ రేట్ల చివరి సవరణ జరిగింది.

అధికారిక ప్రకటన ప్రకారం GSTకి ముందు మరియు GSTకి తరువాత రేట్లు, అంతేకాని తాజాగా తగ్గించలేదు.
తాజా తగ్గింపుగా తప్పుగా సూచించబడింది.
Rating: Misleading —

[ఇది కూడా చూడండి: No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Check]

ఆంధ్రా తీరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసింది కాదు, బంగారు రంగులో మాత్రమే ఉంది; Fact Check

ఆసాని తుఫాను మే 10, 2022న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చిన “బంగారు రథం (‘SONE का रथ’)” గురించిన వైరల్ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.దాదాపు అన్ని వార్తా కేంద్రాలు ఈ వార్తను కవర్ చేశాయి మరియు టీవీ ఛానెల్‌లు స్థానిక ప్రజలు దానిని సముద్రం నుండి ఒడ్డుకు ఎలా లాగడానికి ప్రయత్నిస్తున్నారో చూపించాయి.

వెంటనే, ఇది బంగారు రథం అనే వాదనతో వాట్సాప్ మరియు ట్విట్టర్ సందేశాలులో హోరెత్తినాయి.

समंदर में मिला सोने का रथ:

चक्रवात असानी की वजह से आंध्र प्रदेश के श्रीकाकुलम जिले के एक तट पर समुद्री लहरें एक ‘सोने का रथ’ बहा ले आई हैं,
इस रथ की बनावट किसी मोनेस्ट्री जैसी है,

माना जा रहा है कि ये रथ थाइलैंड या म्यांमार से बहकर आंध्र के तट तक पहुंच गया है!

Video: ABP news pic.twitter.com/HpjS7dERmj

— !!…शिवम…!! ??RED_2.0?? (@Aaaru_Prem) May 11, 2022

పైన హిందీ యొక్క అనువాదం ఇది: సముద్రంలో దొరికిన బంగారంతో చేసిన రథం.ఆసాని తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చిన “బంగారు రథం”. రథం ఒక మఠం ఆకారంలో ఉంది. బహుశా ఇది థాయ్‌లాండ్ లేదా మయన్మార్ నుండి తేలుతూ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరి ఉండవచ్చు.

తుఫానులో ఈ “రథం” బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఇది కేవలం బంగారంతో తయారు చేయబడింది…
మన హిందూ నాగరికత ఎంత సుసంపన్నంగా, ధనికంగా ఉందో చెప్పడానికి ఇది ప్రతీక… #GoldenChariot pic.twitter.com/CWaKdLKR8T

— Nick (@Nickonlyfru) May 11, 2022

#Goldenchariot: ಶ್ರೀಕಾಕುಳಂ ಸಮುದ್ರದಲ್ಲಿ ತೇಲಿ ಬಂದ ಗೋಲ್ಡನ್ ರಥದ ಲೇಟೆಸ್ಟ್ ದೃಶ್ಯ
ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ► https://t.co/I3omngLlis

Video Link►https://t.co/RycA87x9pL#TV9Kannada #goldenchariot #mysteriouschariot #SrikakulamCostal #AndhraPradesh pic.twitter.com/NoBt3skt8Q

— TV9 Kannada (@tv9kannada) May 11, 2022

ఇది ట్విట్టర్ మరియు వాట్సాప్‌లలో విస్తృతంగా షేర్ చేయబడింది.

golden chariot

[ఇది కూడా చదవండి: పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదా? Fact Check ]

FACT CHECK

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ Shrikesh B Lathakar గారు మీడియాతో మాట్లాడుతూ రథం బంగారంతో చేసింది కాదని, బంగారు రంగులో మాత్రమే ఉందని స్పష్టం చేశారు. “రథం ఇప్పుడు స్థానిక పోలీసుల అదుపులో ఉంది.”

“ఇది వేరే దేశం నుండి వచ్చి ఉండవచ్చు. మేము ఇంటెలిజెన్స్ మరియు ఉన్నతాధికారులకు సమాచారం అందించాము అని నౌపడ గ్రామం (శ్రీకాకుళం జిల్లా) యొక్క SI Saikumar గారు ANI వార్తా సంస్థతో నిర్ధారించారు.

#WATCH | Andhra Pradesh: A mysterious gold-coloured chariot washed ashore at Sunnapalli Sea Harbour in Srikakulam y’day, as the sea remained turbulent due to #CycloneAsani

SI Naupada says, “It might’ve come from another country. We’ve informed Intelligence & higher officials.” pic.twitter.com/XunW5cNy6O

— ANI (@ANI) May 11, 2022

శ్రీకాకుళంలోని టెక్కలి సర్కిల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం వెంకట గణేష్ ఏఎన్‌ఐ(ANI)తో మాట్లాడుతూ, “రథంలో బంగారం వంటి విలువైన లోహం పోలీసులకు లభించలేదని అన్నారు. ఇది ఉక్కు మరియు చెక్కతో తయారు చేయబడింది. కానీ దాని రంగు బంగారు రంగు.”

జిల్లా యంత్రాంగం తర్వాత రథంపై బర్మీస్‌లో లిపిలో వ్రాసిన స్క్రిప్ట్‌ను మరియు దానిపై జనవరి 16, 2022 అని తేదీని కనుకొన్నారు,కాబట్టి దాని మూలం మయన్మార్ అని ఆధారం కనిపించింది,కాని మయన్మార్ అధికారుల ఇంకా నిర్ధారణ చేయలేదు.

బంగారు రంగు వేసినప్పటికీ,ఇది బంగారు రథం కాదని చెక్క, ఇనుప లోహంతో తయారు చేసినట్లు జిల్లా యంత్రాంగం కూడా స్పష్టం చేసింది. అందువల్ల, “రథం” బంగారంతో తయారు చేయబడలేదు, కానీ బంగారు రంగులో ఉన్న బౌద్ధ మఠంకి చెందిన రథంగా ప్రతిబింబిస్తుంది.

వాదన/Claim:మే 10న ఆసాని తుపాను సమయంలో స్వర్ణరథం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం తీరంలో కొట్టుకొచ్చింది.

Conclusion: రథం బంగారు రంగుతో పెయింట్ చేయబడ్డది కానీ బంగారంతో తయారు చేయలేదు.

Rating: Misinterpretation —

[ఇది కూడా చదవండి: పాత రూ.2 నాణెం ఆన్‌లైన్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోందా? వాట్సాప్‌లో వీడియో వైరల్; Fact Check]

పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదా? Fact Check

అనేక అరుదైన పండ్ల రసాలను ఉపయోగించి క్యాన్సర్‌ను నివారించవచ్చు అనే అనేక వాదనలు WhatsAppలో షేర్ అవుతున్నాయి.ఈసారి పైనాపిల్ కలిపిన వేడినీరు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందనే వాదన వాట్సాప్‌లో షేర్ చేయబడింది.

WhatsAppలో సందేశం ఇలా వుంది: “వేడి పైనాపిల్ నీరు మిమ్మల్ని జీవితకాలం కాపాడుతుంది” మరియు “వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదు!”

అటువంటి claim/వాదన నిజమో కాదో తెలుసుకోమని Digiteye India Teamకి వాస్తవ పరిశీలన కోసం అభ్యర్థన వచ్చింది.
ట్విట్టర్‌ మరియు సోషల్ మీడియాలో ఒక సంవత్సరం పాటు ఇదే విధమైన వాదన ఉంది.ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

పైనాపిల్ కాండంలో అధిక స్థాయిలో “bromelain/బ్రోమెలైన్” అనే ఎంజైమ్ ఉంటుంది – ఇది ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, కండరాల ఉపశమనం మరియు జీర్ణక్రియకు సహాయం చేస్తుంది మరియు ఇది ట్యూమర్ కణాల పెరుగుదలకు ఆటంకం కలిగించే రసాయనాలు కూడా ఉండటం వలన, క్యాన్సర్‌ను నిరోధించడానికి పైనాపిల్‌ను మంచి ఆహారంగా చెప్పవచ్చును. pic.twitter.com/oJxcEE321Z
— Compounding Pharmacy (@abccompounding) February 15, 2023

FACT CHECK

మా బృందం దీనిని స్వీకరించి, ఈ claim/వాదన కొత్తది కాదని, 2021 నుండి షేర్ అవుతోంది అని తెలుసుకుంది.ముఖ్యంగా, PubMed వెబ్‌సైట్‌లో  పరిశోధన నివేదిక ప్రచురించబడిన తర్వాత ఈ వాదన/దావా చేయబడింది.

ఇటలీలోని నేపుల్స్‌లోని నేపుల్స్ ఫెడెరికో II విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ విభాగానికి సంబంధించిన ‘బార్బరా రొమానో(Barbara Romano )’ మరియు ఇతరులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, క్యాన్సర్‌ కణాలను నిరోధించడానికి పైనాపిల్‌ కాండంలో కనిపించే కొన్ని ఎంజైమ్‌ల నాణ్యతపై ల్యాబ్ పరీక్షలు నిర్వహించి, పై నివేదికను ప్రచురించింది.
“bromelain/బ్రోమెలైన్”మరియు “N-acetylcysteine/ఎన్-ఎసిటైల్‌సిస్టీన్” కలయిక జీర్ణశయాంతర (జిఐ) క్యాన్సర్ కణాల మనుగడ మరియు విస్తరణ యొక్క నిరోధాన్ని పెంచుతుంది” అని అధ్యయనంలో తేలింది.

అయితే ఈ అధ్యయనం ఇంకా ఖచ్చితమైనా నిర్దారణ చేయలేదు మరియు మరింత పరిశీనలన అవసరం. ఇండోనేషియా క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అరు విసాక్సోనో సుడోయో(Dr Aru Wisaksono Sudoyo) ఆగస్టు 6, 2021న AFPకి చెప్పారు.ఈ దశలో అటువంటి వాదన/దావాను ఖచ్చితంగా నిజమని నిర్ధారించలేము. క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేసే గుణాల కోసం “bromelain/బ్రోమెలైన్” అధ్యయనం చేయబడిందని, అయితే ఇప్పటివరకు ఎటువంటి గట్టి ఆధారం లేదని ఆయన పేర్కొన్నారు.ప్రయోగశాలలో పని చేసేది నిజ జీవితంలో ప్రభావవంతంగా ఉండకపోవచ్చు” అని ఆయన హెచ్చరించారు.

న్యూయార్క్ నగరానికి చెందిన క్యాన్సర్ నిపుణుడు మరియు “Beyond the Magic Bullet: The Anti-Cancer Cocktail” పుస్తక రచయిత,డాక్టర్ రేమండ్ చాంగ్(Dr Raymond Chang)కూడా క్యాన్సర్ కణాలపై పైనాపిల్ యొక్క ప్రభావం అనే పరిశోధన ఇప్పటికీ టెస్ట్ ట్యూబ్ అధ్యయనాలపై ఆధారపడి ఉందనే వాస్తవాన్ని పునరుద్ఘాటించారు.

మనం ప్రయోగశాలలో చేసే ప్రయోగాలు మరియు క్లినికల్ రియాలిటీ మధ్య తేడా గురించి తెలుసుకోవాలి అని చాంగ్ చెప్పారు. “చాలా సహజమైన వస్తువులు ఒక కృత్రిమ ప్రయోగశాల వాతావరణంలో క్యాన్సర్ కణాలను చంపుతాయి,కానీ మనుషులపై నిజంగా ప్రయోగించినప్పుడు అవి పని చేయవు.”

ఇప్పటికీ క్లినికల్ ట్రయల్స్ యొక్క ఫలితాలు మిశ్రమంగా ఉండి,ల్యాబ్ అధ్యయనాలు కూడా ప్రాథమికంగా ఉన్నాయి.మరియు మానవ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగము) విస్తృత స్థాయిలో చేపట్టే వరకు, వేడి నీటిలో ఉన్న పైనాపిల్ క్యాన్సర్‌ను నయం చేయగలదని ఖచ్చితంగా నిర్ధారించలేము.

Claim/వాదన:పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ను నయం చేస్తుంది.

నిర్ధారణ:పరిశోధన ఫలితాలు ఇప్పటికీ ల్యాబ్ దశలోనే ఉన్నాయి మరియు మానవ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగము) పెండింగ్‌లో ఉన్నాయి,కాబట్టి దీనిని ఖచ్చితంగా నిజమని నిర్ధారించలేము.

Rating: Misleading —





పాత రూ.2 నాణెం ఆన్‌లైన్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోందా? వాట్సాప్‌లో వీడియో వైరల్; Fact Check

ఓ యాంకర్ పాత రూ 2 నాణెంకు లక్షల రూపాయలు చెల్లించి కొనుక్కోవడానికి కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నందున రూ 2 నాణెం మిమ్మల్ని రాత్రికిరాత్రే ధనవంతులను చేస్తుంది.ఆమె మిమ్మల్ని క్వికర్ ఖాతాను (Quikr account)తెరవమని కోరితు మరియు రూ 2 నాణెం చిత్రాన్ని అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. 2 నాణెం కొనుగోలుదారు కోసం వేచి ఉండండి అని చెబుతుంది.

Zeenews.com/business వంటి అనేక వార్తా పబ్లికేషన్‌లు కూడా Quikr ఖాతాను ఎలా తెరవాలనే దానిపై వివరంగా సమాచారాన్ని అందించాయి. రూ 2 నాణెం కోసం Googleలో వెతికినప్పుడు, క్రింద సమాచారం వెలువడుతుంది. Digiteye India వాస్తవం తెలుసుకొనుటకు పై వీడియో స్వీకరించింది.

FACT CHECK

Digiteye team వారు Googleలో వెతికినప్పుడు, Claim/దావా రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది.

‘నుమిస్మాటిక్స్'( numismatics–పాత బ్యాంకు నోట్లు, పాత నాణేల సేకరణ మరియు అధ్యయనం)విభాగంలో పరిశీలించినప్పుడు, పాత రూ.2 నాణేలు చాలా వరకు రూ.500కు మించకుండా అమ్ముడుపోయినట్టు క్వికర్ వెల్లడించింది.అంతేకాదు రూ. 2 నాణేలు అంత అరుదైనవి కావు.

Quoraలోని కొంతమంది వ్యక్తులు ఇది మోసానికి దారితీస్తుందని హెచ్చరించారు, దీని ద్వారా రూ. 2 నాణేలు అమ్మేవాళ్ళు తమ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్ మరియు OTP లాంటి సమాచారాన్ని అందించేలా తప్పుదారి పట్టించవచ్చు.ఆ తరువాత మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును సులభంగా బదిలీ చేస్తారు.

 

Digiteye India బృందం 1994 సంవత్సరం నాటి నాణెం క్వికర్‌లో (Quikr) పెట్టినప్పుడు, కొనాలకున్న వ్యక్తి నాణెంకు రూ. 2 లక్షలు ఇస్తానని, ధృవీకరణ సాకుతో బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్ వంటి వివరాలను కోరింది.చివరగా, ఆ వ్యక్తి ధృవీకరణ సాకుతో OTPని షేర్ చేయమని అడిగాడు, దీని వలన team member యొక్క బ్యాంక్ ఖాతా నుండి తక్షణమే నగదు బదిలీ చెయ్యబడే అవకాశం ఉండేది.మా ఆన్‌లైన్ సెర్చ్‌లో వెల్లడైనట్లు ఇది చాలా మందికి అనుభవం అయ్యింది.

ఆర్‌బీఐ ఏం చెబుతోంది:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆగష్టు 24, 2021న, ఈ విధంగా కొనసాగుతున్న మోసపూరిత కార్యకలాపాలలో భాగంగా వివిధ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాత నోట్‌లు మరియు నాణేలను కొనుగోలు చేసే లేదా విక్రయించే బోగస్ ఆఫర్‌లకు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించింది.

ఆర్‌బిఐ (RBI) ఒక పత్రికా ప్రకటనలో, ప్రజలను జాగ్రత్తగా ఉండాలని మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును ఉపయోగించి ఇటువంటి మోసపూరిత ఆఫర్‌ల ద్వారా డబ్బును రాబట్టడానికి మోసకారుల బారిన పడవద్దని సూచించింది.

కొన్ని అంశాలు మోసపూరితంగా RBI పేరు/లోగోను ఉపయోగిస్తున్నాయని మరియు వివిధ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా పాత నోట్లు & నాణేల కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించిన లావాదేవీలలో ప్రజల నుండి ఛార్జీలు/కమీషన్/పన్ను కోరుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. ఆర్‌బిఐ సందేశన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ (ANI news Agency) పేర్కొంది.

మారుతి సుజుకి వంటి ప్రధాన కంపెనీల వార్షికోత్సవాల సందర్భంగా ప్రజలకు బహుమతులు, కార్లు మరియు గృహోపకరణాల ఇస్తామని WhatsAppలో హామీ ఇవ్వబడిన అనేక వాదనలను గతంలో Digiteye India తిరస్కరించి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. కొత్త రూ. 2 కాయిన్ ట్రిక్ అనేది కూడా ప్రజలను మోసం చేయడానికి మరొక మోసపూరిత మార్గం.

Claim/వాదన: పాత రూ.2 నాణేన్ని లక్షల రూపాయలకు ఆన్‌లైన్‌లో విక్రయించండి.

నిర్ధారణ: Quikr లేదా Tezbid.com వంటి ఆన్‌లైన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో 2 నాణెం గరిష్టంగా రూ.500కి విక్రయిస్తుంది, అంతే కాని లక్షల్లో కాదు.మరియు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దోచుకొడానికి ఆన్‌లైన్ మోసంలో భాగం కావచ్చు. కాబట్టి ఈ Claim/వాదన తప్పు.నిజం లేదు.

Rating: Totally False 

 

 

 

 

లేదు, ఈ వీడియో ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ళ వయసులో డ్యాన్స్ చేసింది కాదు; Fact Check

ఇటీవల ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేస్తూ కనిపించిందంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వీడియో వైరల్ అయ్యింది. పోస్ట్ ఇలా ఉంది: ఆమె వైజయంతిమాల అని నమ్మడం కష్టంగా ఉంది… ఆమె అద్భుతమైన నర్తకి. 99 ఏళ్ల వయసులోనూ ఆమె డ్యాన్స్ చేయగలదు. నిజమే… రిటైర్ అయ్యరు కానీ అలసిపోలేదు.

ఇక్కడ షేర్ చేయబడింది.

వైజయంతిమాల

FACT CHECK

వాస్తవం పరిశీలన చేయమని Whatsappలో అభ్యర్థన వచ్చినప్పుడు Digiteye India సంస్థ వారు వీడియో యొక్క కొన్ని ప్రముఖ ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ శోధనలో వాటిని పరిశీలించినప్పుడు, ఆ వీడియో 93 ఏళ్ల వృద్ధురాలు గురించి ABP లైవ్ ద్వారా డిసెంబర్ 6, 2022న ఒక వార్తా నివేదికలో ఉపయోగించినట్లు కనుగొన్నాము.

ఆమె మరియు బాలీవుడ్  నటుడు షమ్మీ కపూర్ యొక్క ప్రసిద్ధ పాట ‘బదన్ పే సితారే లాపేతే హుయే’కి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. కాని వైరల్ వీడియోలో ఉన్న వృద్ధురాలు నటి వైజయంతిమాల అని నివేదికలో పేర్కొనలేదు.

93 साल की उम्र में दादी पर चढ़ा शम्मी कपूर का जादू…
बदन पे सितारे लपेटे हुये गाने पर जमकर थिरक रही दादी…#Viral #Dance #ShammiKapoor

pic.twitter.com/HCLW9cTahU

— Narendra Singh (@NarendraNeer007) December 5, 2022

మరింత పరిశీలించినప్పుడు, అనేక మీడియా నివేదికలలో డిసెంబర్ 2022లో 93 ఏళ్ల వృద్ధురాలు చాలా సరదాగా డ్యాన్స్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె ‘ప్రిన్స్’ చిత్రంలో వైజయంతిమాల మరియు షమ్మీ కపూర్ చేసిన ప్రసిద్ధ పాటకి/సంగీతానికి అద్భుతమైన నృత్యం చేయడం కనిపిస్తుంది.

వీడియోలోని నాట్యం చేసిన వృద్ధురాలు వైజయంతిమాల లాగా లేదు.చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైజయంతిమాల తాజా ఫోటో(పైన ఫోటో) చూస్తే మనకు తెలుస్తుంది.ఈ సంఘటన/ఇవెంట్ మార్చి 21, 2023న Mylapore Times కవర్ చేసారు.

IMDB రికార్డుల ప్రకారం, వైజయంతిమాల ఆగస్టు 13, 1933న జన్మించారు, అంటే ప్రస్తుతం ఆమె వయస్సు 89 సంవత్సరాలు,మరియు వాదన/దావా ప్రకారం 99 సంవత్సరాలు కాదు.

వాదన/దావాలోని ఈ వీడియో సంబంధము లేదనిది, మరియు వైజయంతిమాలకి తప్పుగా ఆపాదించబడింది.

వాదన/Claim: ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేస్తున్నట్లు తప్పుడు వీడియో షేర్ చేయబడింది.

నిర్ధారణ:వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి వైజయంతిమాల కాదు, ఆమె వయస్సు 89 సంవత్సరాలు, 99 సంవత్సరాలు కాదు.
Rating: Misrepresentation —

500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటా? Fact Check

గత కొన్ని రోజులుగా చెలామణిలో ఉన్న నక్షత్రం (*) గుర్తు ఉన్న ₹500 నోట్లు నకిలీ నోట్లు అనే క్లెయిమ్‌తో సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇటీవల RBI చెలామణి నుండి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్న సందర్భంలో, నక్షత్రం గుర్తు ఉన్న ₹500 నోటు మరింత దృష్టిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా, ఫేస్‌బుక్ పోస్ట్‌లోని లో ఒక వాదన ఈ మధ్య చాలమంది షేర్ చేసారు ఇలా: “గత 2-3 రోజుల నుంచి * గుర్తుతో కూడిన ఈ 500 నోట్లు మార్కెట్‌లో చెలామణి కావడం ప్రారంభించాయి.అలాంటి నోటు నిన్న IndusInd బ్యాంక్ నుండి తిరిగి వచ్చింది. ఇది నకిలీ నోటు.ఈ రోజు కూడా, ఒక స్నేహితుడు కస్టమర్ నుండి అలాంటి 2-3 నోట్లను అందుకున్నాడు, కానీ వెంటనే వాటిని తిరిగి ఇచ్చెసాడు.అయితే ఈ నోటును ఎవరో ఉదయం ఇచ్చారని కస్టమర్ కూడా చెప్పాడు.జాగ్రత్త వహించండి. ఇక్కడ మార్కెట్‌లో నకిలీ నోట్లను చెలామణి చేసే మోసగాళ్ల సంఖ్య పెరిగింది. అబ్యర్ధన: దయచేసి అప్రమత్తంగా ఉండండి.ఈ సందేశాన్ని మీ సోదరులకు తెలియజేయండి, తద్వారా వారు మోసం నుండి రక్షించపబడతారు. ధన్యవాదాలు.”

ఈ రకమైన వార్తలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

FACT CHECK

చాలా మంది వ్యక్తులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున Digiteye India team ఈ పోస్ట్‌లో ఎంత వాస్తవం ఉందొ పరిశీలనకు  తీసుకుంది. మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో, ₹500నోట్లు యొక్క ప్రామాణికత కోసం పరిశీలన చేసినప్పుడు, RBI ఇటీవల జూలై 27, 2023 తేదీలో జారీ చేసినతన పత్రికా ప్రకటనలో,  ఈ నోటు చట్టబద్ధమైనదని స్పష్టం చేసింది. RBI పత్రికా ప్రకటన క్రింద చూడవచ్చు:

ఈ విషయంలో, లోపభూయిష్టంగా ముద్రించిన బ్యాంక్ నోట్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుట కోరకు బ్యాంక్ నోటు యొక్క నంబర్ ప్యానెల్‌లో స్టార్ (*) చిహ్నం చేర్చబడ్డదని RBI పేర్కొంది. (100 సీరియల్ నంబర్ ఉన్న బ్యాంక్ నోట్ల ప్యాకెట్‌లో స్టార్ (*) చిహ్నం చెర్చబడినది). నక్షత్రం (*) చిహ్నం ఉన్న బ్యాంక్ నోటు ఏదైనా ఇతర చట్టపరమైన బ్యాంక్ నోటుతో సమానంగా ఉంటుంది, అని RBI వెలువడించింది.

RBI యొక్క FAQ విభాగంలో కూడా “స్టార్ (*) చిహ్నం పద్దతి లోపభూయిష్టంగా ముద్రించిన బ్యాంక్ నోట్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుట కోరకు చెర్చబడినది అని, నక్షత్రం (*) చిహ్నం ఉన్న బ్యాంక్ నోటు ఏదైనా ఇతర చట్టపరమైన బ్యాంక్ నోటుతో సమానంగా ఉంటుంది అని అని RBI వెలువడించింది.

మేము 2006 లో జారీ చేసిన ఇదే విధమైన ప్రెస్ రిలీజ్‌ని కనుగొన్నాము. ఇక్కడ ₹10,₹20,₹50 విలువ కలిగిన
కరెన్సీ నోట్లలో ‘స్టార్’ ప్రిఫిక్స్ జోడించబడుతుందని పేర్కొంది.

Claim/వాదన: RBI యొక్క ₹500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటు.
నిర్ధారణ: తప్పు,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నోట్లు చట్టబద్ధమైనవని స్పష్టం చేసింది.
Rating: Misrepresentation -- 



					

గుడ్లు చెట్ల నుండి వేలాడుతున్నాయా? Fact Check

చెట్లకు వేలాడుతున్న గుడ్ల యొక్క కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో అవి తెల్లటి మామిడిపండ్లు అనే వాదనలతో ప్రచారం చేయబడ్డాయి.

“కొన్ని ఆఫ్రికన్ల భూములలో మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో తెల్లటి మామిడిపండ్లు కనిపిస్తాయి” అని Facebookలో పోస్ట్ చేయబడినది.
ఆ చిత్రాలను ట్విట్టర్‌లో కూడా షేర్ చేశారు here.
వాదన/Claim ఇలా ఉంది: “హే అబ్బాయిలు, మీరు ఇంతకు ముందు తెల్లటి మామిడిపండ్లు చూశారా లేదా తిన్నారా ??? దేవుని సృష్టి ఎంత అందమైది”.

Hey guys, have you seen or eaten the white mongo before??? What a beautiful God creations ❤️ pic.twitter.com/3f2i05tbi0

— aa alhaji (@aaalhajiii) April 30, 2023

FACT CHECK

చిత్రాల ప్రామాణికత కోసం పరిశీలన చేసినప్పుడు, ఈ చిత్రాలకు ఎడమ దిగువన ‘Bing ఇమేజ్ క్రియేటర్’ ముద్ర వుందని మా బృందం గ్రహించింది.


మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్‌లో వెతికితే , Artificial Intelligence ఈ చిత్రాలను ‘బింగ్ ఇమేజ్ క్రియేటర్‌ని’ ఉపయోగించి సృష్టించిన చిత్రాలు అని తేలింది.

Hey guys, have you seen or eaten the white mongo before??? What a beautiful God creations ❤️ pic.twitter.com/3f2i05tbi0

— aa alhaji (@aaalhajiii) April 30, 2023

 

“చిత్రంలోని కొన్ని గుడ్లు లోపాలు మరియు వక్రఆకారం కలిగి ఉన్నాయి,కొన్ని ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి,మరికొన్ని ఆకారంలో అసమానతలను చూపుతున్నాయి”అని మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘జెనరేటివ్ AI మరియు డీప్‌ఫేక్‌’ సలహాదారు హెన్రీ అజ్డర్ (Henry Ajder) రాయిటర్స్‌తో(Reuters) అన్నారు.

అందువల్ల, ఇవి AI- రూపొందించబడిన గుడ్లు, నిజమైన గుడ్లు కావు.

Claim/వాదన: గుడ్ల లేదా తెల్లటి మామిడిపండ్లు చెట్ల నుండి వేలాడుతున్నాయి.

నిర్ధారణ: సృష్టికర్త ‘Bing ఇమేజ్ క్రియేటర్‌ని’ ఉపయోగించి AI చేత రూపొందించిబడిన చిత్రం, అంతేకాని నిజమైనది కాదు.
Rating: Misleading —