Author Archives: Talluri

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

అయోధ్య ఆలయం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో, ఆలయ స్థలం నుండి బౌద్ధ మతంకు చెందిన పురాతన రాగి స్క్రోల్(రాగి ఫలకం))కనుగొనబడిందని పేర్కొంటూ పాత వీడియో ఒకటి ప్రచారం చేయబడింది.
వాట్సాప్‌లో వచ్చిన claim/దావా ఇలా ఉంది: “అయోధ్య పురావస్తు తవ్వకంలో, బౌద్ధుల కాలం నాటి రాగి ఫలకం కనుగొనబడిందని, ఇది బౌద్ధమత అస్థిత్వానికి అతిపెద్ద సాక్ష్యం.”

ఈ వీడియో ఇంతకు ముందు ట్విట్టర్‌లో ఈ క్రింది విధంగా షేర్ చేయబడింది:

“తామ్రపాత్ర” అని కూడా పిలుస్తారు, ఈ రాగి ఫలకాలను పురాతన కాలంలో డాక్యుమెంటేషన్(దస్తావేజులను సమకూర్చుట) కోసం ఉపయోగించారు మరియు దానిని ఉదహరిస్తూ, హిందువులకు పూజ్యమైన ప్రదేశం మరియు భగవంతుడు శ్రీ రాముని యొక్క జన్మస్థలంగా పిలువబడే అయోధ్యకు బౌద్ధమతానికి లింక్ ఉందని దావా/వాదన చెబుతుంది.
రాముడి ఆలయ నిర్మాణాన్ని బౌద్ధ భిక్షువులు నిరసిస్తున్న నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకూరింది.

రామజన్మభూమి ప్రాంతం బౌద్ధ క్షేత్రమని, తవ్వకాల కోసం యునెస్కోకు (UNESCO)అప్పగించాలని 2020 జూలైలో బౌద్ధ సన్యాసులు అయోధ్యలో నిరసన చేపట్టారు.రామమందిర నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని, యునెస్కో ఆ స్థలంలో తవ్వకాలను చేపట్టాలని బౌద్ధ సన్యాసులు డిమాండ్ చేశారు.

అయోధ్య ఆలయ సమస్య సుప్రీంకోర్టు ద్వారా పరిష్కరించబడింది మరియు స్థానిక వక్ఫ్ బోర్డు కూడా మసీదును పట్టణంలో వేరే చోటికి మార్చడానికి అంగీకరించినప్పటికీ, అయోధ్యలో బౌద్ధమత అస్థిత్వం/వారసత్వం యొక్క వాదన సున్నితమైన సమస్యకు మరో కోణాన్ని జోడిస్తుంది.

Fact Check

వాస్తవం పరిశీలన కోసం Digiteye India ఈ దావాను స్వీకరించి,వైరల్ వీడియో యొక్క కొన్ని ఫ్రేమ్‌ల ఆధారంగా మొదట Google reverse imageను ఉపయోగించి చూడగ, ఈ దావా జూన్ 2020 నుండి అడపాదడపా ఇక్కడ మరియు ఇక్కడ వెలువడుతున్నట్లు చూపబడింది.

అయితే, మేము యూట్యూబ్‌లో సంబంధిత వీడియోల కోసం పరిశీలన చేసినప్పుడు, శ్రీరామ్ ప్రభు కుమార్ అనే వినియోగదారుడు మార్చి 19, 2022న “500 B.C | ఇరాన్‌లో స్వర్ణాక్షరాలుతో ఉన్న ఎస్తేర్ యొక్క అసలు పుస్తకం కనుగొనబడింది” అనే శీర్షికతో యూట్యూబ్‌లో యూదుల టైమ్ క్యాప్సూల్‌కి(Jewish time capsule) సంబంధించిన ఇలాంటి వీడియో అప్‌లోడ్ చేసారు.

గూగుల్ సెర్చ్‌ని ఉపయోగించి, స్క్రోల్‌పై (ఫలకంపై)యూదుల భాష అయిన ‘హీబ్రూ’లో రాసి ఉన్న లిపి(అక్షరాలు)ని మనం చూడవచ్చును. అంతేకాకుండా, రాగి ఫలకంపై యూదుల ఐకానోగ్రఫీకి చెందిన “స్టార్ ఆఫ్ డేవిడ్” యూదు సంఘాల రక్షణ కోసం ఉపయోగించబడే విలక్షణమైన చిహ్నం మనం చూడవచ్చును.

“ఇది ఒక ఫోర్జరీ” అని న్యూయార్క్ యూనివర్శిటీ యొక్క గ్లోబల్ నెట్‌వర్క్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఇన్ జ్యూయిష్ స్టడీస్ ప్రొఫెసర్ మరియు డైరెక్టర్ లారెన్స్ షిఫ్‌మన్ AFP కి చెప్పారు.”మా దగ్గర హిబ్రూ అక్షరాల యొక్క నిర్హేతుకమాన అమరిక/క్రమం ఉంది,కాని ఎస్తేర్ పుస్తకం లేదు.”

అందుకే, వీడియోలో చూపిన రాగి ఫలకానికి బౌద్ధ సాహిత్యం లేదా బౌద్ధ లిపితో సంబంధం లేదు, మరియు ఇరాన్‌లో కనుగొనబడిన ఎస్తేర్ యొక్క అసలైన పుస్తకమని నిరూపణ కూడ కాలేదు.

Claim/దావా:అయోధ్య త్రవ్వకాల్లో బౌద్ధుల కాలానికి చెందిన రాగి ఫలకం దొరికింది.

నిర్ధారణ:రాగి ఫలకం లేదా స్క్రోల్ యొక్క వైరల్ వీడియో బౌద్ధ కాలానికి చెందినది కాదు, దానిపై హిబ్రూ భాషలో యూదుల గ్రంథాలకు చెందిన లిపి/అక్షరాలు ఉన్నాయి.
Rating: Misrepresentation —

[మరి కొన్ని Fact checks:ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact CheckMMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]

 

ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check

ఎత్తైన రైల్వే వంతెనపై రైలు నడుస్తున్న వీడియో వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ మరియు ఇతర సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.
Claim/దావా ఈ విధంగా ఉంది: “అభినందనలు భారతదేశం!!! జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌పై నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ట్రాక్‌పై మార్చి 21న చిన్న రైలు టెస్ట్ రన్ విజయవంతంగా నిర్వహించబడింది.”

రెండు పర్వతాలను కలిపే ఎత్తైన వంతెనపై రైలు ప్రయాణిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. ట్విట్టర్‌లో కూడా ఇక్కడ షేర్ చేశారు.

 

FACT CHECK:

వాట్సాప్ పంపినవారు క్లెయిమ్‌ను పరిశీలన చేయమని Digiteye Indiaని కోరారు.

మేము రైలు ట్రాక్ కోసం ఎత్తైన వంతెన కోసం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో సెర్చ్ చేయగా, ఆ వంతెన వాస్తవానికి చైనాలోని బీపాంజియాంగ్ రైల్వే వంతెన అని మరియు భారతదేశంలోనిది కాదని మేము కనుగొన్నాము. ఈ వంతెన 2001లో ప్రారంభించబడింది మరియు 275 మీటర్ల ఎత్తు మరియు 118 కిలోమీటర్ల పొడవుతో చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని(Guizhou province) లియుపాన్‌షుయ్(Liupanshui) మరియు బైగావోలను(Baigao) కలుపుతుంది.

వాస్తవానికి, ఈ క్లెయిమ్‌లోని వీడియో బీపాంజియాంగ్ వంతెన గుండా ప్రయాణిస్తున్న రైలు యొక్క వైరల్ వీడియో మరియు మొట్టమొదటగా చైనా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడింది. Highstbridges.com పేరుతో ఉన్న మరో వెబ్‌సైట్ అదే వంతెనను తన వీడియోలో చూపిస్తుంది.

వాస్తవానికి, భారతదేశంలో మరియు ప్రపంచంలోనే ఎత్తైన వంతెన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఇప్పటికీ నిర్మాణంలో ఉంది, ఇది మార్చి 26, 2023న టెస్ట్ రన్ నిర్వహించినప్పుడు వార్తల్లో నిలిచింది. దీనిని రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించారు.


భారతదేశంలో చీనాబ్ నదిపై 1,178 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెన భద్రత తనిఖీ చెయ్యడం కోసం వంతెన పైన రైలు నడుపుతు పరీక్షల నిర్వహణ జరుగుతుంది మరియు జనవరి 2024 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది.అందువల్ల, Claim/దావాలో చూపిన వీడియో తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

Claim/దావా: జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మాణంలో ఉన్న ఎత్తైన రైల్వే వంతెనను వీడియో చూపిస్తుంది.

నిర్ధారణ:వీడియో చైనీస్ వంతెనను చూపుతుంది,అంతే కాని భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కాదు.

Rating: Misleading —

[మరి కొన్ని Fact checks: ఢిల్లీలో జరిగిన జి20 సదస్సు విజయవంతం అయిన సందర్బంగా టాటా మోటార్స్ బహుమతులు ఇస్తోందా? Fact CheckMMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]

ఢిల్లీలో జరిగిన జి20 సదస్సు విజయవంతం అయిన సందర్బంగా టాటా మోటార్స్ బహుమతులు ఇస్తోందా? Fact Check

సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు విజయవంతంగా జరిగింది. అయితే, ఈ ఈవెంట్‌పై ప్రజలు చేసిన అనేక తప్పుడు వాదనలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.అందులో ఒక వాదన జి20 సదస్సు విజయవంతం అయిన సందర్బంగా టాటా మోటార్స్ ప్రజలకు ఉచిత బహుమతులు ఇస్తున్నారని వైరల్ అయింది.

సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో టాటా మోటార్స్ ప్రజలకు ఉచిత బహుమతులు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారంలో లింక్‌ కలిగి ఉంటుంది, ఇక్కడ వ్యక్తులు ఉచిత బహుమతికి అర్హత పొందేందుకు వారి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి మరియు WhatsApp groupలలో భాగస్వామ్యం/share చేయలని ఉంది.

వైరల్ అవుతున్నా ఈ వాదనను పరిశీలన చేయమని Digiteye India కి WhatsApp అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

మేము టాటా మోటార్స్ వారు తమ కస్టమర్‌ల కోసం అలాంటి స్కీమ్‌ను ఏదైనా ప్రకటించారా అని చూడటానికి టాటా మోటార్స్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్‌లను పరిశీలన చేసాము.టాటా మోటార్స్ లేదా మరేదైనా కంపెనీ అటువంటి బహుమతులను నిర్వహించిందా అని చూడటానికి మేము వార్తా కథనాలను కూడా పరిశీలన చేసాము. అటువంటి పోటీకి Googleలో ఎటువంటి ఫలితం/వార్తా కధనం లేదు.

మేము మరింత పరిశీలన చేయగా, క్లెయిమ్‌కి జోడించిన లింక్ టాటా మోటార్స్ (tatamotors.com) నుండి కాదని, ఫిషింగ్ కేసుగా కనిపించే వేరే వెబ్‌సైట్ నుండి అని కనుగొన్నాము. క్లెయిమ్ చాలా సార్లు సోషల్ మీడియాలో ప్రతిసారీ వేరే లింక్‌తో షేర్ చేయబడింది.

మరింత పరిశీలన చేసినప్పుడు, ట్విట్టర్‌లో టాటా మోటార్స్ కార్స్ వారు ఒక ప్రకటన విడుదల చేసి ఈ వాదనలను తిరస్కరించిన పోస్ట్‌ను చూశాము.

టాటా వారు క్రింద విధంగా ఒక ప్రకటన విడుదల చేసారు:
“దయచేసి టాటా మోటార్స్ అటువంటి పోటీ ఏదీ ప్రకటించలేదని మరియు అటువంటి పథకాలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తిరస్కరిస్తున్నని గమనించండి.ఇలాంటి మోసపూరిత సందేశాలు సోషల్ మీడియాలో మరింత వ్యాప్తి చేయవద్దని, వెంటనే తొలగించాలని మేము సూచిస్తున్నాము. దయచేసి అటువంటి లింక్‌లు/సందేశాలను క్లిక్ చేయడం లేదా వాటిని షేర్ చెయ్యడం మానుకోండి.”

మరియు “టాటా మోటార్స్ నుండి ఏదైనా అధికారిక పోటీ/ప్రకటన చేయవలిసి వస్తే మా అధికారిక వెబ్‌సైట్/సోషల్ మీడియా హ్యాండిల్‌లో మాత్రమే ఎల్లప్పుడూ నేరుగా ప్రకటించబడుతుందని దయచేసి గమనించండి.”భవిష్యత్తులో మా అధికారిక వెబ్‌సైట్లో సులభంగా ధృవీకరణ చేసుకోవచ్చును.

మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మేము బెంగళూరులో ఉన్న సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ని సంప్రదించాము.
వివేక్ అస్థానా మాట్లాడుతూ, “ఈ లింక్‌లు ఫిషింగ్ కేసులుగా పరిగణించవచ్చు.  వినియోగదారులు తమ వ్యక్తిగత డేటాను ఎక్కడ ఉంచుతారో తెలుసుకోవాలి, ఎందుకంటే డేటాను తారుమారు వినియోగదారులను చేసి మోసం చెయ్యడానికి ఉపయోగించబడుతుంది.
కాబట్టి, దావా/వాదన పూర్తిగా తప్పు.

CLAIM/వాదన:టాటా మోటార్స్ వారు జి20 సదస్సు విజయవంతం అయిన సందర్బంగా బహుమతులు అందిస్తోంది.

నిర్ధారణ: టాటా మోటార్స్ ఒక ప్రకటన విడుదల చేసింది, అక్కడ వారు అటువంటి పథకం లేదా బహుమతిని ప్రారంభించలేదని స్పష్టీకరించారు..

RATING: Totally False —

[మరి కొన్ని Fact Checks: Did Netherlands PM clean up after spilling his drink at G20 summit in Delhi? Fact Check]

 Is Homeopathy an effective means to treat serious illnesses? Fact Check]

 

MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check

మీజిల్స్, గవదబిళ్లలు మరియు రుబెల్లా వ్యాక్సిన్ (MMR) ఆటిజంకు కారణమవుతుందని సోషల్ మీడియా మరియు వాట్సాప్‌లో అనేక వైరల్ పోస్ట్‌లు మరియు సందేశాలు పేర్కొంటున్నాయి. ప్రజలను ఈ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండాలని వైరల్ పోస్ట్‌లు ప్రజలను కోరుతున్నాయి. MMR వ్యాక్సిన్ మరియు ఆటిజం మధ్య సంబంధం(లింక్) ఉందని ఇది పేర్కొంది.

MMR వ్యాక్సిన్‌లు పెద్దప్రేగు శోథను(colitis) కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని మరియు వ్యక్తులలో ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతల అభివృద్ధికి దారితీస్తుందని వైరల్ పోస్ట్‌లు పేర్కొన్నాయి.
Claim/వాదనలు ‘ఆండ్రూ వేక్‌ఫీల్డ్ రాసిన పేపర్‌’ను మరియు వ్యాక్సిన్‌ల ఆధారంగా తీసిన ఒక డాక్యుమెంటరీలో ఈ రెండింటి మధ్య సంబంధం(లింక్) ఉందని కూడా పేర్కొన్నారు.

FACT CHECK

ఈ వైరల్ పోస్ట్‌లు తమ వాదనను ధృవీకరించడానికి ‘MMR వ్యాక్సిన్ పెద్దప్రేగు శోథ మరియు ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతలతో ముడిపడి ఉందని పేర్కొన్న ఆండ్రూ వేక్‌ఫీల్డ్ వారి యొక్క 1998 పేపర్ను విస్తృతంగా ఉపయోగించుకున్నారు.అయితే, వేక్‌ఫీల్డ్ చేసిన ఈ వాదనను శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు.
ఎపిడెమియాలజిస్ట్ సెనాద్ బెజిక్ యునిసెఫ్‌తో మాట్లాడుతూ వేక్‌ఫీల్డ్‌కు ఈ అంశంపై ఆర్థికపరమైన ఆసక్తి ఉందని చెప్పారు.అతను ఈ వ్యాధులకు వ్యతిరేకంగా తన స్వంత టీకాను నమోదు చేసుకున్నాడు. అతను అనేక నైతిక నియమావళిని ఉల్లంఘించాడని కూడా నివేదికలు పేర్కొన్నాయి. అతని పత్రం 2010లో ఉపసంహరించబడింది.మరియు అతని డాక్టర్ సాధన రద్దు చేయబడింది.

MMR వ్యాక్సిన్ అంటే ఏమిటి?

MMR వ్యాక్సిన్ మీజిల్స్, గవదబిళ్లలు మరియు రుబెల్లా వంటి వ్యాధుల నుంచీ పిల్లలని కాపాడడానికి ఇచ్చె వ్యాక్సిన్. భారతదేశంలో, MMR టీకాలు రెండు మోతాదులలో ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడతాయి: 12 – 15 నెలలు మరియు 4 – 6 సంవత్సరాలు కలిగి ఉన్నా పిల్లలకు.
మీజిల్స్, గవదబిళ్లలు మరియు రుబెల్లా వైరల్ వ్యాధులు, ఇవి పిల్లలలో అనారోగ్యం, వైకల్యం మరియు మరణానికి కూడా కారణమవుతాయి. దీని లక్షణాలు శరీరంపై తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలను కలిగి ఉంటాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, MMR టీకా గత 20 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్లకు పైగా మరణాలను నివారించింది.

WHO ఏమి చెబుతుంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆటిజం మరియు ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతలను “విభిన్నమైన పరిస్థితుల సమూహంగా నిర్వచించింది. అవి సామాజిక పరస్పర చర్య మరియు కమ్యూనికేషన్‌లతో కొంత ఇబ్బందిని కలిగి ఉంటాయి.
ఇతర లక్షణాలు:  కార్యకలాపాలు మరియు ప్రవర్తనల యొక్క విలక్షణమైన నమూనాలు, ఒక కార్యాచరణ నుండి మరొక కార్యాచరణకు మారడంలో ఇబ్బంది, వివరాలపై దృష్టి మరియు ఇంద్రియ కార్యకలాపాలకు సంబంధించి అసాధారణ ప్రతిచర్యలు వంటివి.”

పర్యావరణ మరియు జన్యుపరమైన కారణాల వల్ల ఆటిజం రావచ్చని పేర్కొంది. ఆటిజం లేదా ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతలకు కారణమయ్యే MMR వ్యాక్సిన్‌లకు సంబంధించిన వాదనలు పరిశోధనలో “పద్ధతి లోపాల” నుండి ఉత్పన్నమవుతాయి.MMR వ్యాక్సిన్(మీజిల్స్, గవదబిళ్లలు మరియు రుబెల్లా వ్యాక్సిన్) మరియు ఆటిజం ముడిపడి ఉన్నాయి అనటానికి ఎటువంటి ఆధారాలు లేవని WHO స్పష్టంగా పేర్కొంది.

వ్యాక్సిన్‌లు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌కు(ASD) కారణం కాదని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పేర్కొంది.వారి 2013 పరిశోధనలో, టీకాలో ఉపయోగించే పదార్థాలు ఆటిజంకు కారణం కాదని కూడా పేర్కొంది.

2002లో, అర ​​మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలపై నిర్వహించిన డానిష్ అధ్యయనం కూడా MMR టీకాకు(మీజిల్స్, గవదబిళ్లలు మరియు రుబెల్లా వ్యాక్సిన్) మరియు ఆటిజం మధ్య ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించింది.టీకాలు వేసిన పిల్లలలో మరియు తీసుకోని పిల్లలలో ఆటిజం ప్రమాదం ఒకేలా ఉంటుందని అధ్యయనం చూపించింది.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలు/ దావా తప్పు.వాటిలో నిజం లేదు.

వాదన/CLAIM: MMR వ్యాక్సిన్ ఆటిజంకు కారణమవుతుంది.

నిర్ధారణ:విస్తృతమైన అధ్యయనాలు మరియు శాస్త్రీయ ఆధారాలు MMR టీకా మరియు ఆటిజం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంది అనే వాదనను బలంగా తిరస్కరించాయి.

RATING: Totally False —

చంద్రయాన్-3 ల్యాండింగ్ తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్ బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారా? Fact Check

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన తర్వాత, ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ గురించి పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం చేయడం ప్రారంభం అయ్యాయి.అంతకుముందు చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ సంబరాలు చేసుకుంటున్న పాత వీడియో వైరల్‌గా మారింది.ఈసారి ఆయనను సత్కరిస్తున్న మరో వీడియో ప్రసారం చేయడం జరిగింది.

0:09 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు తెల్లటి దుస్తులు ధరించి S సోమనాథ్‌ను సత్కరిస్తున్నట్లు చూపబడింది.వారు అతని భుజాలపై శాలువా కప్పుతుంటే,అతను చేతులు జోడించి ‘నమస్తే’చేస్తున్నట్లు చూపబడింది.ఇస్రో చీఫ్ బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని, ఈ వీడియో ఆ ఈవెంట్‌లోనిదేనని సోషల్ మీడియాలో పలు వీడియోలు పేర్కొంటున్నాయి.

వీడియో ఇక్కడ, ఇక్కడ, మరియు  ఇక్కడ షేర్ చేయబడ్డది.

ఈ వైరల్ వీడియోను పరిశీలన చేయమని Digiteye India కి WhatsApp అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందంవారు వీడియోని అనేక కీఫ్రేమ్‌లుగా విభజించి Googleలో రివర్స్ ఇమేజ్ ఉపయోగించి వీడియోని పరిశీలించారు.ఇలాంటి దావాతో అనేక మంది వ్యక్తులు ఈ వీడియోను భాగస్వామ్యం(share) చేయడాన్ని మేము గమనించాము.కీలక పదాలతో మరింత వెతికినప్పుడు, RSS ప్రమోషన్ అండ్ పబ్లిసిటీ హెడ్ – రాజేష్ పద్మర్ చేసిన ఈ ట్వీట్ మాకు కనిపించింది.అతని ట్వీట్‌లో మూడు చిత్రాలు మరియు అదే వైరల్ వీడియో ఉన్నాయి.

జూలై 19, 2023 నాటి తన ట్వీట్‌లో, చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా నడిపించినందుకు S సోమనాథ్‌ను RSS ప్రధాన కార్యదర్శి – దత్తాత్రేయ హోసబాలే అభినందించారు.చంద్రునిపై చంద్రయాన్-3 రోవర్ ల్యాండింగ్‌కు ముందే బెంగళూరులోని చామరాజపేటలోని రాష్ట్రోత్థాన పరిషత్‌లో ఈ సన్మానం జరిగిందని అందులో పేర్కొన్నారు. రోవర్ ఆగష్టు 23, 2023న చంద్రునిపై దిగింది.

మేము రాష్ట్రోత్థాన పరిషత్‌ గురించి గూగుల్ సెర్చ్ చేసాము. “వ్యక్తిగతంగా సమాజంలో పరివర్తన తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన సమాజాన్ని సృష్టించే దిశగా 1965 నుండి కృషి చేస్తున్న ఒక NGO అని ఫలితాలు చూపించాయి.వీడియో తేదీని ధృవీకరించడానికి మేము రాష్ట్రోత్థాన పరిషత్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్‌లను పరిశీలించాము. వారి బ్లాగ్ పోస్ట్‌లలో ఒకదానిలో, వారు ఈ ఈవెంట్ గురించి వ్రాసారు మరియు అదే చిత్రాలను షేర్ చేసారు.

అంతరిక్ష శోధనలో అతను సాధించిన విజయాలను జరుపుకోవడానికి మరియు ఇస్రో యొక్క భవిష్యత్తు మిషన్లకు తన మద్దతును తెలియజేయడానికి” ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బ్లాగ్ పోస్ట్ పేర్కొంది.

మేము బహుళ కీవర్డ్‌లను ఉపయోగించి వీడియోని ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కర్ణాటకలోని విశ్వ సంవాద కేంద్రం చేసిన ఈ ట్వీట్‌ని చూశాము. వీడియోలో పేర్కొన్నట్లుగా ఇస్రో చీఫ్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అతను ‘తపాస్’ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తులను కలవడానికి రాష్ట్రోత్థాన పరిషత్‌ని సందర్శించారు. ఈ NGO చేస్తున్న ప్రాజెక్ట్ సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులను IITలో చదివేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి,ఇది తప్పుడు వాదన/claim.

CLAIM/దావా: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత ఇస్రో చీఫ్, ఎస్ సోమనాథ్ బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు.

నిర్ధారణ:ఈ వీడియో జూలై 2023 నాటిది, S సోమనాథ్ బెంగళూరులోని ఒక NGOని సందర్శించి, చంద్రయాన్-3 మిషన్‌కు నాయకత్వం వహించినందుకు సత్కరించారు.అంతే కాని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించలేదు.

RATING: Misrepresentation —

[మరి కొన్ని Fact Checks:: Does this video show ISRO Chief celebrating success of Chandrayaan-3? Fact Check]

సమయం వెనుకకు నడిచే సమాంతర విశ్వంని NASA కనుగొందా? Fact Check

సమయం వ్యతిరేక దిశలో (సమయం వెనుకకు)వెలుతున్న సమాంతర విశ్వాన్ని NASA కనిపెట్టిందనే వాదనలతో ఇంటర్నెట్ సంచలనమైంది.అనేక వార్తాపత్రికలు మే 20 మరియు 21 తేదీలలో ఈ కథనాన్ని Google search ట్రెండ్‌లలో అగ్రస్థానంలో ప్రసారం చేశాయి, ఎక్కువగా న్యూయార్క్ పోస్ట్, ఎక్స్‌ప్రెస్ మరియు డైలీ స్టార్ వంటి టాబ్లాయిడ్‌లు ‘నాసా శాస్త్రవేత్తల వద్ద సమాంతర విశ్వం ఉందని నిరూపించగల సాక్ష్యాలు ఉన్నాయని’ కోట్ చేసారు.

మే 21న సెర్చ్ స్ట్రింగ్ ‘ప్యారలల్ యూనివర్స్’ కోసం గత 24 గంటల యొక్క Google గ్రాఫ్ని దిగువన చూడండి:

NASA ఈ సమాంతర విశ్వాన్ని కనుగొన్నట్లు అన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి మరియు Google searchలో కొన్ని ఫలితాలు క్రింద చూడగలరు:

Fact Check

న్యూ సైంటిస్ట్‌లోని ఒక వార్తా కథనం ప్రకారం,భూమి వాతావరణంలోకి cosmic-rays ప్రవేశించడం వలన కలిగె గాలి జల్లులను (air showers) గుర్తించే అంటార్కిటిక్ ఇంపల్సివ్ ట్రాన్సియెంట్ యాంటెన్నా (ANITA– 37,000 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న బెలూన్‌పై అమర్చిన ఒక రేడియో డిటెక్టర్‌ను) NASA బృందం వారు ఆపరేట్ చేస్తున్నారు.అంటార్కిటికాలో రీడింగులను వక్రీకరించే రేడియో శబ్దం(radio noise) లేనందున, ANITA దానిపై హోవర్ చేయగలదు.

యాంటెన్నా ఇప్పటివరకు భౌతిక శాస్త్రంలో తెలిసినట్లుగా బాహ్య అంతరిక్షం నుండి క్రిందికి ప్రవహించకుండా భూమి లోపల నుండి పైకి ప్రయాణించే అధిక-శక్తి కణాల “గాలి”ని(“wind” of high-energy particles) కనుగొంది. దీనికి మరింత వివరణ ఇస్తు, పీటర్ గోర్హామ్ అనే ఒక పరిశోధకుడు, సమాంతర విశ్వం ఉనికిలో ఉండవచ్చని మరియు దానిలో సమయం రివర్స్‌లో( వెనుకకు ) వెలుతుందనే అనే సిద్ధాంతాన్ని ఉదహరించారు.

వాస్తవానికి, సమాంతర విశ్వం యొక్క సిద్ధాంతం పాత కల్పన కానీ ఈ ఊహ ఆధారంగా అనేక హాలీవుడ్ సినిమాలు నిర్మించబడ్డాయి. ప్రముఖ సిట్‌కామ్ ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లో ప్రధాన నటుడు లియోనార్డ్, షెల్డన్ కూపర్‌తో కలిసి అంటార్కిటికాను సందర్శించి “గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ” చేస్తాడు, కానీ ప్రయత్నం ఫలించదు. ఈసారి NASAకి ఆపాదించబడిన claim/వాదన వైరల్‌గా మారింది.

Credit: NASA

2006లో మరియు 2014లో ANITA ప్రాజెక్ట్ కనుగొన్న కణాల(particles) ప్రవర్తన భౌతిక శాస్త్రంలో తెలిసిన కణాలకు బిన్నంగా ఉంది.లేదా కణాలు కనుగొనబడిన అంటార్కిటికాలోని మంచుతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. కణాల యొక్క విచిత్రమైన తలక్రిందుల కదలిక పరిశిలిస్తే, ఎక్కడో, సమయం వెనుకకు వెలుతుందని, అందుకే, సమాంతర విశ్వం యొక్క ఆలోచన ఉద్భవించిందని, దీనిలో సమయం మరియు భౌతిక శాస్త్రం రెండూ భిన్నంగా ప్రవర్తిస్తాయనే ముందుకు తీసుకురాబడింది.

Australia’s national science ఏజెన్సీ యొక్క గౌరవ సభ్యుడు ‘Ron Ekers’ CNETతో ఇలా అన్నారు: “నాలుగు సంవత్సరాల తర్వాత ANITA కనుకొన్న అసాధారణ సంఘటనల గురించి సంతృప్తికరమైన వివరణ లేదు కాబట్టి , ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్న వారిని ఇది చాలా నిరాశపరిచింది.

కానీ కొన్ని వార్తలు పేర్కొన్నట్లు NASA ఈ సమాంతర విశ్వంని కనుగొనలేదు. NASA వెబ్‌సైట్‌లో అటువంటి దావా/వాదన గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. సమయం వెనుకకు నడిచే సమాంతర విశ్వంని NASA నిజంగా కనిపెట్టినట్లయితే, , అది పరిశోధకులకు తగిన గుర్తింపు ఇచ్చీ అధికారిక ప్రకటన చేసి ఉండెది.

Claim/వాదన: సమయం వెనుకకు నడిచే సమాంతర విశ్వంని NASA కనుగొందా? Fact Check

నిర్ధారణ: ఈ వాదనలు NASA చేసినవి కావు, సమాంతర విశ్వంని గురించి NASAకి ఆపాదించబడిన claim/వాదన తప్పు. 
Rating Misrepresentation .

సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు ఆపాదించబడిన తప్పుడు దావా/వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది; Fact Check

భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ‘ప్రజలను వీధుల్లోకి రావాలని మరియు వారి హక్కులను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని’ కోరుతున్నట్టు ఆయన ఫోటోతో ఉన్న ఒక సందేశం వాట్సాప్‌లో షేర్ చేయబడుతోంది.

“భారత ప్రజాస్వామ్యం సుప్రీం కోర్ట్ జిందాబాద్” అని రాసి ఉన్న శీర్షికతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఫోటోను షేర్ చేయబడింది. ఫోటో మీద క్రింద విధంగా వ్రాసీ ఉంది.

“మేము భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అయితే మీ సహకారం కూడా చాలా ముఖ్యం. దీని కోసం ప్రజలందరూ సంఘటితమై వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని అడగాలి. ఈ నియంతృత్వ ప్రభుత్వం ప్రజలను భయపెడుతుంది మరియు బెదిరిస్తుంది, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి మరియు ప్రభుత్వాన్ని అడగండి, నేను మీతో ఉన్నాను.”

భారతదేశ సుప్రీం కోర్టు యొక్క అత్యున్నత పదవిని కలిగి ఉన్న అత్యున్నత న్యాయమూర్తి అయిన CJIకి సంబంధించిన పోస్ట్‌లోని విషయాల యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయడానికి Digiteye India బృందం వాట్సాప్ అభ్యర్థనను(WhatsApp request) స్వీకరించింది.

FACT CHECK

Digiteye India బృందం అనేక అంశాలలో కోట్/Claim నకిలీదని గుర్తించింది. ఏ సీజేఐ(CJI) కూడా ఇలాంటి అప్పీలు చేయరు.వ్యాకరణం మరియు వాక్యాలలో తప్పులు చూస్తే ఆ పోస్ట్ CJI నుండి వచ్చింది కాదని వెల్లడవుతుంది.“ఇది ఫేక్ ఫార్వార్డ్”. సీజేఐ చంద్రచూడ్ లాంటి వారు అలాంటి పని చేయరు. భారత ప్రధాన న్యాయమూర్తి పైన చేసిన ఇటువంటి తీవ్రమైన దుశ్చర్యలకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ” అని భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పునరుద్ఘాటించారు.

వెంటనే CJI మరియు సుప్రీం కోర్ట్ కార్యాలయాలు సోమవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసి, సుప్రీం కోర్ట్ యొక్క ఉన్నత న్యాయమూర్తి అటువంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదని మరియు ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న సందేశాలు(Messages) తప్పుడు సందేశాలని పేర్కొంది. వారిచ్చిన ప్రకటన కాపీని ఇక్కడ చూడండి:

పై ప్రకటన అనువాదం: ఈ సందేశం(Message) యొక్క వాస్తవికతను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, “సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ యొక్క ఫైల్ ఫోటోను ఉపయోగించి ఆయనను తప్పుగా ఉటంకిస్తూ( Quote చేస్తు) ప్రచారం చేస్తున్నారనే పోస్ట్ చేయడం భారత సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.ఇది నకిలీ మరియు దురుద్దేశం కలిగిన పోస్ట్. భారత ప్రధాన న్యాయమూర్తి అటువంటి పోస్ట్‌ను జారీ చేయలేదు మరియు అటువంటి పోస్ట్‌కు అధికారిక అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేసే అధికారులతో తగిన చర్యలు తీసుకుంటున్నాం.”

Claim/వాదన: భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రజలు ఏకమై తమ హక్కుల కోసం అధికారులపై పోరాడాలని కోరారు.

నిర్ధారణ: లేదు, జస్టిస్ చంద్రచూడ్ ఎప్పుడూ అలాంటి పోస్ట్‌ను జారీ చేయలేదు మరియు అలాంటి పోస్ట్‌కు అధికారిక అనుమతి ఇవ్వలేదు.

Rating: Totally False —

[మరి కొన్ని Fact Checks: Did laser beam weapons from space cause Hawaii wildfires? Fact Check]

No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Check]

 

2019 సం.లో రెస్క్యూ చేసిన కుక్కపిల్లల పాత వీడియో, టర్కీ భూకంపంలో రెస్క్యూ చేసిన వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అయింది; Fact Check

టర్కీ మరియు సిరియాలో భూకంపం సంభవించి,ముఖ్య వార్తగా వెలువడుతున్న సమయంలో, కుక్కపిల్లల తల్లి ఆత్రుతగా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతు,అతను కుక్కపిల్లలను ఎలా రక్షించాడో చూపిస్తూ ఒక వీడియో వైరల్ అయ్యింది. తాజా భూకంప ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో జరిగిన వాదనను మరియు వీడియోను చూడండి.

టర్కీలో భూకంపంలో శిథిలాలు క్రింద చిక్కుకున్నఈ కుక్కపిల్లల్ని 7 రోజుల తర్వాత రెస్క్యూ బృందాలు రక్షించగలిగాయి!  #Turkey_earthquake #earthquaketurkey #HelpTurkey #Turcja #Turquie #Turquia #Turchia #earthquakeinsyria #Syria #depremzede #AhbapDernegi #earthquake #earthquakes. pic.twitter.com/rcIamjvxkx

— Abdul Ahad (@OneAahad) February 14, 2023

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది. “టర్కీ భూకంపం” అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న క్యాప్షన్, ఇది టర్కీ నుండి తీసుకోబడింది అని సూచించింది. ఈ వైరల్ వీడియోకి ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో వేల సంఖ్యలో లైక్‌లు మరియు రీట్వీట్‌లు వచ్చాయి.

FACT CHECK

వీడియోలో శీతాకాలపు దుస్తులు ధరించకుండా ఉన్న వ్యక్తిని చూసి ‘DigitEye India బృందం’, Youtube మరియు Google రివర్స్ ఇమేజ్నలో వీడియో యొక్క మూలాన్ని పరిశీలించి, వాస్తవాని తెలుసుకున్నారు. నిజానికీ ఇది 2019లో భారతదేశం నుంచీ అప్‌లోడ్ చేయబడిన వీడియో అని, అది రాజస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలిపోవడంతో ఒక వ్యక్తి కుక్కపిల్లలను ఎలా రక్షించాడో చూపిస్తూన్న వీడియో.

ఆ వ్యక్తి వేసుకున్నా టీ-షర్ట్ వెనకల “AnimalAid Unlimited” అని కనిపిస్తుంది, ఇది ఉదయపూర్‌లోని వీధి జంతువులను రక్షించే మరియు సహాయం చేసే ఒక NGO.వాస్తవానికి ఈ వీడియోను NGO వారి యూట్యూబ్ ఛానెల్‌లో ఆగస్టు 8,2019న షేర్ చేసింది. భారీ వర్షాల కారణంగా కుప్పకూలిన ఇంటి శిథిలాల కింద తన కుక్కపిల్లలు చిక్కుకోవడంతో ఏడుస్తున్న తల్లి కుక్క గురించి NGOకి సమాచారం అందినట్లు వివరించారు.వెంటనే, NGO సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ అసలు వీడియో(original video)లో చూపిన విధంగా కుక్కపిల్లలను రక్షించారు.

అందువల్ల, టర్కీ భూకంపం సహాయక చర్యల భాగంగా తీసిన వీడియో అనే వాదన తప్పు.

వాదన/Claim:ఇటీవలి టర్కీ భూకంపం విపత్తు సమయంలో కుక్కపిల్లలను రక్షించినట్లు వీడియో చూపిస్తుంది.
నిర్ధారణ: భారతదేశం నుంచీ అప్‌లోడ్ చేయబడిన పాత వీడియో. టర్కీ భూకంపం సమయంలోనిది కాదు.
Rating: Misrepresentation —

[మరి కొన్ని FACT CHECKS చూడండి:

No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Check]

  Did Turkey release stamp on Modi after India’s help in earthquake relief operations? Fact Check]

 

 

 

 

 

 

 

 

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ GST రేటును 31.3% నుండి 18%కి తగ్గించిన తర్వాత మొబైల్ ఫోన్‌లు, టీవీలు మరియు రిఫ్రిజిరేటర్‌లు చౌకగా మారాయని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది.
ఇది ఇక్కడ మరియు ఇక్కడ సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ, చాలా మంది ‘GST రేట్లు పెంచినప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు బయటకు వచ్చి అభినందించాలి’ అంటూ సందేశాలు పోస్ట్ చేశారు. అనేక మీడియా సంస్థలు మరియు అధికారిక వెబ్‌సైట్‌లు ఇదే సందేశాన్ని వెళ్ళడించాయి.

గృహోపకరణాల ధరలపై పెద్ద ఉపశమనం: కొత్త GST రేట్ల క్రింద ఉన్న వస్తువుల జాబితాను చూడవచ్చును 👇#GST #India #House #TV #Mobile #Tax pic.twitter.com/GcjTgpv6Wt

— ET NOW (@ETNOWlive) July 2, 2023

PIB కూడా ఇదే సందేశాన్ని షేర్ చేసింది.
తగ్గిన పన్నులతో, #GST ప్రతి ఇంటికి ఆనందాన్ని తెస్తుంది:గృహోపకరణాలు మరియు మొబైల్ ఫోన్‌లపై #GST ద్వారా ఎంతో ఉపశమనం📱🖥️#6YearsofGST #TaxReforms

#GSTforGrowth pic.twitter.com/LgjGQMbw6e

— PIB India (@PIB_India) June 30, 2023

FACT CHECK

DigitEye బృందం వారు GST కౌన్సిల్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించినప్పుడు, కౌన్సిల్ నుండి అలాంటి నోటిఫికేషన్/సూచన ఏదీ చేయలేదు.అంతేకాకుండా, వైరల్ పోస్ట్‌లో పేర్కొన్న విధంగా 31.3% కాకుండ ప్రస్తుత GST స్లాబ్‌లు 5%, 12%, 18% మరియు గరిష్టంగా 28% వరకు ఉన్నాయి. GST అమలై 6 సంవత్సరాలైన సందర్బాన్ని (6వ వార్షికోత్సవం) 01 జూలై 2023న న్యూఢిల్లీలో ‘GST డే’గా జరుపుకుంది.ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2017లో GSTని ప్రవేశపెట్టడానికి ముందు మరియు తర్వాత యొక్క పన్నులను పోలుస్తూ,GST యొక్క ప్రయోజనాలను హైలైట్ చేసారు.

నేటి నుంచే జీఎస్టీ రేట్లు తగ్గింపు…

ఎవరైతే ‘GST’ రేట్లు పెంచినప్పుడు విమర్శించినారో వారు ఇప్పుడు బయటకు వచ్చి అభినందించాలి. pic.twitter.com/H2ljyr5cKS

— Novice2NSE (@Novice2NSE) July 1, 2023

వాదన ప్రకారం GST తగ్గిందని సోషల్ మీడియా విస్తృతంగా షేర్ చేయబడ్డది.అలానే Zee News, ABP Live, News18, Jagran, India TV, ET Now వంటి అనేక మీడియా సంస్థలు ఇదే సందేశాన్ని అందించాయి. వాస్తవం ఏమిటంటే GSTని ప్రవేశపెట్టడానికి ముందు మరియు తర్వాత యొక్క పన్నుల(SST) పోలిక మాత్రమే, కాని మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై ప్రస్తుత GST రేటు తగ్గిందని  కాదు. 2020లో కొన్ని గృహోపకరణాలపై రేటు తగ్గించబడింది లేదా పెంచబడింది, కాని ఇప్పుడు కాదు.

తగ్గిన పన్నులతో, #GST ప్రతి ఇంటికి ఆనందాన్ని తెస్తుంది:గృహోపకరణాలు మరియు మొబైల్ ఫోన్‌లపై #GST ద్వారా ఎంతో ఉపశమనం📱🖥️#6YearsofGST pic.twitter.com/JzMGqZjFSA

— CBIC (@cbic_india) July 4, 2023

[ఇది కూడా చూడండి:Did TTD reject KMF bid for supply of Nandini ghee after 50 years? Fact Check]

Central Board of Indirect Taxes & Customs తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వివిధ గృహోపకరణాలపై పన్ను రేట్లు 2017లో GST అమలుకు ముందు మరియు తర్వాత ఉన్నాయని స్పష్టత ఇచ్చింది.పైన పేర్కొన్న ఉపకరణాల రేట్లు 2020లో 28%కి పెంచబడ్డాయి.
అందువల్ల, వాదన/దావా తప్పుదారి పట్టించే విధంగా వుంది, మరియు అది నిజం కాదు.

ప్రస్తుత GST రేట్లు

CBIC వెబ్‌సైట్ మరియు గృహోపకరణాలపై GST యొక్క తాజా సవరణ ప్రకారం, 1 ఏప్రిల్ 2023న నిర్ణయించబడిన పన్ను రేట్లు మారవు. మొబైల్ ఫోన్‌లు, టెలివిజన్‌లు (32 inches కంటే తక్కువ) మరియు రిఫ్రిజిరేటర్‌లకు ప్రస్తుత GST రేట్లు 18%.
2020లో మొబైల్ ఫోన్‌లకు (12% నుండి 18% వరకు), మరియు 2018లో రిఫ్రిజిరేటర్‌లు,టెలివిజన్‌లకు (32 అంగుళాల వరకు) (28% నుండి 18% వరకు) ఈ రేట్ల చివరి సవరణ జరిగింది.

వాదన/Claim: GST రేటును 31.3% నుండి 18%కి తగ్గించిన తర్వాత మొబైల్ ఫోన్‌లు, టీవీలు మరియు రిఫ్రిజిరేటర్లు చౌకగా మారాయి.

నిర్ధారణ: పేర్కొన్న గృహోపకరణాలపై పన్ను రేట్ల సవరణకు సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 01 ఏప్రిల్ 2023న నిర్ణయించబడిన పన్ను రేట్లు నేటికీ మారలేదు.

మొబైల్ ఫోన్‌లు, టెలివిజన్‌లు (32 inches కంటే తక్కువ) మరియు రిఫ్రిజిరేటర్‌లకు ప్రస్తుత GST రేట్లు 18%.
2020లో మొబైల్ ఫోన్‌లకు (12% నుండి 18% వరకు), మరియు 2018లో రిఫ్రిజిరేటర్‌లు,టెలివిజన్‌లకు (32 అంగుళాల వరకు) (28% నుండి 18% వరకు) ఈ రేట్ల చివరి సవరణ జరిగింది.

అధికారిక ప్రకటన ప్రకారం GSTకి ముందు మరియు GSTకి తరువాత రేట్లు, అంతేకాని తాజాగా తగ్గించలేదు.
తాజా తగ్గింపుగా తప్పుగా సూచించబడింది.
Rating: Misleading —

[ఇది కూడా చూడండి: No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Check]