ఈ వారాంతం బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు ఉండవచ్చు అని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇది ఎంత వరకు నిజం? శనివారము మొదటి శనివారం కాబట్టి బ్యాంకులకు హాలిడే ఉంటుంది. ఆ తర్వాత ఆదివారం కూడా హాలిడే.
సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవు దినము. తరువాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల రెండు రోజుల బ్యాంక్ సమ్మె సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5 దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను స్తంభింపచేయడానికి అవకాశం ఉంది.
రిజర్వు బ్యాంకు ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరమ్గ్ సమ్మె చేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ 4 మరియు 5 తేదీలలో ఆర్బిఐ ఉద్యోగులు రెండు రోజుల సామూహిక సెలవులకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమ్మె దేశవ్యాప్తంగా కేంద్ర, ఇతర రాష్ట్ర బ్యాంకుల బ్యాంకింగ్ కార్యకలాపాలు మొత్తంగా కార్యకలాపాలు మొత్తంగా ఆగిపోయే అవకాశం ఉంది.
కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఆర్బీఐ ఉద్యోగుల సమ్మె వలన మిగిలిన బ్యాంకులకు అంతగా మూసి వేయాల్సిన అవసరం ఉండదు. సామాన్య బ్యాంకింగ్ ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది. ఎటిఎమ్ లావాదేవీలు, శాఖలలో డిపాజిట్, FD పునరుద్ధరణ, ప్రభుత్వ ట్రెజరీ ఆపరేషన్, మనీ మార్కెట్ ఆపరేషన్ వంటివి 5 రోజులు హిట్ కానున్నాయి. కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.
ఎందుకైనా మంచిది బ్యాంకు పనులు ఏమైనా ఉంటే శుక్రవారము తప్పకుండా ముగించుకోవాలి.
కేరళ వరదబాధితులకు చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారు వారిలో కొందరు సహాయం చేయకుండా, చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకు వాళ్లు నకిలీ వార్తలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు?
ఈమధ్య Facebookలో, శ్రీ కుమార్ శ్రీధర్ అనే వ్యక్తి ఒక పిక్చర్ తీసుకొని ఈ విధంగా రాశాడు– బీజేపీ ఏమి చేయలేదు అని చెప్పవద్దు. కేరళ బిజెపి ఎంపీలు రూ.25 కోట్లకు ఒక చెక్కు కేరళ చీఫ్ మినిస్టర్ కు అందజేశారు. — ఇది నకిలీ పిక్చర్. పిక్చర్లో హెచ్పిసిఎల్ అధికారులు బీజేపీ ఎంపీలు ఉన్నారు.
కానీ ఆ చెక్కు హెచ్పీసీఎల్ పెట్రోలియం కంపెనీలు ఉమ్మడిగా చేరి ఇచ్చిన చెక్కు. బీజేపీ ఎంపీలు డొనేట్ చేసిన చెక్కు కాదు. తర్వాత ఆల్ ట్ న్యూస్ వాళ్ళు అది ఫేక్ న్యూస్ అని పిక్చర్ లతో సహా నిరూపించారు.
ఈ విధంగా ఉంటాయి ఫేక్ న్యూస్ ఒకపిక్చర్ ద్వారా అందరినీ పిచ్చివాళ్లని చేయవచ్చు.
ఫోటో కాప్షన్: బీజేపీ ఏమి చేయలేదు అని చెప్పవద్దు. కేరళ బిజెపి ఎంపీలు రూ.25 కోట్లకు ఒక చెక్కు కేరళ చీఫ్ మినిస్టర్ కు అందజేశారు. ఈ పిక్చర్లో హెచ్పిసిఎల్ అధికారులు, కేరళ చీఫ్ మినిస్టర్, బీజేపీ ఎంపీలు — ఉన్నారు.
నరేంద్ర మోడి అభిమాని జితేంద్ర సింగ్ కేరళలో మన సైన్యం చేస్తున్న సహాయక కార్యక్రమాల్ని విభిన్నంగా చూపించాలని ఈ ఫోటోను వాడినారు. అంతేకాకుండా దానికింద ఒక కాప్షన్ కూడా! ఏమని? “ట్రూ ఇండియన్. ఇది మన సైన్యం” కానీ ఇది ఒరిజినల్ పిక్చర్ కాదు. ఇది కేరళ నుంచి తీసింది కాదు. ఇరాక్ లో ఒక సైనికుడిని ట్రక్కు నుంచి దిగువకు తీసుకువెళ్ళడానికి మహిళకు సహాయం చేయడానికి ఉపయోగించారు.
ఈ చిత్రాలను ఎక్కడినుంచో తెచ్చిఉపయోగించిన ఫేక్ న్యూస్ ఈ విధంగా సర్క్యులేట్ చేయడం ఇతనికే చెందింది. దానికి ఒక కాప్షన్. ఇండియన్ ఆర్మీకి ఇది ఏ విధంగానూ ఉపయోగపడదు కానీ ప్రజల్లో ఆర్మీ మీద నమ్మకం తగ్గుతుంది. అంతేకాదు ఈ పిక్చర్ 18వేల సార్లు రిపీట్ చేశారు. ‘నరేంద్ర మోడీ – ట్రూ ఇండియన్’ ఈ నకిలీ ఫోటోను పంపిణీ చేసిన కొంతమందిలో ఉన్నారు.
ఒక్కసారి చూస్తే ఈ ఫోటో కేరళలో తీసింది కాదు. ఈ సైనికాధికారి ఒక భారతీయుడు కాదు, ఆ మహిళ కేరళలో లేదు. ప్రస్తుతం, ఈ చిత్రం వైరల్ అయింది. ఇది ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరిస్తున్న జితేంద్ర ప్రతాప్ సింగ్ ట్వీట్ చేసాడు. “ఆమె కూడా బూట్లు తీసుకోవాలని మర్యాద కలిగి లేదు … .మరియు షూ యొక్క మడమ అతనికి చాలా బాధించింది ఉండాలి … వారి తల్లిదండ్రులు వారికి మర్యాద, విలువలు ఎప్పుడూ నేర్పలేదా?”
ఇలా ఉంటాయి ఫేక్ న్యూస్! గూగుల్లో ఇమేజ్ రివర్స్ సర్చ్ చేస్తే క్లియర్ గా తెలుస్తోంది ఇది జూన్ 2016 లో పల్లూజా పట్టణానికి చెందిన ఇరాకీ చిత్రం. కాశ్మీర్ వరదలలో కూడా ఇదే చిత్రం పంపిణీ చేయబడింది.
ఎన్ఆర్ఐ విజయమాల్య భారతదేశం విడిచిపెట్టేముందు బిజెపి నాయకులను కలుసుకున్నారు అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఈమధ్య చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం విజయ్ మాల్యా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేస్తున్న మోసాన్ని గుర్తించడానికి బదులు వారిని నిర్విఘ్నంగా భారతదేశం వదిలిపెట్టడానికి సహాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. విజయ్ మాల్యా రూ. 9,000 కోట్ల రుణాలు బాకీ పడి బ్యాంకుల నుంచి తప్పించుకొని 2016 మార్చిలో భారత్ నుంచి బయటపడి, ప్రస్తుతం UKలో నివసిస్తున్నారు.
“మాల్య భారత్ను విడిచిపెట్టడానికి ముందు, ఆయన బిజెపి సీనియర్ నాయకులను కలుసుకున్నారు, వాటిని నేను బహిర్గతం చేయను,” అని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ ఆరోపణకు బిజెపి ఇంకా స్పందించలేదు.
Twisted Facts?
భారత సిబిఐ అధికారులు విజయ మాల్యాను తిరిగి భారత్ తీసుకొని రావాలని అనేక ప్రయత్నాలు చేస్తస్తున్నారు, కానీ లండన్ కోర్టులో విజయ్ మాల్యా వేసిన పిటిషన్ ప్రకారము ఇండియా లో ఉన్నటువంటి జైలు అతని ఆరోగ్యానికి అనుకూలంగా లేవని విచారిస్తున్నారు. దీనికి సి.బి.ఐ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో నంబర్ 12 వీడియోలు తీసి కోర్టులో దాఖలు చేశారు. ఈ వీడియో ఒక టెలివిజన్, వ్యక్తిగత టాయిలెట్, పరుపు మరియు సూర్యకాంతి పుష్కలంగా అందుబాటులోఉంటుందని చూపిస్తుంది. కేసు సెప్టెంబర్ 12 న కోర్టులో విచారణకు వస్తుంది.
దీన్ని గురించి వ్యాఖ్యానిస్తూ, భారత జైళ్లలో “కష్టమైన స్థలాలు” ఉన్నాయని, కానీ విజయ్ మాల్య వంటి పారిపోయిన వారిని భిన్నంగా చూడరాదని రాహుల్ గాంధీ అన్నారు.
“భారతీయ జైళ్లలో చాలామంది మర్యాదగా ఉన్నారు, మాల్య ఆందోళన చెందుతున్నారు, భారతీయులకు న్యాయం జరగాలి,” అని ఆయన చెప్పారు. పారిపోయిన వారిని భిన్నంగా చూడరాదని, ఇలా చేయటం మిగిలినవారిలో వ్యతిరేకతను పెంపొందిస్తుందని ఆయన అన్నారు.
మోడీ ప్రభుత్వం భారత బ్యాంకుల మోసం చేసిన విజయ్ మాల్యా, ఫ్యుజిటివ్ జ్యుయర్స్ నిరావ్ మోడీ, మెహ్జల్ చోక్సి వంటి వ్యక్తులకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇది natural justice వ్యతిరేకమని కూడా ఆయన పేర్కొన్నారు.
Congress man?
కానీ విజయమాల్య మొదట్లో కాంగ్రెస్ పార్టీలో చాలామంది మిత్రులతో కలిసి రాజ్యసభ మెంబర్ గా చాలా సంవత్సరాలు ఉండినారు. అంతేకాకుండా విజయ్ మాల్యా పూర్వికులు కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఉన్నతస్థాయిలో సంబంధాలు పెట్టుకున్నారు. ఇది రాహుల్ గాంధీ మర్చిపోయారా?
ముఖ్యంగా విజయ్ మాల్యా కేసు భారత ప్రభుత్వానికి ఒక గుణపాఠం లాంటి లాంటిది. సరైన రూల్స్ లేనిచో ఎటువంటి వారైనా ఇండియా వదిలి పోయే మార్గాలున్నాయి కాబట్టి అన్ని పార్టీలు దీనికి సంబంధించిన శాసనాలు రూపొందించడానికి ఇదే కరెక్ట్ సమయం.
ఇకపోతే విజయ మాల్యాను తీసుకురావడానికి సీబీఐ చేస్తున్న ప్రయత్నాలు నిర్విఘ్నంగా కొనసాగాలి, లేనిచో ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ పార్టీ అయినా విజయమాల్య కేసు ఉమ్మడిగా సమీక్షించాలి కానీ పొలిటికల్ గా మార్చకూడదు.
విదేశీ సహాయాన్ని స్వీకరించడం గురించి మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైయ్యింది. UAE ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు సహాయంగా ఇవ్వడానికి తయారుగా ఉన్నదని, కానీ మోడీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించిందంటూ వార్తలు వెలువడ్డాయి.
భారతీయ జనతా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకులలో కేంద్ర, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రులు ఈ వివాదం లో ఉన్నారు. ఆశ్చర్యకరంగా, మాజీ విదేశాంగ కార్యకర్తలు కూడా అలాగే అభిప్రాయపడ్డారు.
2016 మే లో ప్రభుత్వం తన 200 పేజీల జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక పత్రాన్ని ఆవిష్కరించింది. విదేశాల్లో సహాయం కోసం భారతదేశం సంసిద్ధంగా ఉండకపోయినా, దేశం సహాయ ఆఫర్లను స్వీకరిస్తుందని ఈ విధాన పత్రం స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా ఆగస్టు 22 న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కేరళ వరద సాయాన్ని హర్షించింది.
కాని ఒక జాతీయ న్యూస్ పేపర్లో వాసు అనే రిపోర్టర్ స్వంత విశ్లేషణతో UAE గవర్నమెంట్ నుండి వచ్ఛే సహాయాన్ని తిరస్కరించిందంటూ రాసాడు. నిజానికి, ఒక ఎమిరేట్స్ ఎయిర్ కార్గో ఫ్లైట్ తిరువనంతపురం వచ్చింది, యుఎఇ ప్రభుత్వ సంస్థలు, మానవతా సంస్థలు, నివాసితులు మరియు వ్యాపారాల ద్వారా విరాళంగా అందించబడిన కేరళకు 175 టన్నుల వస్తువులని తెచ్చింది. ఇంకా 13 విమానాలు సహాయాన్ని తీసుకొని రావచ్చని అంచనా వేస్తున్నారు.
ఇంతలో, జాతీయ మీడియా మోడీ ప్రభుత్వం UAE క్రౌన్ ప్రిన్స్ ఆఫర్ను తిరస్కరించిందని చెప్పినట్లుగా నకిలీ వార్తలను వెల్లడించడం ద్వారా కొత్త వివాదం ప్రారంభించింది. దీనికి తోడు మోడీ ట్వీట్ ను కూడా ఉపయోగించారు:
A big thanks to @hhshkmohd for his gracious offer to support people of Kerala during this difficult time. His concern reflects the special ties between governments and people of India and UAE.
మోడీ ట్వీట్ లో ఎక్కడా UAE ప్రభుత్వ సహాయాన్నితిరస్కరించడానికి ఉద్దేశించిన అంశం లేదు. వివాదం భారతదేశం విదేశీ సాయాన్ని ఎందుకు స్వీకరించకూడదు అని సమర్థించటానికి వెళ్ళింది. ప్రస్తుత ప్రభుత్వం హఠాత్తుగా ఆ విధానాన్ని తిరస్కరించడం మరియు విదేశీ సాయాన్ని అంగీకరించడం వంటి పరిణామాలను అంచనా వేయడం వరకు వెళ్లింది. తర్వాత, అనవసరమైన దౌత్యపరమైన వివాదానికి ఇది దారి తీయడంతో రెండు ప్రభుత్వాలు క్లారిఫికేషన్ ఇచ్చాయి.
దురదృష్టవశాత్తూ, న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్, డ్యుయిష్ వెల్లే వంటి విదేశీ మీడియా సంస్థలు ఈ కథను నమ్మి దాన్ని గురించి విశ్లేషంగా రాయడం జరిగింది. నిజానికి, కేరళ నాయకత్వం లేదా మోడీ ప్రభుత్వం ఎవరికీ సమస్య లేదు అని మాజీ రాయబారి MK భద్రాకుమార్ అభిప్రాయ పడ్డారు.
కేరళ ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ కేంద్రాన్నించి వచ్చిన సాయం పై తన కృతజ్ఞతను బహిరంగంగా వ్యక్తపరిచారు. రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు వివాదాస్పదాలను రేకెత్తించ వద్దని ప్రతి ఒక్కరికి సలహా కూడా ఇచ్చారు. నరేంద్ర మోడీ కూడా తన ట్వీట్లో కేరళకు తన వ్యక్తిగత వేదనను, అవగాహనను నొక్కిచెప్పారు.
Stones2Milestones వారు భారతదేశంలోని 20 రాష్ట్రాల్లోని ప్రైవేటు సహాయం లేని private English medium పాఠశాలల్లో 19,000 కంటే ఎక్కువ మంది విద్యార్ధుల సామర్థ్యాన్ని ‘ఇండియా రీడ్స్’ అనే శీర్షికతో నివేదికను విడుదల చేశారు. 4,5,6 తరగతుల విద్యార్ధుల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. భారతదేశంలో పిల్లలు ఇంగ్లీష్ భాషను పూర్తిగా చదవలేరని మరియు అర్థం చేసుకోలేరని ఈ సర్వే సూచిస్తోంది.
ACER, India (Australian Council for Education Research) దీన్ని సమీక్షించి, ప్రాధమిక స్థాయిలో ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు, దేశవ్యాప్తంగా విద్యా విభాగానికి సంబంధించిన చర్యలకు విజ్ఞానం అందజేయడానికి సంబంధించిన పద్ధతులను పునఃపరిశీలించాలని పిలుపునిచ్చింది.
పట్టణ ప్రైవేట్ పాఠశాలల్లో 10 మంది విద్యార్థులలో 9 ఇంగ్లీష్ చదవలేదని పేర్కొంది. భారతదేశంలో 20 రాష్ట్రాలలోని 106 పట్టణ ప్రైవేటు పాఠశాలలలో 19,765 మంది పిల్లలతో భారతదేశంలో నిర్వహించిన అతిపెద్ద అధ్యయనం స్టోన్స్ 2 మైలెస్ట్.
FAST 4 లో 11 శాతం కూడా తక్కువ స్థాయి రీడర్ యొక్క సామర్ధ్యాలను కలిగి లేరు. 4 వ గ్రేడ్ లో 12.5 శాతం, 5 మరియు 6 గ్రేడ్లలో కేవలం 2.7 శాతం మాత్రమే వయస్సు-తగిన స్థాయిలో చదవగలరని ఇది పేర్కొంది.
కానీ ఈ సర్వేలో అంశాలు ఎంతవరకు నిజం? ఈ సర్వే ఎక్కడ నిర్వహించారు? ఇది బెంగుళూరు మిలెస్౨మిల్స్టన్స్ అనే NGO నిర్వహించింది కానీ సర్వే ఫలితాలు నమ్మదగినంతగా లేవు. దీని ప్రకారము 10 మంది విద్యార్ధులలో 9 మంది ఆంగ్లంలో చదవలేరని తేలింది. 20,000 మందికి 2,000 మంది మాత్రమే చదవగలిగారు.
ఈ సర్వే ప్రకారము పిల్లలలో పాఠకుల అలవాటును పెంచుకోవాల్సిన అవసరం ఉంది, అయితే ఈ ఫలితాలు ఎంతవరకు నిజం?
దేశం లో ఇంగ్లీషు మీడియం స్కూల్స్ ఎక్కువైపోయి మాతృభాష మర్చి పోయే ఈ రోజుల్లో, ఈ సర్వే ఎలా నిర్వహించారు? ఎందుకు నిర్వహించారు? ఎవరి కోసం నిర్వహించారు? ఏ విధమైన శాంప్లింగ్ తీసుకున్నారు?
—- భారతదేశంలో పిల్లలు గ్రేడ్ 6 స్థాయికి మాత్రమే స్వతంత్ర రీడర్ కాగలరు అని చెప్తోంది ఈ సర్వే. కానీ ప్రెస్ రిలీజ్ లో ఇచ్చింది వేరు.
—- ఆస్ట్రేలియన్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ (ACER) ఇండియా FAST ఎవాల్యూయేషన్ పద్దతిని సర్టిఫై చేసింది కానీ ఈ రిపోర్ట్ ను కాదు.