Author Archives: Talluri

golden chariot

ఆంధ్రా తీరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసింది కాదు, బంగారు రంగులో మాత్రమే ఉంది; Fact Check

ఆసాని తుఫాను మే 10, 2022న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చిన “బంగారు రథం (‘SONE का रथ’)” గురించిన వైరల్ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.దాదాపు అన్ని వార్తా కేంద్రాలు ఈ వార్తను కవర్ చేశాయి మరియు టీవీ ఛానెల్‌లు స్థానిక ప్రజలు దానిని సముద్రం నుండి ఒడ్డుకు ఎలా లాగడానికి ప్రయత్నిస్తున్నారో చూపించాయి.

వెంటనే, ఇది బంగారు రథం అనే వాదనతో వాట్సాప్ మరియు ట్విట్టర్ సందేశాలులో హోరెత్తినాయి.

समंदर में मिला सोने का रथ:

चक्रवात असानी की वजह से आंध्र प्रदेश के श्रीकाकुलम जिले के एक तट पर समुद्री लहरें एक ‘सोने का रथ’ बहा ले आई हैं,
इस रथ की बनावट किसी मोनेस्ट्री जैसी है,

माना जा रहा है कि ये रथ थाइलैंड या म्यांमार से बहकर आंध्र के तट तक पहुंच गया है!

Video: ABP news pic.twitter.com/HpjS7dERmj

— !!…शिवम…!! ??RED_2.0?? (@Aaaru_Prem) May 11, 2022

పైన హిందీ యొక్క అనువాదం ఇది: సముద్రంలో దొరికిన బంగారంతో చేసిన రథం.ఆసాని తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చిన “బంగారు రథం”. రథం ఒక మఠం ఆకారంలో ఉంది. బహుశా ఇది థాయ్‌లాండ్ లేదా మయన్మార్ నుండి తేలుతూ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరి ఉండవచ్చు.

తుఫానులో ఈ “రథం” బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఇది కేవలం బంగారంతో తయారు చేయబడింది…
మన హిందూ నాగరికత ఎంత సుసంపన్నంగా, ధనికంగా ఉందో చెప్పడానికి ఇది ప్రతీక… #GoldenChariot pic.twitter.com/CWaKdLKR8T

— Nick (@Nickonlyfru) May 11, 2022

#Goldenchariot: ಶ್ರೀಕಾಕುಳಂ ಸಮುದ್ರದಲ್ಲಿ ತೇಲಿ ಬಂದ ಗೋಲ್ಡನ್ ರಥದ ಲೇಟೆಸ್ಟ್ ದೃಶ್ಯ
ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ► https://t.co/I3omngLlis

Video Link►https://t.co/RycA87x9pL#TV9Kannada #goldenchariot #mysteriouschariot #SrikakulamCostal #AndhraPradesh pic.twitter.com/NoBt3skt8Q

— TV9 Kannada (@tv9kannada) May 11, 2022

ఇది ట్విట్టర్ మరియు వాట్సాప్‌లలో విస్తృతంగా షేర్ చేయబడింది.

golden chariot

[ఇది కూడా చదవండి: పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదా? Fact Check ]

FACT CHECK

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ Shrikesh B Lathakar గారు మీడియాతో మాట్లాడుతూ రథం బంగారంతో చేసింది కాదని, బంగారు రంగులో మాత్రమే ఉందని స్పష్టం చేశారు. “రథం ఇప్పుడు స్థానిక పోలీసుల అదుపులో ఉంది.”

“ఇది వేరే దేశం నుండి వచ్చి ఉండవచ్చు. మేము ఇంటెలిజెన్స్ మరియు ఉన్నతాధికారులకు సమాచారం అందించాము అని నౌపడ గ్రామం (శ్రీకాకుళం జిల్లా) యొక్క SI Saikumar గారు ANI వార్తా సంస్థతో నిర్ధారించారు.

#WATCH | Andhra Pradesh: A mysterious gold-coloured chariot washed ashore at Sunnapalli Sea Harbour in Srikakulam y’day, as the sea remained turbulent due to #CycloneAsani

SI Naupada says, “It might’ve come from another country. We’ve informed Intelligence & higher officials.” pic.twitter.com/XunW5cNy6O

— ANI (@ANI) May 11, 2022

శ్రీకాకుళంలోని టెక్కలి సర్కిల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం వెంకట గణేష్ ఏఎన్‌ఐ(ANI)తో మాట్లాడుతూ, “రథంలో బంగారం వంటి విలువైన లోహం పోలీసులకు లభించలేదని అన్నారు. ఇది ఉక్కు మరియు చెక్కతో తయారు చేయబడింది. కానీ దాని రంగు బంగారు రంగు.”

జిల్లా యంత్రాంగం తర్వాత రథంపై బర్మీస్‌లో లిపిలో వ్రాసిన స్క్రిప్ట్‌ను మరియు దానిపై జనవరి 16, 2022 అని తేదీని కనుకొన్నారు,కాబట్టి దాని మూలం మయన్మార్ అని ఆధారం కనిపించింది,కాని మయన్మార్ అధికారుల ఇంకా నిర్ధారణ చేయలేదు.

బంగారు రంగు వేసినప్పటికీ,ఇది బంగారు రథం కాదని చెక్క, ఇనుప లోహంతో తయారు చేసినట్లు జిల్లా యంత్రాంగం కూడా స్పష్టం చేసింది. అందువల్ల, “రథం” బంగారంతో తయారు చేయబడలేదు, కానీ బంగారు రంగులో ఉన్న బౌద్ధ మఠంకి చెందిన రథంగా ప్రతిబింబిస్తుంది.

వాదన/Claim:మే 10న ఆసాని తుపాను సమయంలో స్వర్ణరథం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం తీరంలో కొట్టుకొచ్చింది.

Conclusion: రథం బంగారు రంగుతో పెయింట్ చేయబడ్డది కానీ బంగారంతో తయారు చేయలేదు.

Rating: Misinterpretation —

[ఇది కూడా చదవండి: పాత రూ.2 నాణెం ఆన్‌లైన్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోందా? వాట్సాప్‌లో వీడియో వైరల్; Fact Check]

పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదా? Fact Check

అనేక అరుదైన పండ్ల రసాలను ఉపయోగించి క్యాన్సర్‌ను నివారించవచ్చు అనే అనేక వాదనలు WhatsAppలో షేర్ అవుతున్నాయి.ఈసారి పైనాపిల్ కలిపిన వేడినీరు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందనే వాదన వాట్సాప్‌లో షేర్ చేయబడింది.

WhatsAppలో సందేశం ఇలా వుంది: “వేడి పైనాపిల్ నీరు మిమ్మల్ని జీవితకాలం కాపాడుతుంది” మరియు “వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదు!”

అటువంటి claim/వాదన నిజమో కాదో తెలుసుకోమని Digiteye India Teamకి వాస్తవ పరిశీలన కోసం అభ్యర్థన వచ్చింది.
ట్విట్టర్‌ మరియు సోషల్ మీడియాలో ఒక సంవత్సరం పాటు ఇదే విధమైన వాదన ఉంది.ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

పైనాపిల్ కాండంలో అధిక స్థాయిలో “bromelain/బ్రోమెలైన్” అనే ఎంజైమ్ ఉంటుంది – ఇది ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, కండరాల ఉపశమనం మరియు జీర్ణక్రియకు సహాయం చేస్తుంది మరియు ఇది ట్యూమర్ కణాల పెరుగుదలకు ఆటంకం కలిగించే రసాయనాలు కూడా ఉండటం వలన, క్యాన్సర్‌ను నిరోధించడానికి పైనాపిల్‌ను మంచి ఆహారంగా చెప్పవచ్చును. pic.twitter.com/oJxcEE321Z
— Compounding Pharmacy (@abccompounding) February 15, 2023

FACT CHECK

మా బృందం దీనిని స్వీకరించి, ఈ claim/వాదన కొత్తది కాదని, 2021 నుండి షేర్ అవుతోంది అని తెలుసుకుంది.ముఖ్యంగా, PubMed వెబ్‌సైట్‌లో  పరిశోధన నివేదిక ప్రచురించబడిన తర్వాత ఈ వాదన/దావా చేయబడింది.

ఇటలీలోని నేపుల్స్‌లోని నేపుల్స్ ఫెడెరికో II విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ విభాగానికి సంబంధించిన ‘బార్బరా రొమానో(Barbara Romano )’ మరియు ఇతరులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, క్యాన్సర్‌ కణాలను నిరోధించడానికి పైనాపిల్‌ కాండంలో కనిపించే కొన్ని ఎంజైమ్‌ల నాణ్యతపై ల్యాబ్ పరీక్షలు నిర్వహించి, పై నివేదికను ప్రచురించింది.
“bromelain/బ్రోమెలైన్”మరియు “N-acetylcysteine/ఎన్-ఎసిటైల్‌సిస్టీన్” కలయిక జీర్ణశయాంతర (జిఐ) క్యాన్సర్ కణాల మనుగడ మరియు విస్తరణ యొక్క నిరోధాన్ని పెంచుతుంది” అని అధ్యయనంలో తేలింది.

అయితే ఈ అధ్యయనం ఇంకా ఖచ్చితమైనా నిర్దారణ చేయలేదు మరియు మరింత పరిశీనలన అవసరం. ఇండోనేషియా క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అరు విసాక్సోనో సుడోయో(Dr Aru Wisaksono Sudoyo) ఆగస్టు 6, 2021న AFPకి చెప్పారు.ఈ దశలో అటువంటి వాదన/దావాను ఖచ్చితంగా నిజమని నిర్ధారించలేము. క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేసే గుణాల కోసం “bromelain/బ్రోమెలైన్” అధ్యయనం చేయబడిందని, అయితే ఇప్పటివరకు ఎటువంటి గట్టి ఆధారం లేదని ఆయన పేర్కొన్నారు.ప్రయోగశాలలో పని చేసేది నిజ జీవితంలో ప్రభావవంతంగా ఉండకపోవచ్చు” అని ఆయన హెచ్చరించారు.

న్యూయార్క్ నగరానికి చెందిన క్యాన్సర్ నిపుణుడు మరియు “Beyond the Magic Bullet: The Anti-Cancer Cocktail” పుస్తక రచయిత,డాక్టర్ రేమండ్ చాంగ్(Dr Raymond Chang)కూడా క్యాన్సర్ కణాలపై పైనాపిల్ యొక్క ప్రభావం అనే పరిశోధన ఇప్పటికీ టెస్ట్ ట్యూబ్ అధ్యయనాలపై ఆధారపడి ఉందనే వాస్తవాన్ని పునరుద్ఘాటించారు.

మనం ప్రయోగశాలలో చేసే ప్రయోగాలు మరియు క్లినికల్ రియాలిటీ మధ్య తేడా గురించి తెలుసుకోవాలి అని చాంగ్ చెప్పారు. “చాలా సహజమైన వస్తువులు ఒక కృత్రిమ ప్రయోగశాల వాతావరణంలో క్యాన్సర్ కణాలను చంపుతాయి,కానీ మనుషులపై నిజంగా ప్రయోగించినప్పుడు అవి పని చేయవు.”

ఇప్పటికీ క్లినికల్ ట్రయల్స్ యొక్క ఫలితాలు మిశ్రమంగా ఉండి,ల్యాబ్ అధ్యయనాలు కూడా ప్రాథమికంగా ఉన్నాయి.మరియు మానవ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగము) విస్తృత స్థాయిలో చేపట్టే వరకు, వేడి నీటిలో ఉన్న పైనాపిల్ క్యాన్సర్‌ను నయం చేయగలదని ఖచ్చితంగా నిర్ధారించలేము.

Claim/వాదన:పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ను నయం చేస్తుంది.

నిర్ధారణ:పరిశోధన ఫలితాలు ఇప్పటికీ ల్యాబ్ దశలోనే ఉన్నాయి మరియు మానవ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగము) పెండింగ్‌లో ఉన్నాయి,కాబట్టి దీనిని ఖచ్చితంగా నిజమని నిర్ధారించలేము.

Rating: Misleading —





లేదు, ఈ వీడియో ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ళ వయసులో డ్యాన్స్ చేసింది కాదు; Fact Check

ఇటీవల ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేస్తూ కనిపించిందంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వీడియో వైరల్ అయ్యింది. పోస్ట్ ఇలా ఉంది: ఆమె వైజయంతిమాల అని నమ్మడం కష్టంగా ఉంది… ఆమె అద్భుతమైన నర్తకి. 99 ఏళ్ల వయసులోనూ ఆమె డ్యాన్స్ చేయగలదు. నిజమే… రిటైర్ అయ్యరు కానీ అలసిపోలేదు.

ఇక్కడ షేర్ చేయబడింది.

వైజయంతిమాల

FACT CHECK

వాస్తవం పరిశీలన చేయమని Whatsappలో అభ్యర్థన వచ్చినప్పుడు Digiteye India సంస్థ వారు వీడియో యొక్క కొన్ని ప్రముఖ ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ శోధనలో వాటిని పరిశీలించినప్పుడు, ఆ వీడియో 93 ఏళ్ల వృద్ధురాలు గురించి ABP లైవ్ ద్వారా డిసెంబర్ 6, 2022న ఒక వార్తా నివేదికలో ఉపయోగించినట్లు కనుగొన్నాము.

ఆమె మరియు బాలీవుడ్  నటుడు షమ్మీ కపూర్ యొక్క ప్రసిద్ధ పాట ‘బదన్ పే సితారే లాపేతే హుయే’కి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. కాని వైరల్ వీడియోలో ఉన్న వృద్ధురాలు నటి వైజయంతిమాల అని నివేదికలో పేర్కొనలేదు.

93 साल की उम्र में दादी पर चढ़ा शम्मी कपूर का जादू…
बदन पे सितारे लपेटे हुये गाने पर जमकर थिरक रही दादी…#Viral #Dance #ShammiKapoor

pic.twitter.com/HCLW9cTahU

— Narendra Singh (@NarendraNeer007) December 5, 2022

మరింత పరిశీలించినప్పుడు, అనేక మీడియా నివేదికలలో డిసెంబర్ 2022లో 93 ఏళ్ల వృద్ధురాలు చాలా సరదాగా డ్యాన్స్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె ‘ప్రిన్స్’ చిత్రంలో వైజయంతిమాల మరియు షమ్మీ కపూర్ చేసిన ప్రసిద్ధ పాటకి/సంగీతానికి అద్భుతమైన నృత్యం చేయడం కనిపిస్తుంది.

వీడియోలోని నాట్యం చేసిన వృద్ధురాలు వైజయంతిమాల లాగా లేదు.చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైజయంతిమాల తాజా ఫోటో(పైన ఫోటో) చూస్తే మనకు తెలుస్తుంది.ఈ సంఘటన/ఇవెంట్ మార్చి 21, 2023న Mylapore Times కవర్ చేసారు.

IMDB రికార్డుల ప్రకారం, వైజయంతిమాల ఆగస్టు 13, 1933న జన్మించారు, అంటే ప్రస్తుతం ఆమె వయస్సు 89 సంవత్సరాలు,మరియు వాదన/దావా ప్రకారం 99 సంవత్సరాలు కాదు.

వాదన/దావాలోని ఈ వీడియో సంబంధము లేదనిది, మరియు వైజయంతిమాలకి తప్పుగా ఆపాదించబడింది.

వాదన/Claim: ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేస్తున్నట్లు తప్పుడు వీడియో షేర్ చేయబడింది.

నిర్ధారణ:వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి వైజయంతిమాల కాదు, ఆమె వయస్సు 89 సంవత్సరాలు, 99 సంవత్సరాలు కాదు.
Rating: Misrepresentation —

500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటా? Fact Check

గత కొన్ని రోజులుగా చెలామణిలో ఉన్న నక్షత్రం (*) గుర్తు ఉన్న ₹500 నోట్లు నకిలీ నోట్లు అనే క్లెయిమ్‌తో సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇటీవల RBI చెలామణి నుండి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్న సందర్భంలో, నక్షత్రం గుర్తు ఉన్న ₹500 నోటు మరింత దృష్టిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా, ఫేస్‌బుక్ పోస్ట్‌లోని లో ఒక వాదన ఈ మధ్య చాలమంది షేర్ చేసారు ఇలా: “గత 2-3 రోజుల నుంచి * గుర్తుతో కూడిన ఈ 500 నోట్లు మార్కెట్‌లో చెలామణి కావడం ప్రారంభించాయి.అలాంటి నోటు నిన్న IndusInd బ్యాంక్ నుండి తిరిగి వచ్చింది. ఇది నకిలీ నోటు.ఈ రోజు కూడా, ఒక స్నేహితుడు కస్టమర్ నుండి అలాంటి 2-3 నోట్లను అందుకున్నాడు, కానీ వెంటనే వాటిని తిరిగి ఇచ్చెసాడు.అయితే ఈ నోటును ఎవరో ఉదయం ఇచ్చారని కస్టమర్ కూడా చెప్పాడు.జాగ్రత్త వహించండి. ఇక్కడ మార్కెట్‌లో నకిలీ నోట్లను చెలామణి చేసే మోసగాళ్ల సంఖ్య పెరిగింది. అబ్యర్ధన: దయచేసి అప్రమత్తంగా ఉండండి.ఈ సందేశాన్ని మీ సోదరులకు తెలియజేయండి, తద్వారా వారు మోసం నుండి రక్షించపబడతారు. ధన్యవాదాలు.”

ఈ రకమైన వార్తలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

FACT CHECK

చాలా మంది వ్యక్తులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున Digiteye India team ఈ పోస్ట్‌లో ఎంత వాస్తవం ఉందొ పరిశీలనకు  తీసుకుంది. మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో, ₹500నోట్లు యొక్క ప్రామాణికత కోసం పరిశీలన చేసినప్పుడు, RBI ఇటీవల జూలై 27, 2023 తేదీలో జారీ చేసినతన పత్రికా ప్రకటనలో,  ఈ నోటు చట్టబద్ధమైనదని స్పష్టం చేసింది. RBI పత్రికా ప్రకటన క్రింద చూడవచ్చు:

ఈ విషయంలో, లోపభూయిష్టంగా ముద్రించిన బ్యాంక్ నోట్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుట కోరకు బ్యాంక్ నోటు యొక్క నంబర్ ప్యానెల్‌లో స్టార్ (*) చిహ్నం చేర్చబడ్డదని RBI పేర్కొంది. (100 సీరియల్ నంబర్ ఉన్న బ్యాంక్ నోట్ల ప్యాకెట్‌లో స్టార్ (*) చిహ్నం చెర్చబడినది). నక్షత్రం (*) చిహ్నం ఉన్న బ్యాంక్ నోటు ఏదైనా ఇతర చట్టపరమైన బ్యాంక్ నోటుతో సమానంగా ఉంటుంది, అని RBI వెలువడించింది.

RBI యొక్క FAQ విభాగంలో కూడా “స్టార్ (*) చిహ్నం పద్దతి లోపభూయిష్టంగా ముద్రించిన బ్యాంక్ నోట్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుట కోరకు చెర్చబడినది అని, నక్షత్రం (*) చిహ్నం ఉన్న బ్యాంక్ నోటు ఏదైనా ఇతర చట్టపరమైన బ్యాంక్ నోటుతో సమానంగా ఉంటుంది అని అని RBI వెలువడించింది.

మేము 2006 లో జారీ చేసిన ఇదే విధమైన ప్రెస్ రిలీజ్‌ని కనుగొన్నాము. ఇక్కడ ₹10,₹20,₹50 విలువ కలిగిన
కరెన్సీ నోట్లలో ‘స్టార్’ ప్రిఫిక్స్ జోడించబడుతుందని పేర్కొంది.

Claim/వాదన: RBI యొక్క ₹500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటు.
నిర్ధారణ: తప్పు,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నోట్లు చట్టబద్ధమైనవని స్పష్టం చేసింది.
Rating: Misrepresentation -- 



					

50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check

ప్రసిద్ధిచెందిన తిరుపతి లడ్డూల తయారీకి నందిని నెయ్యి సరఫరా టెండర్ను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)వారు తిరస్కరించినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారి వెల్లడించడంతో సోషల్ మీడియాలో అనేక వాదనలు వచ్చాయి.

ఈ వార్త వైరల్‌గా మారింది, మరియు అనేక వార్తా సంస్థల ద్వారా కవర్ చేయబడింది. ఇదిలా ఉండగా, 2023 మేలో ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోకి అమూల్ ప్రవేశాన్ని వేలు ఎత్తి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం, KMF మరియు నందిని నెయ్యి ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని ఆరోపిస్తూ అనేక వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ట్విట్టర్‌లోని సందేశాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు

FACT CHECK

ఈ సమస్య పై తీవ్ర వివాదం చెలరేగడం వలన, 50 సంవత్సరాల సరఫరా తర్వాత TTD ఎందుకు నందిని నెయ్యి సరఫరాను నిలిపివేసిందనే దానిపై వాస్తవాలను Digiteye India పరిశీలన చేసింది. టీటీడీకి నందిని నెయ్యి 50 ఏళ్లుగా నిరంతరాయంగా సరఫరా కావడం లేదని పరిశోధనలో వెల్లడైంది. 2019లోనే KMF యొక్క టెండర్ తిరస్కరించబడింది మరియు తమిళనాడు పాల బ్రాండ్ ఆవిన్‌కి ఆ కాంట్రాక్టు ఇవ్వబడింది. ప్రతి ఆరు నెలలకోసారి బిడ్డింగ్/టెండర్ జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుపతి లడ్డూలలో నందిని నెయ్యి మాయమైందన్న వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ” గత 20 ఏళ్లుగా కూడా KMF నెయ్యి సరఫరా చేస్తుందనడంలో వాస్తవం లేదన్నారు.అందువల్ల, 50 సంవత్సరాల వరకు “అంతరాయం లేకుండా” KMF సరఫరా చేస్తుందనడంలో వాస్తవం లేదు. టెండర్, వాస్తవానికి, తక్కువ బిడ్డర్‌కు వెళుతుంది, అయితే మార్చి 2023లో కర్ణాటకలో బిజెపి అధికారంలో ఉన్న సమయంలో జరిగిన తాజా టెండర్‌లో KMF పాల్గొనలేదని TTD ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) స్పష్టం చేశారు.

కాబట్టి KMF “ఇప్పుడు” కాంట్రాక్ట్ పొందలేదనే వాదన నిజం కాదు.

అంతేకాకుండా, వార్తల్లో పేర్కొన్నట్లుగా నెయ్యి సేకరణ కేవలం ఒక సరఫరాదారుకు మాత్రమే పరిమితం కాదు. భారీ మొత్తంలో నెయ్యి అవసరం కావున ఒక సరఫరాదారు సరఫరా చెయ్యడం కష్టం. నందినితో పాటు ఆవిన్ వంటి ఇతర నెయ్యి బ్రాండ్‌లు కూడా గతంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు భారీ కాంట్రాక్టులను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కర్ణాటక ప్రభుత్వ వివరణ:

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయంపై వెంటనే స్పందిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానంకి (టిటిడి) కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నుండి నందిని నెయ్యి సరఫరా బిజెపి హయాంలోనే ఆగిపోయిందని అన్నారు, మరియు టిటిడికి నందిని నెయ్యి సరఫరాను నిలిపివేయడం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న “హిందూ వ్యతిరేక” విధానానికి ఫలితం అని బిజెపి చేసిన ఆరోపణను కూడా ఖండించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ పుణ్యక్షేత్రమైన తిరుపతికి నందిని నెయ్యి సరఫరా నిలిపివేయడం ఈరోజు నిన్న జరిగిన విషయం కాదని సిద్ధరామయ్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యి సరఫరా నిలిచిపోయిదని ట్వీట్ చేశారు:”ಆಂಧ್ರಪ್ರದೇಶದ ತಿರುಪತಿಗೆ ನಂದಿನಿ ತುಪ್ಪ ಪೂರೈಕೆ ಸ್ಥಗಿತಗೊಂಡಿರುವುದು ಇಂದು, ನಿನ್ನೆಯ ವಿಚಾರವಲ್ಲ. ಕಳೆದ ಒಂದೂವರೆ ವರ್ಷದ ಹಿಂದೆಯೇ @BJP4Karnataka ಸರ್ಕಾರದ ಅವಧಿಯಲ್ಲಿ ತಿರುಪತಿಗೆ ತುಪ್ಪ ಪೂರೈಕೆಯನ್ನು ಸ್ಥಗಿತಗೊಳಿಸಲಾಗಿದೆ.” [ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి నందిని నెయ్యి సరఫరా ఈరోజూ, నిన్నా ఆగలేదు, గత ఏడాదిన్నర క్రితం ఆగిపోయింది @BJP4Karnataka Govt.”] ఒరిజినల్ ట్వీట్ ఇక్కడ చూడండి:

ఇదే విషయాన్ని KMF అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే భీమా నాయక్  స్పష్టం చేశారు. KMF ప్రధాన సరఫరాదారు కాదని, వరుసగా మూడవ స్థానంలో ఉందని, L1 మరియు L2 బిడ్డర్‌ల తర్వాతనే సరఫరా చేయాల్సి ఉంటుందని వివరించారు.
ప్రసిద్ధిచెందిన GI-ట్యాగ్ చేయబడిన లడ్డూలను తయారు చేయడానికి 1,400 టన్నుల నెయ్యిని సరఫరా చేయడానికి ప్రతి ఆరు నెలలకోసారి TTD టెండర్‌ను ఆహ్వానిస్తుంది, అందువల్ల డిమాండ్‌ను KMF మాత్రమే చెయ్యలేదు.

‘కేఎంఎఫ్ (KMF)2005 నుంచి 2020 వరకు తిరుపతికి నందిని నెయ్యి సరఫరా చేసింది… డిమాండ్‌లో 45 శాతం మాత్రమే మేం సరఫరా చేస్తాము.. 2020 నుంచి ఎల్‌3 సరఫరాదారులం.ఎల్1, ఎల్2 బిడ్డర్ల సరఫరా చేసిన తర్వాత మేము సరఫరా చేస్తాము. 2021లో 2022 లో TTD వారు సరఫరా కోసం లేఖ రాశారు, తదనుగూనంగా KMF 345 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యిని సరఫరా చేసింది,” అని నాయక్ మీడియాకు తెలిపారు. కాబట్టి, తిరుపతి లడ్డు ఇప్పుడు మాత్రమే నందిని నెయ్యి  లేకుండా తయారవుతుందనే వాదన కూడా తప్పు.

Claim/వాదన: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నందిని అంశాన్ని రాజకీయం చేసి అమూల్‌పై దుష్ప్రచారం చేసి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం KMF బిడ్‌ను TTD తిరస్కరించింది.

నిర్ధారణ: KMF అంతకుముందు కూడా బిడ్‌ను కోల్పోయింది, తద్వారా నెయ్యి సరఫరా నిలిపివేయబడింది. 2023 మార్చిలో BJP అధికారంలో ఉన్నప్పుడు KMF అసలు వేలంపాటలో పాల్గొనలేదు.

Rating: Misrepresentation —

జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి RRR చిత్రంలో రామ్ చరణ్‌ గురించి మాట్లాడుతున్నారా? ANI వీడియో పైన Fact Check

జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి మరియు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలుగుసినిమా ‘RRR’ పై అభిప్రాయాలను వ్యక్తం చేసిన చిన్న ANI వీడియో క్లిప్ Youtubeలో షేర్ చేయబడుతోంది.

ఇంటర్వ్యూలో, వార్తా సంస్థకు చెందిన ఇంటర్వ్యూయర్ (ఇంటర్వ్యూయర్ తన పేరు వెల్లడించలేదు)జపాన్ విదేశాంగ మంత్రికి RRR హీరో రామ్ చరణ్ పేరును సూచించి, మంత్రులిద్దరూ ఇంటర్వ్యూ పూర్తి చేసే ముందు సినిమా నుండి ఒక Dance step వేయాలని సూచించారు, దానికి జైశంకర్ వినయపూర్వకముగా , “లేదు, నేను డ్యాన్స్ చెయ్యను.” అని సమాధానమిచ్చారు.

(Film Rrr Song Naatu Naatu,जापानी विदेश मंत्री बोले- RRR फेवरेट फिल्म, जयशंकर ने कहा- नाटू नाटू पर नाचूंगा नहीं – japanese foreign minister said rrr favorite film jaishankar said i will not dance on natu natu) – https://t.co/yX7VHvE6x3#Ghaziabad365

— गाज़ियाबाद365 (@Ghaziabad365) July 29, 2023

వార్తా సంస్థలు ద్వారా అప్‌లోడ్ చేయబడిన వీడియో క్లిప్ ఇక్కడ ఉంది Zee News మరియు Ghaziabad365

FACT CHECK

భారతీయులందరికీ RRR చిత్రం గురించి సుపరిచితం, ఇందులో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్‌టి రామారావు (జూనియర్ ఎన్‌టిఆర్‌గా ప్రసిద్ధి చెందారు) ఇద్దరూ నటించారు మరియు “నాటు, నాటు” పాట ఆస్కార్ గెల్చుకున్నందువలన ఈ సంభాషణ వీక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచింది.

జపాన్ మంత్రి హయాషి నటుడి యొక్క సరైన మరియు పూర్తి పేరుని గుర్తుకు తెచ్చుకోలేకపోయారు, కానీ స్పష్టంగా రావు అని చెప్పారు మరియు ఇంటర్వ్యూలో మళ్లీ జూనియర్ అని పునరావృతం చేశారు.హీరో తనలాగే కనిపిస్తాడనే విషయాన్ని మరింత విశదీకరించడం తెలుస్తుంది.కానీ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి రామ్ చరణ్ పేరును సూచిండతో, వీడియోలో సంభాషణ అలానే కొనసాగుతుంది.

ఇవి వాస్తవాలు:

ముందుగా, మంత్రి తనలా బొద్దుగా కనిపించే వ్యక్తిని ప్రస్తావించారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరి పోలిక చూడండి.ఇద్దరి నటుల ఫోటోలను చూడండి.జూనియర్ ఎన్టీఆర్‌తో పోలిస్తే రామ్ చరణ్ సన్నగా ఉంటాడు.

రెండవది, మంత్రి రావును ప్రస్తావించి, మళ్లీ రావు జూనియర్ అని పునరావృతం చేశారు, ఈ రెండు సూచనలు ఆయన ఎన్టీఆర్‌ని ఉద్దేశించి చెబుతున్నట్లు సూచిస్తున్నాయి కాని రామ్ చరణ్‌ని కాదు.రామ్ చరణ్‌కి రావు ఇంటిపేరు లేదు. జూనియర్ ఎన్టీఆర్ పూర్తి పేరు నందమూరి తారక రామారావు, జూనియర్.

సినిమాలోను మరియు పాటలోను ఆయన ఎన్టీఆర్‌ని ఉద్దేశించి చెబుతున్నట్లు తెలుస్తున్నప్పటికి, ఇంటర్వ్యూయర్ రామ్ చరణ్ పేరును సూచించాడు.రామ్ చరణ్‌ని ఉద్దేశించి మాట్లాడుతున్నారెమో అన్న తప్పుడు అభిప్రాయంతో సంభాషణ కొనసాగుతుంది.కాని జపాన్ విదేశాంగ మంత్రి స్పష్టంగా Jr NTRన గురించి మాట్లాడుతున్నారన్నది నిజం.మరుసటి రోజు అనేక వార్తా సంస్థలు ఇదే విషయాన్ని నివేదించాయి.

Claim/వాదన: జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి తన ఇంటర్వ్యూలో RRR చిత్రం నుండి రామ్ చరణ్ పేరును ప్రస్తావించారు.
నిర్ధారణ: కాదు, మంత్రి తన ఇంటర్వ్యూలో RRR చిత్రంలోని మరొక నటుడైన Jr NTR గురించి ప్రస్తావించారని స్పష్టమవుతుంది.
Rating: Misleading —

 

 

ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ. 3,000 భృతిని అందజేయటంలేదు; Fact Check

ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ. 3,000 భృతిని అందజేస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియా వాట్సాప్ సందేశాలలో మళ్లీ కనిపించింది, అయితే ఇలాంటి వాదనలు గతంలో చాలాసార్లు అసత్యం అని బహిర్గతం చేసాయి.

Pradhan Mantri Berojgari Bhatta Yojana 2022: Apply Online, Registration Form – Police Results https://t.co/gvGboyzKpb

— Sarkarii Result (@SarkariResultI2) September 23, 2022

ఈ వార్త/వాదన ఇక్కడ చూడగలరు here మరియు here.

FACT CHECK

ఈ విధమైన వాదన కొత్తది కాదు, గతంలో ఇదే విధమైన వాదన నెలకు రూ.6,000 భృతిని అందజేస్తోందని పేర్కొంటూ షేర్ చేయబడింది.
భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో వెతికితే, కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం ఏదీ ప్రకటించలేదని తేలింది.2022లో కేంద్రం యొక్క పిఐబి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ అటువంటి దావా/వాదనను తోసిపుచ్చింది.

एक वायरल #Whatsapp मैसेज में दावा किया जा रहा है कि प्रधानमंत्री बेरोजगारी भत्ता योजना के तहत सरकार बेरोजगार युवाओं को हर महीने ₹6,000 का भत्ता दे रही है। #PIBFactCheck

▶️यह मैसेज फर्जी है।

▶️भारत सरकार ऐसी कोई योजना नहीं चला रही।

▶️कृपया ऐसे मैसेज फॉरवर्ड ना करें। pic.twitter.com/XDUURi2ahH

— PIB Fact Check (@PIBFactCheck) December 19, 2022

ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన పేరుతో భారత ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయడం లేదు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇచ్చిన అన్ని వెబ్‌సైట్ లింక్‌లు తీసివేయబడినట్లు లేదా తొలగించబడినట్లు నిరూపించబడ్డాయి.
భారతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా ఇటువంటి సందేశాలు మోసపూరితమైనవని మరియు ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేలా ప్రజలను మోసగించే లక్ష్యంతో ఉన్నాయని స్పష్టీకరణ ఇచ్చింది.

ప్రస్తుతానికి, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మాత్రమే బేరోజ్‌గార్ భట్టా యోజనను అమలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటకలో ఇలాంటి పథకాలు కొనసాగుతున్నాయి లేదా పైప్‌లైన్‌లో ఉన్నాయి. అంతే కాని, ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్ట యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిరుద్యోగ భృతిని అందించడం లేదు.

Claim/వాదన: ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ. 3,000 భృతిని అందజేస్తోంది.

నిర్ధారణ: యువతకు నిరుద్యోగ భృతిని అందించే ‘ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన’ పేరుతో భారత ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయడం లేదు.పిఐబి మరియు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్  వార్తలలో నిజం లేదని ప్రకటించింది మరియు ప్రజలను ఈ పథకం పేరుతో మోసపూరిత వెబ్‌సైట్‌లను నిర్వహించడం గురించి హెచ్చరించింది. అందువల్ల, ఈ వాదన తప్పు.

Rating: Misleading —

2 దశాబ్దాల తర్వాత వినాయకుడి చిత్రంతో కూడిన చెప్పులు సోషల్ మీడియాలో షేర్ చేసారు; Fact Check

సోషల్ మీడియాలో వినాయకుడి చిత్రాలతో కూడిన ఒక జత చెప్పుల చిత్రాన్ని చూపిస్తూ, ఈ చెప్పులను రూపొందించిన కంపెనీ మూసివేయబడే వరకు పాఠకులను దినిని వ్యాప్తిచేయమని కోరుతూ ఒక వాదన షేర్ చేయబడుతోంది. ఇది జూన్ 12,2023న క్రింది విధంగా Facebookలో షేర్ చేయబడింది:

FACT CHECKరెండు దశాబ్దాల క్రితం ఇదే చిత్రం ప్రధాన వార్తల్లోకి వచ్చింది కాబట్టి, మేము దానిని తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో
చిత్రాన్ని పరిశీలించినమీదట అది పాత చిత్రమని, దానినే మళ్ళీ సోషల్ మీడియాలో మళ్లీ ఉపయోగిస్తున్నట్లు కనుగొన్నాము.

తదుపరి వార్తల పరిశీలనమీదట,అప్పటికే ఈ చిత్రం మీద అమెరికన్ హిందువులు వ్యతిరేకిస్తునట్లు అనేక వార్తలు వేలువడ్డాయి. అమెరికన్ హిందువులు 2003 సంవత్సరంలో అమెరికన్ ఈగిల్ ఔట్‌ఫిట్టర్స్ (American Eagle Outfitters) అనే కంపెనీ ఫ్లిప్-ఫ్లాప్‌లలో(చెప్పులలో) గణేశుడిని ఉపయోగించడంపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది.

యునైటెడ్ స్టేట్స్‌లోని హిందూ సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో, కంపెనీ వాటిని మార్కెట్ నుండి ఉపసంహరించుకుంది మరియు క్షమాపణలు చెప్పింది. అమెరికన్ ఈగిల్ అవుట్‌ఫిట్టర్స్(American Eagle Outfitters) యొక్క వైస్ ప్రెసిడెంట్ మరియు జనరల్ కౌన్సెల్ నీల్ బుల్మాన్ (Neil Bulman) జారీ చేసిన బహిరంగ క్షమాపణ క్రింద చూడవచ్చు.

ఈ సమస్య అనేక వార్తాపత్రికలలో విస్తృతంగా ప్రచురించబడింది.అయితే, 2015లో, ఈ చిత్రం మళ్లీ ట్విట్టర్‌లో క్రింది విధంగా షేర్ చేయబడింది:

@AEO you need to stop selling these flip flops. You have images of “HINDU GOD GANESHA”. pic.twitter.com/RWhYI5LZhu

— Big Bill (@BimalKatwala) June 8, 2015

ఇప్పుడు, రెండు దశాబ్దాల తరువాత, అదే చిత్రం హిందువుల మనోభావాలకు విరుద్ధమని తప్పుడు వాదనతో షేర్ చేయబడుతోంది. కాని ఈ సమస్య 2003కి సంబంధించినది మరియు ఇప్పటికే పరిష్కరించబడింది. కాబట్టి, కొత్త వాదన తప్పు. కించపరుస్తున్నదని

Claim/వాదన: A picture of sandals printed with Lord Ganesha’s images is being shared seeking closure of the company.
కంపెనీని మూసివేయాలని కోరుతూ గణేశుడి చిత్రాలతో ముద్రించిన చెప్పుల చిత్రం షేర్ చేయబడుతోంది.

నిర్ధారణ:ఈ సమస్య రెండు దశాబ్దాల నాటిది.యునైటెడ్ స్టేట్స్‌లోని హిందూ సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో, కంపెనీ ఈ చెప్పులను మార్కెట్ నుండి ఉపసంహరించుకుంది మరియు క్షమాపణలు చెప్పింది.

Rating: Misrepresentation —

 

 

మణిపూర్‌లోని పురాతనమైన ఈ చర్చిని బిజెపి మద్దతుదారులు తగులబెట్టారా? నిజమేంటి?

వాదన/Claim:మణిపూర్‌ హింసాకాండలో సెయింట్ జోసెఫ్ చర్చికి బిజెపి కార్యకర్తలు నిప్పంటించారని ఒక వీడియో వైరల్ అయింది.

నిర్ధారణ/Conclusion:తప్పు వాదన. ఫ్రెంచ్ చర్చి దహనం చూపుతున్న వీడియో మణిపూర్‌లో జరిగిన సంఘటనగా ప్రచారం చేయబడింది.

రేటింగ్: పూర్తిగా తప్పు నిరూపణ —

Fact Check వివరాలు:

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ముఖ్యాంశాలు అవుతున్న నేపథ్యంలో, మణిపూర్‌లోని చర్చిని బిజెపి మద్దతుదారులే తగులబెట్టారనే వాదనతో చర్చిని తగలబెట్టే ఒక వీడియో వైరల్ అవుతోంది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: #मणिपुर सुग्नू इंफाल नही थम रही हिंसा आगजनी भाजपा समर्थक उग्रवादियो ने 300 साल से ज्यादा पुरानी St. Joseph’s चर्च जलाई 74 दिनो से मणिपुर जल रहा है [అనువాదం:  “మణిపూర్- ఇంఫాల్ హింస ఆగటం లేదు. 300 ఏళ్ల నాటి సెయింట్ జోసెఫ్ చర్చిని బీజేపీ కార్యకర్తలు తగులబెట్టారు. మణిపూర్ 74 రోజులుగా మండుతోంది.]

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

మణిపూర్ యొక్క జాతి రూపురేఖలు రాష్ట్రంలో రెచ్చిపోతున్న హింస గురించి తెలుపుతుంది.మణిపురిలలో సగం మంది హిందువులైన మెయిటీస్, కుకీలు మరియు నాగాలు మిగిలిన జనాభాలో 90 శాతం ఉన్నారు మరియు వారు క్రైస్తవులు. మిగిలిన 10 శాతం జనాభా ముస్లింలు లేదా ఇతర మతాలను అనుసరిస్తున్నారు.

మే 3, 2023న ప్రారంభమైన జాతి హింస ఇప్పటివరకు 140 మంది మరణానికి దారి తీసింది. ఈ నేప‌థ్యంలో, రాష్ట్రంలోని ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌రింత మతపరమైన హింసను రేపేందుకు చ‌ర్చి దహనం అయిన వీడియోను షేర్ చేయబడుతోంది.

వాస్తవం ఏంటి?

Digiteye India బృందం వారు చర్చ్‌ను కాల్చేస్తున్న వీడియోలోని కొన్ని ఫ్రేమ్‌లు తీసుకొని పరిశీలించగా, అది మార్నేలోని ‘L’église Notre-Dame-de Drosnay‘చర్చి అగ్నికి ఆహుతై కుప్పకూలిన చారిత్రాత్మక చర్చి యొక్క విజువల్స్కు కు అని తెలిసింది.మంటల్లో కాలిపోయిన 16వ శతాబ్దపు ఫ్రెంచ్ చర్చి వీడియో నుండి 25 సెకన్ల క్లిప్‌ను ఉపయోగించి, మణిపూర్‌ రాష్ట్రంలోని మెజారిటీ కమ్యూనిటీలు చర్చికి నిప్పంటించారని ఒక దావా/వాదన పేర్కొంది.

 




జూలై 7, 2023న అగ్నికి ఆహుతైన ఫ్రెంచ్ చర్చి యొక్క అసలైన వీడియోను చూడండి. మార్నే ప్రిఫెక్చర్ పత్రికా ప్రకటన ప్రకారం, అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది మరియు దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం జరుగుతోంది.పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలోని(Louvre Museum) క్యూరేటర్ నికోలస్ మిలోవనోవిక్ కూడా అగ్నిప్రమాదం “కోలుకోలేని నష్టం” అంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.ఈ సంఘటన ఇక్కడ మరియు ఇక్కడ ప్రధాన వార్తా సంస్థల్లో కూడా నివేదించబడింది.

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

హమాస్ ఇజ్రాయెల్ ట్యాంకులను స్వాధీనం చేసుకుని వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేయడం వీడియోలో కనిపిస్తుంది; Fact Check

శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check

ఆల్కహాల్ కలిగి ఉన్నహ్యాండ్ శానిటైజర్‌లను చేతులకు రాసుకుని తర్వాత నిప్పు లేదా స్టవ్ దగ్గరికి వెళ్లవద్దని సూచిస్తూ సోషల్ మీడియాలో ఒక వైరల్ సందేశం కనిపించింది.
హిందీలో సందేశం ఇలా ఉంది: “ఒక మహిళ శానిటైజర్ చేతులకు రాసుకుని వంట చేయడానికి వంటగదికి వెళ్లింది. ఆమె స్టవ్ ఆన్ చేసిన క్షణంలో, శానిటైజర్‌లో ఆల్కహాల్ ఉండటంతో ఆమె చేతులకు మంటలు అంటుకున్నాయి.”

ఒక మహిళ తీవ్రంగా కాలిపోయిన చేతులను చూపుతున్న చిత్రం షేర్ చేస్తు “దయచేసి ఆల్కహాల్ కలిగి ఉన్న హ్యాండ్ శానిటైజర్‌లను చేతికి రాసుకున్న తర్వాత స్టవ్/ఫైర్ దగ్గరికి వెళ్లవద్దు.”అని సందేశం/message పెట్టరు.

వైరల్ అవుతున్న చిత్రం శానిటైజర్‌ వల్ల కాలిన చిత్రం కాదు. అది వేరొక చిత్రం.
‘Google రివర్స్ ఇమేజ్’ఉపయోగించి పరిశీలించినప్పుడు, ఇది స్కిన్ గ్రాఫ్ట్‌ల(skin grafts) కోసం తీసిన బాధితుడి యొక్క చేతుల చిత్రం.ఒకవేళ చేతులు నిజంగా కాలితే, అంచులు అంత స్పష్టంగా(ఎవరో కట్ చేసినట్టు) కనపడవు. స్కిన్ గ్రాఫ్టింగ్(skin grafting) ప్రక్రియాలో, వైద్యులు శరీరంలోని ఒక భాగం నుండి చర్మాన్ని తీసివేసి, మరొక భాగంలో మార్పిడి చేస్తారు.

అందువల్ల, వైరల్ అవుతున్న చిత్రం హ్యాండ్ శానిటైజర్‌ను చేతికి రాసుకున్న వెంటనే నిప్పు వెలిగించేటప్పుడు చేతులకు మంటలు అంటుకున్న మహిళది కాదని స్పష్టమైంది.

శానిటైజర్‌ల గురించి తెలుసుకుందాము.  ఆల్కహాల్ కంటెంట్ శానిటైజర్‌ ద్రవంలో కేవలం ఒక మిల్లీలీటర్ (అనుమతించబడిన మోతదు) మాత్రమే ఉంటుంది,ఇది చేతులకు రాసుకున్న 10 సెకన్లలో ఆవిరైపోతుంది.
నాణ్యమైన శానిటైజర్‌ని రాసుకుంటే ఎటువంటి మంటను కలిగించదు, ఎందుకంటె రాసుకున్న సెకన్లలో అది ఆవిరైపోతుంది.

అయినప్పటికీ, కొన్ని ఇంట్లో తయారుచేసిన శానిటైజర్లు అగ్నికి కారణమైన సంఘటనల కొన్ని వెలుగులోకి వచ్చాయి.న్యూజెర్సీలోని ఒక బాలుడు స్థానిక 7-ఎలెవెన్ స్టోర్ యజమాని తయారు చేసిన స్ప్రే శానిటైజర్‌ను ఉపయోగించి కాలిన గాయాలకు గురైన సంఘటన జరిగింది. స్టోర్ యజమాని (శానిటోజర్ తయారీలో పూర్తి పరిజ్ఞానం లేకుండా)అందుబాటులో ఉన్న ఫోమింగ్ శానిటైజర్‌లో నీటిని కలిపి తయారుచేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ముందే అప్పటికే స్టోర్‌లో 14 స్ప్రే బాటిళ్లను విక్రయించినట్లు సమాచారం.

Claim/వాదన: శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check
నిర్ధారణ: నాణ్యమైన శానిటైజర్‌ని రాసుకుంటే ఎటువంటి మంట కలిగించదు, ఎందుకంటె రాసుకున్న సెకన్లలో అది ఆవిరైపోతుంది.
Rating Misrepresentation:

ఇది కూడా చూడండి:Rs.2000 note banned from Dec 31? Fact check?